రాజా భర్మల్ (1498 - 1574 జనవరి 27) అమర్ (ప్రస్తుత రాజస్థాను రాష్ట్రంలోని జైపూరు) రాజపుత్ర పాలకుడు. అతడికి బీహారీ మాలు, భగ్మలు బీహారు మాలు అనే పేర్లు కూడా ఉన్నాయి.

Bhar Mal
Raja
Reign1 June 1548 – 27 January 1574
PredecessorAskaran
SuccessorRaja Bhagwant Das
జననంc. 1498
Amer Kingdom, Rajputana
మరణం27 January 1574 (aged 75–76)
Lahore
Burial
SpouseRani Mainwati

Padmavati

Dayawati
Issue
  • Bhagwant Das (1537–1589)
  • Bhagwan Das Bankawat
  • Mariam-uz-Zamani (1542–1623)
  • Khanghar Singh (1539–1592)
  • Jaggnath Singh (1540–1612)
  • Raj Singh (1544–1582)
  • Maharani Sukanya of Dhawalgarh (1546–1611)
  • Rajkumari Shivani (1550–1605)
తండ్రిRaja Prithviraj Singh I
తల్లిRani Apoorva Devi

బిహారి మల్ మొఘలు చక్రవర్తి అక్బరును వివాహం చేసుకున్న (1562 ఫిబ్రవరి), మొఘలు చక్రవర్తి జహంగీరు తల్లి అయిన జోధా బాయి (హర్ఖాబాయి లేదా హిరా కున్వారీ అని కూడా పిలుస్తారు) తండ్రి. ఆ సమయంలో హిందూ-ముస్లిం సంబంధాలలో ఇది ఒక ముఖ్యమైన సంఘటన. బిహారి మల్ లాహోర్ యుద్ధంలో చంపబడ్డాడు.

కుటుంబం మార్చు

బీహారీ మాల్ 1498 లో జన్మించాడు. రాజా పృథ్వీరాజ్ చౌహాన్ నాల్గవ కుమారుడు (మొదటి పృధ్వి సింగు 1503 జనవరి 17 - 1527 నవంబరు 4) రాథోరు వంశానికి చెందిన రాణి అపూర్వా దేవి (బాలాబాయి నాల్గవ కుమారుడు.[1]

1527 లో పృథ్వీరాజ్ మరణం తరువాత రాజా పూరణ్ మాల్ (5 నవంబర్ 1527 - 19 జనవరి 1534) తన్వర్ రాణికి జన్మిచిన ఆయన పెద్ద కుమారుడు సింహాసనం అధిష్టించాడు. 1931 జనవరి 15 న మొఘలు చక్రవర్తి హుమయూనుకు బయానా కోటను స్వాధీనం చేసుకొనే సమయంలో హుమాయూనుకు సహరిస్తూ మందరైల్ యుద్ధంలో పోరాడుతూ ఆయన మరణించారు. ఆయనకు సుజుమల్ అనే కుమారుడు ఉండేవాడు. ఆ సమయంలో అతను చిన్న వయస్సులో ఉన్నందున అతని తండ్రి తరువాత సిహాసనం అధిష్టించ లేదు.

పూరరణ్ మాల్ తరువాత తమ్ముడు భీం సింగ్ (r.1534 - 22 జూలై 1537), (రాణి అపూర్వా దేవి ద్వితీయ కుమారుడు) అధికారపీఠం అధిష్టించాడు. అధికారం కోల్పోయిన సుజమల్ తన్వర్ రాజ కుటుంబంలో ఆశ్రయం పొందాడు. భీమ్ సింగ్ తరువాత పెద్ద కుమారుడు రతన్ సింగ్ (1537 - 15 మే 1548) చేత అధికారం చేపట్టాడు. తరువాతి రోజు రాజు రతన్ సింగును ఆయన సవతి సోదరుడు అస్కరన్ చంపి అధికారం చేపట్టాడు. కానీ అంబరు కులీనులు సంఘటితమై 1548 జూన్ 1 న అస్కరనును పదవి నుండి తొలగించి అతనిని విడిచిపెట్టాడు బిహారీ మాలును తిరిగి అమెర్ పాలకుడుని చేసారు.[1]

పరిపాలన ఆరంభంలో పరిస్థితి మార్చు

1527 లో బిహారీ మాల్ పెద్ద సోదరుడు పూరాణ్ మల్ సింహాసనాన్ని అధిష్టించినప్పుడు, రాజకీయ పరిస్థితులు చాలా అనిశ్చితంగా ఉన్నాయి. రానా సంగా నాయకత్వంలోని రాజపుత్ర సమాఖ్యకు ఖానువా యుద్ధంలో గొప్ప నష్టాన్ని ఎదురైంది. భారతదేశంలో మొఘలు అధికారం స్థిరపడలేదు. ఇతర ముస్లిం పాలకులు, బాబూరు కుమారుడైన హుమయూనును తొలగించి భారతదేశం నుండి వెలుపలకు తరిమి అధికారం పొందారు. వారిలో గుజరాతు బహదూరు షా, షేర్ ఖాన్ (తరువాత షేర్ షా సూరి) ప్రధానులు.

