అడవిదేవులపల్లి మండలం

తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం
04:00, 25 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

అడవిదేవులపల్లి, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం,గ్రామం.[1]

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనలో భాగంగా కొత్త మండలంగా 2016 అక్టోబరు 11 నుండి రెవెన్యూ మండలంగా పరిగణనలోకి వచ్చింది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా- మొత్తం 7,556 - పురుషుల సంఖ్య 3,843 - స్త్రీల సంఖ్య 3,713 - గృహాల సంఖ్య 1,891

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. ముదిమానికం
  2. అడవిదేవులపల్లి
  3. ఉల్షాయపాలెం
  4. ముల్కచర్ల
  5. బాలీన్‌పల్లి
  6. చిట్యాల

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు