ఆహార ప్రధానమైనది లేదా ప్రధానమైన ఆహారం. ఆహారంలో అధిక పరిమాణంలో తినబడే ఆహారాన్ని ప్రధాన ఆహారం అంటారు. ఇది ప్రజల ఆహారంలో ఆధిపత్య భాగాన్ని కలిగి ఉంటూ అవసరమైన శక్తిని అందిస్తుంది. సమాజం ప్రధానమైన ఆహారమైన దీనిని ప్రతిదినం ముడు వేళలలో తినవచ్చు. చాలా మంది ప్రజలు దీనితో ఉపాహారాలను చేర్చుకుని తింటూ జీవిస్తారు.[1] ప్రధానాహారం ప్రాంతానికి, ప్రాంతానికి మారుతూ ఉంటాయి. కాని సాధారణంగా చవకైన లేదా తక్షణమే లభించే పిండిపదార్ధం అధికంగా ఉండే ఆహారాలు మనుగడకు, ఆరోగ్యానికి అవసరమైన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థూల పోషకాలను సరఫరా చేస్తాయి: కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఆధిక్యత కలిగి ఉంటాయి. ఇందుకు దుంపలు, మూలాలు, ధాన్యాలు, చిక్కుళ్ళు, విత్తనాలు విలక్షణ ఉదాహరణలుగా ఉంటాయి.

పలురకాల ఉర్లగడ్డలు
Unprocessed seeds of spelt, a historically important staple food

ప్రారంభ వ్యవసాయ నాగరికతలు వారు ప్రధానమైనవిగా భావించిన ఆహారాలకు విలువనిచ్చాయి. ఎందుకంటే అవసరమైన పోషకాహారాన్ని అందించడంతో పాటు, అవి సాధారణంగా క్షీణత లేకుండా ఎక్కువ కాలం నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. కొరత ఉన్న సీజన్లలో పొడి సీజన్లు లేదా చల్లని సమశీతోష్ణ శీతాకాలాలు వంటి సాధ్యం కాని ఆహారాలు ఇటువంటి నిలువచేసుకునే ఆహారాలు నిల్వ చేయబడతాయి. పుష్కలంగా ఉన్న సీజన్లలో విస్తృతమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉండవచ్చు.


ప్రధానమైన ఆహారాలు కూరగాయలు లేదా జంతు ఉత్పత్తుల నుండి తీసుకోబడ్డాయి. సాధారణ ఆహారాలలో తృణధాన్యాలు (బియ్యం, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలు, జొన్న వంటివి), దుంపలు (మూలాలు) కూరగాయలు (బంగాళాదుంపలు, కాసావా, చిలగడదుంపలు, యమ్ములు లేదా టారో వంటివి) ), మాంసం, చేపలు, గుడ్లు, పాలు, చీజు.[1] ఇతర ప్రధాన ఆహారాలలో పప్పుధాన్యాలు (ఎండిన చిక్కుళ్ళు), [2]సాగో (ఏకదళ బీజ వృక్షాల నుండి సేకరించే ఆగారం).[3] పండ్లు (అవాకేడో, ప్లాంటియన్లు). ప్రాంతాల ఆధారంగా ప్రధానాహారం మారుతూ ఉంటుంది:కొబ్బరి, ఆలివులు, చెరకు.[4][5][6]

గణాంకాలు

మార్చు
Food energy consumption per person, per day, worldwide
Average daily food energy (kcal) per person, 1979–1981
Average daily food energy (kcal) per person, 2001–2003
  No data
  <1600
  1600-1800
  1800-2000
  2000-2200
  2200-2400
  2400-2600
  2600-2800
  2800-3000
  3000-3200
  3200-3400
  3400-3600
  >3600
Except for war-torn countries, the people of the world are getting more daily calories, despite a growing population globally.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రధానమైన ఆహారాలను వాతావరణం, స్థానిక భూభాగం, వ్యవసాయ పరిమితులు, అభిరుచులు, పర్యావరణ వ్యవస్థలు ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు సగటు ఆఫ్రికన్ ఆహారంలో ప్రధాన శక్తివనరులుగా తృణధాన్యాలు (46%), మూలాలు, దుంపలు (20%), జంతు ఉత్పత్తులు (7%) ఉన్నాయి. పశ్చిమ ఐరోపా సగటు ఆహారంలో జంతు ఉత్పత్తులు (33%), తృణధాన్యాలు (26%), మూలాలు, దుంపలు (4%) ప్రాధాన్యత వహిస్తున్నాయి.

