ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతోంది.

ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతోంది.[1] తోలుబొమ్మలాట కళల ప్రోత్సాహానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోలుబొమ్మలాట కళాకారులను ఏకం చేయడానికి ఈ దినోత్సరం జరుపుకుంటారు.[2]

మారియోనెట్స్-ట్రాన్స్ఫార్మర్లు.

ప్రారంభం

మార్చు

ఇరాన్‌కు చెందిన పప్పెట్ థియేటర్ ఆర్టిస్ట్ జావద్ జోల్ఫాఘరి, 2000లో మాగ్డేబర్గ్‌లో జరిగిన యూనియన్ ఇంటర్నేషనల్ డి లా మారియోన్నెట్ 18వ సమావేశంలో ఈ దినోత్సవం గురించి ప్రతిపాదన చేశాడు. రెండు సంవత్సరాల తర్వాత, 2002 జూన్ నెలలో అట్లాంటాలో జరిగిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ యూనియన్ ఇంటర్నేషనల్ డి లా మారియోన్నెట్ సమావేశంలో తేదీ ప్రకటించారు. 2003, మార్చి 21న తొలిసారిగా ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం జరిగింది.[3]

కార్యకలాపాలు

మార్చు

ఈ దినోత్సవం రోజున పండుగలు, ప్రదర్శనలు, తోలుబొమ్మల కవాతు, తోలుబొమ్మల వర్క్‌షాప్‌లు, ప్రపంచ తోలుబొమ్మ దినోత్సవ సందేశం పఠనాలు మొదలైన కార్యకలాపాలు నిర్వహించబడుతాయి.[2]

ఇతర వివరాలు

మార్చు
  • 2006 నుండి ప్రతి సంవత్సరం సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి చేత ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవ సందేశాన్ని అందింపజేస్తున్నారు.
  • 2018 నుండి ప్రతి సంవత్సరం, ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం కోసం పోస్టర్‌ను రూపొందించడానికి ప్రపంచంలోని ఒక కళాకారుడికి కార్టే బ్లాంచ్ ఇవ్వబడుతుంది.
  • వ్యక్తిగతంగా లేదా పిల్లలతో వర్క్‌షాప్‌ నిర్వహించిన వీడియో ప్రాజెక్ట్‌ను ప్రతి సంవత్సరం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పంపబడిన అన్ని వీడియోలు మార్చి 21న ప్రసారం చేయబడుతాయి.[2]

పుతుల్ ఉత్సవం

మార్చు

ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం సందర్భంగా, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ సంగీత నాటక అకాడమీ ( న్యూఢిల్లీ) 2022 మార్చి 21 నుండి 22 వరకు మూడు రోజులపాటు 'పుతుల్ ఉత్సవం' పేరుతో తోలుబొమ్మల పండుగను నిర్వహించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశంలోని వారణాసి (ఉత్తర ప్రదేశ్), హైదరాబాద్ (తెలంగాణ), అంగుల్ జిల్లా (ఒడిశా), న్యూఢిల్లీ, అగర్తల (త్రిపుర) మొదలైన ఐదు నగరాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తోలుబొమ్మలాట మాధ్యమం ద్వారా భారత స్వాతంత్ర్య పోరాట గాథలు చెప్పబడ్డాయి. అంతేకాకుండా సాంప్రదాయ, సమకాలీన ప్రసిద్ధ తోలుబొమ్మల ప్రదర్శనలు, సెమినార్, ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించబడ్డాయి.[4]

మార్చి 21న న్యూఢిల్లీలోని అతనుగర్ ప్రాంతంలోని జన్ మద్యంలో మధ్యాహ్నం 2 గంటలకు 'పుతుల్ ఉత్సవం' ప్రారంభమవ్వగా. హైదరాబాద్‌లోని సిసిఆర్‌టి యాంఫిథియేటర్‌, వారణాసి అస్సీఘాట్ లోని సుబా-ఎ-బనారస్, అంగుల్‌లోని షో శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ షాడో థియేటర్‌, అగర్తలలోని ముక్తధార ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించబడింది.[5]

మూలాలు

మార్చు
  1. "Puppeteers of America - World Puppetry Day". www.puppeteers.org (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
  2. 2.0 2.1 2.2 "World Puppetry Day". Unima - Union Internationale de la Marionnette. Archived from the original on 2022-01-13. Retrieved 2022-03-21.
  3. "World Puppetry Day". National Today. 2022-01-05. Retrieved 2022-03-21.
  4. "'Putul Utsav' to be held in 5 cities on World Puppetry Day". ANI News. Retrieved 2022-03-21.
  5. Taneja, Parina (2022-03-21). "World Puppetry Day 2022: Sangeet Natak Akademi organizes Putul Utsav on tales of India's freedom struggle". www.indiatvnews.com. Retrieved 2022-03-21.

బయటి లింకులు

మార్చు