ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (ఆంగ్లం: World No-Tobacco Day) మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ గుర్తు
జరుపుకొనే రోజుమే 31
ఉత్సవాలుమే 31
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రారంభం

మార్చు

1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988 ఏప్రిల్ 7న ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులను ఏప్రిల్ 7వ తేదీన 24 గంటలపాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది.[1] దానిని అనుసరించి 1988లో జరిగిన సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది.

నష్టాలు

మార్చు

పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఫల్మనరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పీల్చేవారికీ కూడా ప్రమాదమే.

కార్యక్రమాలు - ఫలితాలు

మార్చు
  1. పొగాకు వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడంకోసం అవగహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
  2. ఈ అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారతదేశంలో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది.[2]

ఇతర వివరాలు

మార్చు
  1. ప్రపంచ ఆరోగ్య అవసరాల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటుచేసిన ఎనమిది అవగాహన కార్యక్రమాల్లో ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం ఒకటి.[3][4]

మూలాలు

మార్చు
  1. Centres for Disease Control. 1990. ″MMWR Weekly″ (6 April 1990). World No-Tobacco Day. Archived 25 జూన్ 2017 at the Wayback Machine Atlanta.
  2. సాక్షి, జాతీయం (31 May 2018). "జీవితానికి పొగ". Archived from the original on 31 May 2018. Retrieved 31 May 2018.
  3. World Health Organization, WHO campaigns. Archived 2016-04-22 at the Wayback Machine
  4. World Health Organization, WHO campaigns. Archived 22 ఏప్రిల్ 2016 at the Wayback Machine Geneva, 5 January 2015.