ప్రబంధ కల్పవల్లి

కల్పవృక్ష ఆయుర్వేదిక్ ఫార్మసీ వసంత హెయిర్ ఆయిల్ వసంత పెయిన్ రబ్ ఆయింట్మెంట్ కీళ్ల నొప్పులకు క

ప్రబంధ కల్పవల్లి 1870 - 1882 మధ్యకాలంలో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి ప్రకటింపబడిన మాస పత్రిక.[1]

వీరేశలింగంగారికన్నా ముందుగా గురుజాడ శ్రీరామమూర్తి గారు, ఆంధ్రకవుల జీవితాల్ని రచించి 1876 వ సంవత్సరంలోనే ప్రచురించారు. పెద్దాపురంనుండి ప్రకటింపబడే " శ్రీ ప్రబంధ కల్పవల్లి " అనే పత్రికలో ప్రచురిస్తూ ఉండేవారు. వారికవుల జీవితరచనలో కాలక్రమాన్ని పాటించలేదు. భారతాంధ్ర కవులు-రామాయణాంధ్రకవులు-ఆంధ్రపంచకావ్యకవులు- ఇత్యాదిగా విభాగించి రచించారు. ఆ కవుల జీవితరచన సమగ్రంగా లేక జనశ్రుతిలోని కధలతో గాథలతో నిండి ఉంది, అయినా గురజాడ శ్రీరామమూర్తిగారి కవి జీవితాలు శ్రీవీరేశలింగంగారి కవులచరిత్ర రచనకు ప్రేరకమని చెప్పవచ్చు.

మూలాలు మార్చు

  1. Mitchell, Lisa (2009). Language, Emotion, and Politics in South India: The Making of a Mother Tongue. Indiana University Press. ISBN 0253353017.