ప్రపంచ శాకాహార దినోత్సవం
ప్రపంచ శాకాహార దినోత్సవం(ఆంగ్లం: World Vegetarian Day) - ప్రతి సంవత్సరం అక్టోబరు 1న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మూగజీవాలపై మానవ ప్రేమను ప్రోత్సహించి, పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేదిశగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది.[1][2]
ప్రారంభం
మార్చుప్రపంచవ్యాప్తంగా శాకాహారులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు 1970లలో ఉత్తర అమెరికా శాకాహార సొసైటీ ఏర్పడింది. 1977లో తొలిసారిగా అమెరికాలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించగా,[3] 1978లో అంతర్జాతీయ శాకాహారం యూనియన్ ఆమోదించింది. ప్రపంచ శాకాహారం దినోత్సవం సందర్భంగా అక్టోబరు నెల శాకాహార అవగాహన నెలగా ప్రారంభిమై, నవంబరు 1న ప్రపంచ వేగన్ దినోత్సవంతో ముగుస్తుంది.[4][5]
కార్యక్రమాలు
మార్చుశాకాహార పద్ధతులు, ప్రయోజనాలను ప్రోత్సహించడానికి స్థానిక, ప్రాంతీయ, జాతీయ సమూహాలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
ఇతర వివరాలు
మార్చుశాకాహారం ప్రాముఖ్యతను తెలిపేందుకు, అవగాహన కలిగించేందుకు వివిధ దినోత్సవాలు కూడా ఉన్నాయి.[6]
మూలాలు
మార్చు- ↑ "Home". World Vegetarian Day. Retrieved 2020-10-01.
- ↑ "North American Vegetarian Society | NAVS | Become a Member". North American Vegetarian Society. Retrieved 2020-10-01.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (1 October 2016). "శాకాహారం...పోషక విలువలు అధికం". www.andhrajyothy.com. Archived from the original on 1 October 2020. Retrieved 1 October 2020.
- ↑ "vegetarian-awareness-month". HuffPost (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-04. Retrieved 2020-10-01.
- ↑ Hultin, Ginger (2014-10-07). "Why Celebrate Vegetarian Awareness Month?". Food & Nutrition Magazine (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-07-16. Retrieved 2020-10-01.
- ↑ "About". World Vegetarian Day. Retrieved 2020-10-01.
ఇతర లంకెలు
మార్చు- అధికారిక వెబ్సైట్
- శాకాహార దినోత్సవాల వెబ్సైట్ Archived 2020-10-27 at the Wayback Machine