ప్రబాత్ జయసూర్య

శ్రీలంక క్రికెటర్

నెకెత్ గెదర రోషన్ ప్రబాత్ జయసూర్య, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక జాతీయ జట్టు కోసం ఆడుతున్నాడు. దేశీయ మ్యాచ్‌లలో, కోల్ట్స్ క్రికెట్ క్లబ్, జాఫ్నా స్టాలియన్స్ తరపున ఆడతాడు.[1]

ప్రబాత్ జయసూర్య
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నెకెత్ గెదర రోషన్ ప్రబాత్ జయసూర్య
పుట్టిన తేదీ (1991-11-05) 1991 నవంబరు 5 (వయసు 33)
మాతలే, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 159)2022 జూలై 8 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2023 ఏప్రిల్ 24 - ఐర్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 187)2018 ఆగస్టు 1 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2018 ఆగస్టు 5 - దక్షిణాఫ్రికా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 6 2 65 61
చేసిన పరుగులు 43 10 841 160
బ్యాటింగు సగటు 6.22 10.00 11.68 10.00
100లు/50లు 0/0 0/0 0/2 0/0
అత్యుత్తమ స్కోరు 16 10* 81 23
వేసిన బంతులు 1,881 96 11,903 3,029
వికెట్లు 43 0 263 97
బౌలింగు సగటు 21.46 25.04 20.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 21 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 5 0
అత్యుత్తమ బౌలింగు 7/52 7/26 7/17
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 20/– 15/–
మూలం: Cricinfo, 11 March 2023

జననం, విద్య

మార్చు

నెకెత్ గెదర రోషన్ ప్రబాత్ జయసూర్య 1991, నవంబరు 5న శ్రీలంకలోని మాతలేలో జన్మించాడు. జయసూర్య మాతలేలోని క్రైస్ట్ చర్చి కళాశాల, కొలంబోలోని లుంబినీ కళాశాలలో చదివాడు.[2]

దేశీయ క్రికెట్

మార్చు

2006 ఎస్ఎల్సీ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో క్రైస్ట్ చర్చి కళాశాల అండర్-13, అండర్-15 జట్లతోపాటు మాతలే జిల్లా ఎలవెన్ అండర్-15 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 సారా డివిజన్ 1 టోర్నమెంట్‌లో ఆడేందుకు మాటలే క్రికెట్ క్లబ్చే ఎంపికయ్యాడు.[3]

2011/12 ప్రీమియర్ లిమిటెడ్ ఓవర్ టోర్నమెంట్ సమయంలో శ్రీలంక ఆర్మీకి వ్యతిరేకంగా కొలంబో క్రికెట్ క్లబ్ తరపున 2011 డిసెంబరు 6న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[4] 2011/12 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ టైర్ బి సందర్భంగా 2012 ఫిబ్రవరి 10న కురునెగల యూత్ క్రికెట్ క్లబ్‌తో కొలంబో క్రికెట్ క్లబ్‌కు వ్యతిరేకంగా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[5] 2011/12 సిఎస్ఎన్ ప్రీమియర్ క్లబ్‌ల టీ20 టోర్నమెంట్ సందర్భంగా 2012 మార్చి 26న టీ20 అరంగేట్రం కొలంబో క్రికెట్ క్లబ్ తరపున లంక క్రికెట్ క్లబ్‌కు వ్యతిరేకంగా ఆడాడు.[6]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2018 జూలైలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[7] 2018 ఆగస్టు 1న దక్షిణాఫ్రికాపై శ్రీలంక తరపున తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[8][9]

2022 జూలై 8న శ్రీలంక తరపున ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు.[10] అరంగేట్రంలో 6/118 గణాంకాలతో ఐదు వికెట్లు తీసుకున్నాడు.[11] మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్లు తీసుకున్నాడు.[12] అరంగేట్రంలో శ్రీలంక ఆటగాడికి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు, 177 పరుగులకు[13] పరుగులతో నాల్గవ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ప్రవీణ్ జయవిక్రమ తర్వాత టెస్టు అరంగేట్రంలో రెండు ఐదు వికెట్లు తీసిన శ్రీలంక తరఫున రెండో బౌలర్‌గా నిలిచాడు.[14] మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ ప్రదర్శనకు అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.[15] మొదటి టెస్ట్‌కు తప్పిపోయినప్పటికీ 12 స్కాల్ప్‌లతో సిరీస్‌లో ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు.

అవార్డులు

మార్చు

2022 జూలైలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నాడు.[16]

మూలాలు

మార్చు
  1. "Prabath Jayasuriya". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  2. Ratnaweera, Dhammika (7 July 2022). "Prabath Jayasuriya into Test squad". Daily News (Sri Lanka). Retrieved 2023-08-24.
  3. Nair, Karthik (2022-08-05). "Sri Lanka's Prabath Jayasuriya felicitated by Christ Church College Matale". CricTracker (in ఇంగ్లీష్). Retrieved 2023-08-24.
  4. "Full Scorecard of Col CC vs SL Army Group A 2011/12 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  5. "Full Scorecard of Kurunegala Y vs Col CC 2011/12 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  6. "Full Scorecard of Lankan CC vs Col CC Group D 2011/12 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  7. "Angelo Mathews returns as Sri Lanka ODI captain for SA series". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  8. "2nd ODI (D/N), South Africa Tour of Sri Lanka at Dambulla, Aug 1 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  9. "De Kock, bowlers, power South Africa to comfortable win". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  10. "2nd Test, Galle, July 08 - 12, 2022, Australia tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  11. "Jayasuriya takes six as Sri Lanka fight back, Smith remains unbeaten". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  12. "Stats - Dream debut for Prabath Jayasuriya and a record knock by Dinesh Chandimal". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  13. "Series drawn as Australia collapse under spin trial". Cricket Australia. Retrieved 2023-08-24.
  14. "Sri Lanka completes emphatic victory over Australia in second Test in Galle, levelling two match series 1-1". ABC News. Retrieved 2023-08-24.
  15. "Jayasuriya's 12-wicket haul, Chandimal's 206* give Sri Lanka series-levelling win". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  16. "Sri Lanka's Jayasuriya and England's Lamb crowned ICC Players of the Month for July". ICC. Retrieved 2023-08-24.

బాహ్య లింకులు

మార్చు