కట్టెల పొయ్యి
వంటలకు, ఉష్ణాన్నివ్వడానికి ప్రధాన ఇంధనం కట్టెలు. ఇవి మండినపుడు రసాయన శక్తి ఉష్ణ శక్తి గాను, కాంతి శక్తి గాను మారుతుంది. మనకు కట్టెలు వృక్షాల నుండి లభిస్తాయి. దాదాపు భూభాగంలో 30% మాత్రమే అడవుల్ని కలిగి ఉన్నాము.
కలప వనరులు చాలా త్వరితంగా అంతరించిపోతున్నాయి. వృక్ష వ్యాధులు, కీటకాలు,అగ్ని ప్రమాదాలు, విచక్షణారహితంగా చెట్లను నరికి వేయటం, ఇంధనాలకొరకు, నిర్మాణ పనులకు, పరిశ్రమల కొరకు నరకటం, అటవీ ప్రాంతాలను ఇతర ప్రయోజనాలకై ఉపయోగించటం వల్ల వృక్షాలు తరిగిపోతున్నాయి. దీనివల్ల వర్షపాతం తగ్గటమే కాక పర్యావరణ కాలుష్యం యేర్పదుతుంది.