మల్లిక్ (గాయకుడు): కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మల్లిక్ (1921-1996) 1921లో బందరులో జన్మించిన కందుల మల్లికార్జునరావు చ...
(తేడా లేదు)

11:08, 20 డిసెంబరు 2013 నాటి కూర్పు

మల్లిక్ (1921-1996)

1921లో బందరులో జన్మించిన కందుల మల్లికార్జునరావు చక్కటి సంగీత విద్వాంసులు. లలిత సంగీత విభాగంలో జానపద సంగీతంలో తన ప్రత్యేకతను -కొన్నారు. మచిలిపట్నంలో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో లలిత సంగీత గాయకులుగా ఆ తరువాత విజయవాడ కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు. లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, శాస్త్రీయ సంగీతాలలో ఆయన తనదైన బాణీ -కొన్నారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు వొరవడి పెట్టారు.

ఆయన మదరాసు, హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి, 1981లో పదవీ విరమణ చేశారు.

అదిగో అల్లదిగో హరివాసము, తందనాన భళా తందనాన అన్నమయ్య కీర్తనలు వీరు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. రజనీకాంతరావు గారి పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసి తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు. జానపద, లలిత సంగీత బాణీలలో తనదైన ముద్రవేసి పాడేవారు. స్వరపరచేవారు. ఎన్నో సంగీత, నృత్య రూపకాలకు సంగీతం సమకూర్చారు.

కలకత్తాలోని పంకజ్ మల్లిక్ చాలా ప్రసిద్ధులు. ఆ పేరుతో మల్లిక్ - లోకానికి పరిచితులు. లలిత సంగీతం ఆడిషన్ బోర్డు మెంబరుగా ఆకాశవాణికి సలహా సంప్రదింపులు అందించారు.

మల్లిక్ బంగారుపాప, భాగ్యరేఖ, వింధ్యరాణి, సంపూర్ణ రామాయణం, భక్త శబరి, జయభేరి, చరణదాసి చిత్రాలలొ పాడారు. తమిళ చలనచిత్రరంగంలో - నేపథ్యగాయకుడు మల్లిక్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రలేఖ అనే తమిళచిత్రానికి తొలిసారిగా నేపథ్యగానం చేశారు.

1952 నుండి 1993 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు. - వెంకటేశ్వరునిపై అపార భక్తిప్రపత్తులు. అందుకేనేమో 1996 ఏప్రిల్ శనివారం 76వ ఏట విజయవాడలో ఆయన సునాయాస మరణం పొందారు.