ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
ప్రతి సంవత్సరం సెప్టెంబరు 18న నిర్వహించబడుతుంది
ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 18న నిర్వహించబడుతుంది. నీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్ధేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.
ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం | |
---|---|
తేదీ(లు) | సెప్టెంబరు 18 |
ఫ్రీక్వెన్సీ | వార్షికం |
ప్రదేశం | ప్రపంచవ్యాప్తంగా |
వెబ్‌సైటు | |
http://www.wwmd.org |
చరిత్ర
మార్చు2003లో అమెరికా యొక్క క్లీన్ వాటర్ ఫౌండేషన్ (ఎసిడబ్ల్యుఎఫ్) ప్రపంచ విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దేశాలలోని నీటి వనరులను పునరుద్ధరించడానికి, రక్షించడానికి 1972, అక్టోబరు 18న యునైటెడ్ స్టేట్స్ దేశంలో ప్రవేశపెట్టిన పరిశుభ్ర నీటి చట్టం వార్షికోత్సవానికి గుర్తుగా ఒక నెలరోజుల ముందుగా సెప్టెంబరు 18న ఈ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. 2006లో ఈ కార్యక్రమ సమన్వయం నీటి పర్యావరణ సమాఖ్య, అంతర్జాతీయ నీటి సంఘాలకు... ఆ తరువాత 2015, జనవరిలో ఎర్త్ ఎకో ఇంటర్నేషనల్‌కు అప్పగించబడింది.
లక్ష్యం
మార్చు- స్థానికంగా ఉన్న నీటి వనరులపై ప్రాథమిక పర్యవేక్షణను నిర్వహించేవిధంగా పౌరులను చైతన్యపరచడం
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరులను పరిరక్షించడంలో ప్రజలకు అవగాహన పెంపొందించడం[1]
కార్యక్రమాలు
మార్చు- ఉష్ణోగ్రత, ఆమ్లత్వం (పిహెచ్), స్పష్టత (టర్బిడిటీ), కరిగిన ఆక్సిజన్ (డిఓ)తో సహా నీటి నాణ్యత మొదలైన అంశాలలో స్థానిక నీటి వనరులను నమూనా చేయడానికి ప్రతి ఒక్కరికి పరీక్ష కిట్ అనుమతిని ఇవ్వడం
- పరీక్ష కిట్ లను కొనుగోలుచేయడంకోసం స్థానికంగా ఉన్న ఎర్త్ ఎకో ఇంటర్నేషనల్ సంస్థ నుండిగానీ, ఇతర సంస్థల నుండిగానీ ఆర్థిక సహాయం అందించడం.[1]
- 2010లో 85 దేశాలలోని 2,00,000 మంది ప్రజలు, 2012లో 100 దేశాలలోని దాదాపు పది లక్షలమంది ప్రజలు తమ స్థానిక జల వనరులను పర్యవేక్షించారు.
- 2008లో ఇండోనేషియా[2] నుండి అర్కాన్సాస్[3] వరకు విద్యార్థులు నీటి నాణ్యత యొక్క ప్రాముఖ్యతను ప్రజలు దృష్టికి తీసుకురావడానికి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "EarthEcho Water Challenge". Washington, D.C.: EarthEcho International. Retrieved 18 September 2019.
- ↑ Students take part in water monitoring, The Jakarta Post, November, 2008
- ↑ Environmental concerns make water protection necessary Archived 2016-03-07 at the Wayback Machine, The Cabin.net, November, 2008