కందుల వెంకటేష్
కందుల వెంకటేష్ (జననం 1979) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాణేల సేకర్త(numismatist), పరిశోధకుడు.
కందుల వెంకటేష్ | |
---|---|
జననం | 1979 |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నాణేల సేకర్త(numismatist) |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకుని వివిధ ప్రైవేటు సంస్థలలో (డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, శ్రీని ఫార్మా, గ్లోబియాన్ ఇండియా) లలో పనిచేసి ప్రస్తుతం దక్కను కెమికల్స్ అనే సంస్థలో ఇంజనీరింగు మేనేజరుగా పనిచేస్తున్నాడు.
తొలినాళ్ళ జీవితం
వెంకటేష్ తల్లిదండ్రులు వీరభద్ర రావు, చిన్నాదేవి. చిన్నప్పటినుండే తన తాత గోలి సత్తిరాజు ప్రోత్సాహంతో పురాతన నాణెములు సేకరించడం అభిరుచిగా మలచుకున్నాడు.
కెరీర్
నాణేల సేకర్తగా
తెలుగునేలను పరిపాలించిన జనపదులు, చక్రవర్తులు, రాజులు, సుల్తానులు తమ పరిపాలనా కాలములో చలామణిలోకి తెచ్చిన నాణెములు అలాగే తెలుగు జాతికి చెందిన రాజులు వేరే ప్రాంతాలను పరిపాలించిన కాలములో చలామణిలోకి తెచ్చిన నాణెములను సేకరించి వాటిని పరిశోధించి ఆ నాణెములను ప్రదర్శిస్తూ నలుగురికీ చరిత్రపై అవగాహన కల్పించడం ఇతని అభిరుచి. ఈ పురాతన నాణెములు ప్రపంచ తెలుగు మహాసభలు, తెలంగాణ వైభవం, తెలంగాణ బుద్ధ సంగీతి, ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ సమావేశాలు, కాకినాడ, రాజమహేంద్రి, విశాఖపట్నం లాంటి మ్యూజియంలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి పలువురి మన్ననలు పొందాడు. ఈ ప్రదర్సనల ద్వారా మన ప్రాంత గొప్ప చరిత్ర అలాగే సంస్కృతి పైన ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాడు. "ఎవరైతే తమ చరిత్రను తెలుసుకోరో .. ఎవరైతే చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోరో .. వారికి చరిత్ర గుణపాఠం నేర్పుతుంది" అని చెప్పిన అంబేద్కర్ మాటలు ననుసరించి నాణేముల ద్వారా తెలుగు వారి చరిత్ర నిర్మించేందుకు కృషి చేస్తున్నాడు. వెంకటేష్ తెలుగు నేలపైన లభించిన పురాతన నాణెముల ద్వారా నాటి ఆర్థిక స్థితిగతులను,సాంకేతిక మార్పులను, లిపి పరిణామాన్ని, భాషలను, రాజుల వంశక్రమాన్ని, లోహ శాస్త్ర పరిణామాన్ని, మత విధానములను, దుస్తుల పరిణామాన్ని, సంకేతాలను , రాజకీయ & సామాజిక మార్పులను పరిశోధిస్తున్నాడు. పురాతన నాణేముల పరిశోధన కోసం భారతదేశపు తొలి లిపి, ప్రస్తుత భారత దేశపు లిపులకు మూలమైన బ్రహ్మీ లిపిని వెంకటేష్ అధ్యయనం చేసాడు. వెంకటేష్ సేకరణలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి అశ్మక జనపదం, ఆంధ్ర జనపదము, మౌర్య సామ్రాజ్యం(కీ. పూ. ౩వ శతాబ్దము), శాతవాహనులకు పూర్వం పాలించిన గోబద, నరన, సిరి కమ, సిరివాయ, సమ గోప వంటి రాజులు నాణెములు. శాతవాహన రాజులైన సిరి శిముక (కీ. పూ. 1 వ శతాబ్దము), సిరి శాతవాహన(కీ. పూ. 1 వ శతాబ్దము), సిరి శాతకర్ణి, సిరి పులమావి వంటి రాజుల నాణెములు, ఇక్షాకులు(కీ. శ. ౩వ శతాబ్దము) , విష్ణుకుండినులు (కీ. శ. 4-6 వ శతాబ్దము), చాళుక్యులు (కీ. శ. 7 -11 వ శతాబ్దము), కాకతీయులు, చోడులు, విజయనగర సామ్రాజ్యం, మొగల్ సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు, నిజాం నవాబులు, ఈస్టిండియా కంపెనీ నాణెములు, బ్రిటిష్ ఇండియా నాణెములు వెంకటేష్ సేకరణలో చూడవచ్చు.