ప్రపంచ రంగస్థల దినోత్సవం

రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం

ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం.[1] ఇది 1961లో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారిచే ప్రారంభించబడింది.[2][3]

ప్రపంచ రంగస్థల దినోత్సవం
ప్రపంచ రంగస్థల దినోత్సవం
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా
రకంఅంతర్జాతీయ
జరుపుకొనే రోజు27 మార్చి
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఒకటే రోజు

చరిత్ర

మార్చు

నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది. దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటకం రూపం మారుతుందేగానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియగావిరసిల్లుతుంది. ప్రస్తుతమున్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల దినోత్సవం పుట్టింది.[4]

1961లో వియన్నాలో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు 'ఆర్వికివియా' ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేశాడు. సభ్యులందరూ ప్రతిపాదనను అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది.

రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించి ఐక్యరాజ్య సమితి, యునెస్కో లచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాలు, ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షించుకుంటారు. ప్రతి సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని, ప్రముఖుల మాటగా వారి మనోగత సారాన్ని ఆ సంవత్సరపు సందేశంగా రంగస్థల ప్రపంచానికి అందిస్తారు.[5] 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే (ఫ్రాన్స్) అందించాడు.

లక్ష్యాలు

మార్చు
  1. ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
  2. ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
  3. విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
  4. మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
  5. నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం[6]

మూలాలు

మార్చు
  1. డా. మామిడి, హరికృష్ణ (2024-03-28). "సాహిత్య శిఖర రూపం.. నాటకం!". www.dishadaily.com. Archived from the original on 2024-03-29. Retrieved 2024-03-29.
  2. ప్రజాశక్తి, ఫీచర్స్ (18 March 2017). "పజ్రలకోసం .. పగ్రతి కోసం..." డాక్టర్‌ శమంతకమణి. Retrieved 27 March 2018.[permanent dead link]
  3. World Theatre Day. "About the World Theatre Day". www.world-theatre-day.or. Archived from the original on 28 March 2018. Retrieved 27 March 2018.
  4. వెన్నెల్లో. "ప్రపంచ రంగస్థల దినోత్సవం". www.vennello.wordpress.com. సాయి బ్రహ్మానందం గొర్తి. Retrieved 27 March 2018.
  5. వెన్నెల్లో, ఆంధ్రజ్యోతి - నవరంగ్ (26 March 2010). "తెలుగు నాటకం వెలగాలి" (PDF). జి.ఎల్.ఎన్. మూర్తి. Retrieved 27 March 2018.
  6. World Theatre Day. "Goals of the World Theatre Day". www.world-theatre-day.or. Archived from the original on 7 April 2018. Retrieved 27 March 2018.