మొట్టమొదటిగా మొఘలులు పురాణ్ మలును విశ్వసించతగిన వ్యక్తిగా గ్రహించారు. వారు ముస్లిం పాలకుల పాత పాలకుల వంటివారు కాదు. అందువలన పురాణ్ మల్ మొఘలులకు రాజపుత్రుల సేవలు అందించిన వారిలో మొదటివాడుగా ఉన్నాడు. ఈ విధంగా రాజపుతానాలో కచ్వాహాలు మొఘలుల మొదటి మిత్రరాజ్యాలు అయ్యారు. మొఘలుల పట్ల బిహారి మల్ విధానం అతని సోదరుడి విధానం పొడిగింపు అయింది.

బహదూర్ షా విస్తరణ విధానాన్ని అనుసరించాడు. ఆయన టాటర్ ఖాన్ లోడికి సహాయం చేసి బేనా కోటను ఆక్రమించుకోవడానికి పంపాడు. ఆయన బాబర్ కాలం నుండి మొఘలు ఆక్రమణలో ఉన్న బయానా కోటను ఆక్రమించుకున్నాడు. హుమాయున్ అతని సోదరులు అస్కారి మిర్జా, హిందాలు మీర్జాను ఈ కోటను స్వాధీనం చేసుకునేందుకు పంపించాడు. 1534 లో అంబరు రాజు పురాణ్ మల్ మొఘలులకు అనుకూలంగా " మందరైల్ యుద్ధం " లో పాల్గొన్నాడు.

తరువాత సంవత్సరం గుజరాతు బహదూర్ షా చిట్టోరు కోటను చుట్టుముట్టారు. ఫలితంగా హుమాయును బహదూరు షాకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రారంభించాడు. రాణా సంగా భార్య రాణి కర్మవతి చిట్టోరు ప్రతినిధిగా పాలించింది. ఆమె మొఘలులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించింది. హుమాయునుకు రాఖీని పంపింది. కానీ హుమాయును నమ్మకం లేదా మందగింపు కారణంగా సమయానికి రాలేదు. ఆయన సకాలంలో కర్మవతికి సహాయం చేస్తే బహుశా సిసోడియాస్ వారి సన్నిహితులు మిత్రవర్గం అయ్యేవారు. ఫలితంగా చిత్తూరు భస్మం అయ్యింది. కోటలో ఉన్న స్త్రీలు జౌహరులో పురుషులు యుద్ధంలో మరణించారు.

మతం మార్చు

నమోదు చేయబడిన రికార్డు ఆధారంగా తండ్రి అనుసరించిన మను సూత్రాలను అనుసరించలేదని భావిస్తున్నారు. బారా కోటిస్ నాయకత్వంలొ ఆ సమయంలో ఆధిపత్యం చేస్తున్న కచ్వహాలందరి సామూహిక ఎంపికను అనుసరించడానికి వెసులుబాటు కలిగింది. మేధావి అయిన అక్బర్ చక్రవర్తి హిందూ మతం విషయంలో అనుసరించిన సరళమైన విధానంతో ఆకర్షితులైన రాజా బిహారీ మాల్ వారసులు మొఘలులకు తమ సేవలను అందించారు. ఇది కచ్వాహుల మద్దతు కారణంగా బలమైన సామ్రాజ్యంగా మారింది. ఔరంగజేబ్ పాలన వరకు రాజపుతానాలోని దుందుర్ ప్రాంతంలో ఎప్పుడూ యుద్ధం జరగలేదు.