తృణధాన్యాలు (బియ్యం, గోధుమ, మొక్కజొన్న (మొక్కజొన్న), చిరుధాన్యాలు జొన్న) ), మూలాలు, దుంపలు (బంగాళాదుంపలు, కాసావా, యమ్స్, టారో), మాంసం, పాలు, గుడ్లు, జున్ను, చేప వంటి జంతు ఉత్పత్తులు. ప్రాంతీయ ప్రధానాహారాలలో రై, సోయాబీన్స్, బార్లీ, ఓట్సు, టెఫ్ మొక్కలు ఉన్నాయి.

కేవలం 15 మొక్కల పంటలు ప్రపంచంలోని 90% మందికి ఆహార శక్తిని (మాంసంతో సహా) అందిస్తాయి. బియ్యం, మొక్కజొన్న, గోధుమలను మూడింట రెండువంతుల మంది ఆహాంగా వినియోగిస్తున్నారు. ఈ మూడు ప్రపంచ జనాభాలో 80% మందికి ప్రధానమైనాహారాలుగా ఉన్నాయి.[7] బియ్యం మానవాళిలో సగం మందికి ప్రధానాహారంగా ఉంది.

అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక బిలియను మందికంటే అధికమైన ప్రజలకు మూలాలు, దుంపలు ముఖ్యమైన ఆహారంగా ఉన్నాయి. ఉప-సహారా ఆఫ్రికాలో జనాభా తినే ఆహారంలో సుమారు 40% వాటా ఉంది. మూలాలు, దుంపలలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. కాని ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, కాసావా రూట్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక ప్రధాన ఆహార ప్రధానాహారంగా ఉంది. ఇది సుమారు 500 మిలియన్ల ప్రజలకు ప్రాథమిక ఆహార వనరుగా ఉంది.

ఆర్థికాభివృద్ధి, స్వేచ్ఛా వాణిజ్యంతో చాలా దేశాలు తక్కువ పోషక-సాంద్రత కలిగిన ప్రధాన ఆహారాల నుండి అధిక-పోషక-సాంద్రత కలిగిన ప్రధానాహారాలకు అలాగే అధిక మాంసం వినియోగానికి మారాయి. ఈ ధోరణి ఉన్నప్పటికీ పోషకాహారంలో సాంప్రదాయ ప్రధాన పంటల ప్రాముఖ్యత అధికరిస్తున్నట్లు గుర్తిస్తున్నారు.[ఆధారం చూపాలి]మంచి పోషకాహారం, వ్యాధి నిరోధకత, అధిక దిగుబడి అందించే మెరుగైన మొక్కల జాతులను గుర్తించి అభివృద్ధి చేయడానికి వ్యవసాయం నిరంతరం ప్రయత్నిస్తుంది.[ఆధారం చూపాలి]

మొదట అండీస్ నుండి వచ్చిన క్వినోవా (శతాబ్దాల క్రితంనాటి సూడోసెరియల్ ధాన్యం) వంటి చిరుధాన్యాలు కూడా ప్రధానాహారంగా ఉన్నాయి.[8]ఓకా దుంపలు, ఉలుకు దుంపలు, ధాన్యం అమరాంతు చారిత్రక ఆండియన్ ప్రధానాహారాలు అని చెప్పుకునే ఇతర ఆహారాలు.[9] ఎండిన మాంసం, కొవ్వుతో తయారైన పెమ్మికాన్ ఉత్తర అమెరికాలోని స్థానిక ఇండీసు ప్రజలకు ప్రధానాహారంగా ఉంది.[10]ఒకప్పుడు ప్రాచుర్యం పొందిన ఈ ధాన్యాలు పునఃపరిశీలించబడ్డాయి. వీటిలో కొన్ని తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టబడ్డాయి.[ఆధారం చూపాలి]2010 లో బియ్యం, గోధుమ, మొక్కజొన్న వంటి ఇతర ప్రధానాహారలతో పోలిస్తే క్వినోవా వంటి "ప్రత్యేక ధాన్యాలు" ప్రపంచ వినియోగం చాలా తక్కువగా ఉంది.[ఆధారం చూపాలి]

