ప్రపంచ శీతలీకరణ దినోత్సవం
ప్రపంచ శీతలీకరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించబడుతుంది. రోజువారీ జీవితంలో శీతలీకరణ సాంకేతిక పరిజ్ఞానపు ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్, హీట్-పంప్ రంగాన్ని పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1]
ప్రపంచ శీతలీకరణ దినోత్సవం | |
---|---|
తేదీ(లు) | 26 జూన్ |
ఫ్రీక్వెన్సీ | వార్షికం |
ప్రదేశం | ప్రపంచవ్యాప్తంగా |
ప్రారంభించినది | 26 జూన్ 2019 |
వ్యవస్థాపకుడు | స్టీఫెన్ గిల్ |
నిర్వహణ | ప్రపంచ శీతలీకరణ దినోత్సవ సెక్రటేరియట్ |
వెబ్‌సైటు | |
worldrefrigerationday.org |
చరిత్ర
మార్చుప్రపంచ శీతలీకరణ దినోత్సవ సెక్రటేరియట్ ఇంగ్లాండులోని డెర్బీషైర్‌లో ప్రపంచ శీతలీకరణ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ దినోత్సవం కోసం లార్డ్ కెల్విన్ పుట్టినరోజు 1824, జూన్ 26ను ఎంపికచేశారు.[2]
యునైటెడ్ కింగ్‌డమ్ రిఫ్రిజరేషన్ కన్సల్టెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫ్రిజరేషన్ మాజీ అధ్యక్షుడు స్టీఫెన్ గిల్ ఆలోచనలోంచి ఈ ప్రపంచ శీతలీకరణ దినోత్సవం వచ్చింది. 2018, అక్టోబరులో ది అమెరికన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ సంస్థ ప్రపంచ శీతలీకరణ దినోత్సవానికి మద్దతునిచ్చింది.[3] ఈ సంస్థకు 2019, జనవరిలో అట్లాంటాలో గిల్ ఇట్స్ జాన్ ఎఫ్ జేమ్స్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది.[4] 2019, ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగిన జాతీయ ఓజోన్ అధికారుల సమావేశంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం మద్దతునిచ్చింది.[5] తొలి ప్రపంచ శీతలీకరణ దినోత్సవం 2019, జూన్ 26న జరిగింది.
వార్షిక ప్రణాళికలు
మార్చు- 2019: వైవిధ్యం; అనువర్తనాల వైవిధ్యం, ప్రజలు, వృత్తులు, ప్రదేశాలు, సాంకేతికత, విజ్ఞానం, ఇంజనీరింగ్ పరిష్కారాలు, ఆవిష్కరణ
- 2020: కోల్డ్ చైన్; ఆహార భద్రత, భద్రత, మానవ ఆరోగ్యంలో కోల్డ్ చైన్ రంగం పాత్ర.[6]
మూలాలు
మార్చు- ↑ "About | World Refrigeration Day".
- ↑ "Refrigeration now has its own day of the year". iifiir.org. Retrieved 26 June 2020.[permanent dead link]
- ↑ "ASHRAE supports World Refrigeration Day | World Refrigeration Day".
- ↑ "Steve Gill wins ASHRAE international award". Cooling Post. January 16, 2019.
- ↑ "UNEP-OzonAction support for World Refrigeration Day | World Refrigeration Day".
- ↑ https://worldrefrigerationday.org/world-refrigeration-day-partners-release-the-cold-chain-4-life-celebration-kit/[permanent dead link]