అక్బర్, బీహారీ మాల్ మార్చు

1556 లో మొఘల్ సైనికాధికారి మజునాన్ ఖాన్ ఖ్వాఖ్షాలుకు సహాయం చేసాడు. మజునాన్ ఖాను తరువాత అక్బరుకు తెలియజేసాడు. తరువాత అక్బర్ బిహారీ మాలును ఢిల్లీ సభకు ఆహ్వానించి సత్కరించాడు. 1562 లో మీర్జా మొహమ్మద్ షరాఫ్-ఉద్-దిన్ హుస్సేనును " మేవతు " మొఘలు గవర్నరుగా నియమించిన తరువాత కచ్వాహాల పరిస్థితి క్లిష్టంగా మారింది. సుజమల్ ఆయన సభకు చేరుకుని అమెర్ సింహాసనాన్ని గెలుచుకునేందుకు తన మద్దతును తెలిపాడు. మీర్జా అంబరుకు పెద్ద సైన్యాన్ని నడిపించాడు. ఎదుర్కొనేందుకు బిహారీ మల్ ఎటువంటి సన్నాహం చేయలేదు. ఆయన కచ్వాహాస్ అంబరును వదిలి అడవిలోనూ కొండలలోనూ నివసించాలని వత్తిడి చేసాడు. బీహారీ మాల్ మీర్జాకు ఒక స్థిరమైన కప్పం చెల్లిస్తానని హామీ ఇచ్చి తన సొంత కుమారుడు జగన్నాథు, ఆయన మేనల్లుళ్ళు రాజ్ సింగు, ఖాన్గరు సింగులను కప్పం చెల్లించేవరకు మిర్జాస్వాధీనంలో ఉంచాడు.[2]


షరాఫ్-ఉద్-డిన్ మళ్లీ అంబరును ముట్టడించేందుకు సిద్ధమైనప్పుడు, బిహారీ మల్ అక్బరు న్యాయస్థానం చాఘాటై ఖానును కలుసుకున్నాడు. అంబరు రాజా అదృష్టవశాత్తూ అక్బరు ఆగ్రా నుండి అజ్మీరు (ఖ్వాజా మోయిన్యుడిన్ చిస్తీ దర్గాకు యాత్రా స్థలంలో) మార్గంలో ఉన్న కరావాలి (ఆగ్రా సమీపంలోని గ్రామం) వద్ద ఉన్నాడు. చంఘాటై ఖాను బీహారీ మల్ తరఫున అక్బరును వేడుకున్నాడు. అక్బరు రాజా బీహారి మాలును తన సభకు పిలిచాడు. తరువాత బిహారి మల్ సోదరుడు రుపిసీ బైరాగి, అతని కుమారుడు జైమల్ దౌసాలో అక్బరును కలుసుకున్నారు. 2062 జనవరి 15 న సంగనేర్ వద్ద అతని శిబిరంలో రాజా బిహారీ మాల్ స్వయంగా అక్బరును కలుసుకున్నాడు.

చంఘాటై ఖాను అక్బరుకు బిహారీ మాల్, ఆయన బంధువులను పరిచయం చేసాడు. బీహారీ మాల్ తన పెద్ద కుమార్తె హిరా కున్వారిని అక్బరుకు ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిపాదించారు. అక్బరు అందుకు సమ్మతించి అవసరమైన ఏర్పాట్లు చేయమని చంఘాటై ఖానును ఆదేశించాడు. అక్బరు అజ్మీరు నుండి తిరిగి వచ్చిన తరువాత మిర్జా తన బందీలు జగన్నాథు, రాజ్ సింగు, ఖంగరులను అక్బరుకు అప్పగించి లొంగిపోయాడు. బిహారీ మాల్ కూడా శంభరుకు చేరుకుని 1562 ఫిబ్రవరి 6 న ఆయన కుమార్తెను అక్బరుకు ఇచ్చి వివాహం చేసాడు.

1562 ఫిబ్రవరి 10 న అక్బరు కొత్త కచ్వాహా బంధువులు అతడి నుండి అధికారికంగా సెలవును తీసుకోవటానికి రతన్పురా వద్ద తన శిబిరానికి వచ్చారు. ఇక్కడ మాన్ సింగ్ ఆయనకు అప్పగించబడ్డాదు. అక్కడి నుండి, భగవంత్ దాస్, మాన్ సింగు, వారి బంధువులు అనేకులు అక్బరుతో కలిసి ఆగ్రాకు వచ్చారు.[2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Sarkar, J. N. (1994) [1984]. A History of Jaipur (Reprinted ed.). Orient Longman. pp. 31–34. ISBN 81-250-0333-9.
  2. 2.0 2.1 Sarkar, J.N. (1984, reprint 1994). A History of Jaipur, New Delhi: Orient Longman, ISBN 81-250-0333-9, pp.34-7