ఉత్పత్తి

మార్చు

ప్రధానాహారాల ఉతపత్తిలో ప్రస్తుతం ఆధునిక విధానాలు అనుసరిస్తున్నాయి. ప్రధానాహార ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయపద్దతులను అనుసరించడానికి ఉత్పత్తిదారులు ఆసక్తిచూపడం అధికరిస్తుంది.

అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన 10 ప్రధానాహారాలు (వార్షిక ఉత్పత్తి ఆధారంగా వర్గీకరించబడింది) [11]
ప్రపంచ ఉత్పత్తి,
2012[12]
సరాసరి ప్రపంచ పంట,
2010
ప్రపంచంలో అధిక ఉత్పత్తి చేస్తున్న దేశాలు [13]
2012[14]
అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రపంచదేశాలు 2013[15]
ర్యాంకు పంట (మెట్రిక్ టన్నులు) (హెక్టారుకు ఉత్పత్తి టన్నులలో) (హెక్టారుకు ఉత్పత్తి టన్నులలో) దేశం (మెట్రిక్ టన్నులు) దేశం
1 మొక్కజొన్నలు 873 మిలియన్లు 5.1 25.9 యునైటెడ్ స్టేట్సు 354 మిలియన్లు యునైటెడ్ స్టేట్సు
2 బియ్యం 738 మిలియన్లు 4.3 9.5 ఈజిప్టు 204 మిలియన్లు చైనా
3 గోధుమలు 671 మిలియన్లు 3.1 8.9 న్యూజిలాండు 122 మిలియన్లు చైనా
4 ఉర్లగడ్డలు 365 మిలియన్లు 17.2 45.4 నెదర్లాండ్సు 96 మిలియన్లు చైనా
5 కసావా 269 మిలియన్లు 12.5 34.8 ఇండోనేషియా 47 మిలియన్లు నైజీరియా
6 సోయాబీంసు 241 మిలియన్లు 2.4 4.4 ఈజిప్టు 91 మిలియన్లు యునైటెడ్ స్టేట్సు
7 చిలగడ దుంపలు 108 మిలియన్లు 13.5 33.3 సెనెగల్ 71 మిలియన్లు చైనా
8 యాం 59.5 మిలియన్లు 10.5 28.3 కొలంబియా 36 మిలియన్లు నైజీరియా
9 జొన్నలు 57.0 million 1.5 86.7 యునైటెడ్ స్టేట్సు 10 మిలియన్లు యునైటెడ్ స్టేట్సు
10 ప్లాంటియన్లు 37.2 మిలియన్లు 6.3 31.1 ఎల్ సాల్వడార్ 9 మిలియన్లు ఉగాండా

తయారీ

మార్చు

బియ్యం సాధారణంగా వండి అన్నంలా తింటారు. కాని చాలా ఇతర ప్రధాన తృణధాన్యాలు పిండి చేయబడతాయి. తరువాత వీటిని రొట్టె, నూడుల్స్, పాస్తా, గంజి, పేలాలు వంటి ఆహారాలుగా చేసుకుని మెత్తగా తయారుచేసి తింటారు. రూట్ కూరగాయలను మెత్తగా చేసి గంజి లాంటి పోయి ఫుఫులను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. పప్పుధాన్యాలు (చెనగలు వంటివి, వీటి నుండి పిండి తయారవుతుంది.

