జనతాదళ్ (యునైటెడ్)

14:43, 30 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

జనతా దళ్(యునైటెడ్) సంక్షిప్తంగా జెడి (యు) భారతదేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీ ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారతదేశంలో రాజకీయ ఉనికిని కలిగి ఉన్నడి. జనతా దళ్(యునైటెడ్) పార్టీలో చీలిక కారణంగా రెండు వర్గాలుగా విడిపోయింది జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలోని జెడి(ఎస్), జనతాదళ్ (యునైటెడ్)గా ఉన్నాయి. ఈ పార్టీ ప్రముఖ నాయకులలో ఒకరైన నితీష్ కుమార్ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ కూటమి మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జెడి (యు) బీహార్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తించబడింది అలాగే బీహార్ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉంది. అరుణాంచల్ ప్రదేశ్‌లో ప్రతిపక్ష పాటి హోదాలో ఉంది. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో జెడి (యు) 16 సీట్లు గెలుచుకుని, లోక్సభలో ఏడవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. పార్టీ సోషలిజం, లౌకికవాదం అలాగే సమగ్ర మానవతావాదం సిద్ధాంతాలపై పనిచేస్తుంది.

మూలాలు