పోషకాహారం

మార్చు

మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు పూర్తి స్థాయి పోషకాలను అందించకపోవచ్చు. పెల్లాగ్రా అనే పోషక-లోపవ్యాధి ప్రధానంగా మొక్కజొన్నతో కూడిన ఆహారంతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే బెరిబెరి అనే వ్యాధి శుద్ధి చేసిన తెల్ల బియ్యం ఆహారంతో సంబంధం కలిగి ఉంటుంది.[16] ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలువబడే విటమిన్ సి లేకపోవడం వల్ల స్కర్వి వస్తుంది. కొన్ని ప్రధాన ఆహార పదార్థాల పోషక విలువ యునైటెడ్ కింగ్డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండు మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని ఒక రచయిత సూచించారు.[17]

10 ప్రధానాహారాలను పోల్చడం

మార్చు

ముడి ధాన్యాలు తినదగినవి కావు, అవి జీర్ణించుకోవడం కష్టం. ముడి ధాన్యాలు ఉడికించి మొలకెత్తించి మానవ వినియోగం కోసం తయారుచేయాలి. మొలకెత్తిన, వండిన రూపంలో ఈ ధాన్యాల పోషక అనుకూల, పోషక-వ్యతిరేక విషయాలు ఈ ధాన్యాల ముడి రూపానికి భిన్నంగా మారుతుంటాయి. బంగాళాదుంపలను కూడా ఉడికించాలి, కాని ఇవి మొలకెత్తకూడదు. ఇతర ఆహారాలకంటే ఈ ఆహారాలను తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.

చిత్రమాలిక

మార్చు

వెలుపలి లింకులు

మార్చు
  1. 1.0 1.1 United Nations Food and Agriculture Organization: Agriculture and Consumer Protection. "Dimensions of Need - Staples: What do people eat?". Retrieved 15 October 2010.
  2. "Around the world in dishes made with pulses". Food and Agricultural Organisation of the United Nations. 18 November 2015. Retrieved 23 September 2017.
  3. The Sago Palm: The Food and Environmental Challenges of the 21st Century. Kyoto University Press. 2015. p. 331. ISBN 978-1-920901-13-4.
  4. "African Food Staples". Retrieved 29 May 2015.
  5. "Olive Oil & Health - All Olive Oil". Retrieved 29 May 2015.
  6. "How Sugar Went From a Condiment to a Diet Staple". Time.
  7. "Dimensions of Need: An atlas of food and agriculture". Food and Agriculture Organization of the United Nations. 1995.
  8. E.A. Oelke; et al. "Quinoa". University of Minnesota. Archived from the original on 2020-02-21. Retrieved 2020-03-08.
  9. Arbizu and Tapia (1994). "Plant Production and Protection Series No. 26. FAO, Rome, Italy". FAO / Purdue University. Archived from the original on 2017-07-10. Retrieved 2020-03-08.
  10. John E. Foster. "Pemmican". The Canadian Encyclopedia. Archived from the original on 29 మే 2015. Retrieved 29 May 2015.
  11. Allianz. "Food security: Ten Crops that Feed the World". Allianz.
  12. "Food and Agricultural commodities production / Commodities by regions". Food and Agriculture Organization of the United Nations. 2012. Archived from the original on 2016-06-16. Retrieved 2020-03-08.
  13. The numbers in this column are country average; regional farm productivity within the country varies, with some farms even higher.
  14. "FAOSTAT: Production-Crops, 2010 data". Food and Agriculture Organization of the United Nations. 2011. Archived from the original on 2012-06-19. Retrieved 2020-03-08.
  15. "Food and Agricultural commodities production / Countries by commodity (2013 data)". Food and Agriculture Organization of the United Nations. Archived from the original on 28 జూలై 2016. Retrieved 24 April 2016.
  16. United Nations Food and Agriculture Organization: Agriculture and Consumer Protection. "Rice and Human Nutrition" (PDF). Retrieved 15 October 2010.
  17. Wernick, Adam (29 October 2017). "Global warming threatens nutrition levels in staple crops". Public Radio International (PRI). Retrieved 30 October 2017.