ప్రవీణ్ జయవిక్రమ

శ్రీలంక క్రికెటర్

పెరుమప్పెరుమ అరాచ్చిగే కవీషా ప్రవీణ్ జయవిక్రమ, శ్రీలంక క్రికెటర్. జాతీయ జట్టు కోసం క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో ఆడాడు. 2021 ఏప్రిల్ లో శ్రీలంక క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]

ప్రవీణ్ జయవిక్రమ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పెరుమప్పెరుమ అరాచ్చిగే కవీషా ప్రవీణ్ జయవిక్రమ
పుట్టిన తేదీ (1998-09-30) 1998 సెప్టెంబరు 30 (వయసు 26)
మొరటువా, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 156)2021 ఏప్రిల్ 29 - బంగ్లాదేశ్ తో
చివరి టెస్టు2022 మే 23 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 199)2021 జూన్ 29 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2021 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 91)2021 సెప్టెంబరు 12 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2022 జూన్ 11 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 5 5 5 16
చేసిన పరుగులు 12 7 0 109
బ్యాటింగు సగటు 12.00 7.00 12.12
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 8* 4* 0* 30*
వేసిన బంతులు 1,320 198 79 3,012
వికెట్లు 25 5 2 67
బౌలింగు సగటు 25.68 35.40 75.00 25.98
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0 2
అత్యుత్తమ బౌలింగు 6/92 3/59 1/29 6/91
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 0/– 0/– 11/–
మూలం: Cricinfo, 29 July 2022

జననం, విద్య

మార్చు

పెరుమప్పెరుమ అరాచ్చిగే కవీషా ప్రవీణ్ జయవిక్రమ 1998, సెప్టెంబరు 30న శ్రీలంకలోని మొరటువాలో జన్మించాడు. మొరటువాలోని సెయింట్ సెబాస్టియన్స్ కళాశాలలో, కలుతరలోని హోలీ క్రాస్ కళాశాలలో విద్యను అభ్యసించాడు.[2]

దేశీయ క్రికెట్

మార్చు

2019 జనవరి 11న 2018–19 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో కోల్ట్స్ క్రికెట్ క్లబ్‌కు ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3] ఫస్ట్-క్లాస్ అరంగేట్రం ముందు 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[4] 2019-20 ఇన్విటేషన్ లిమిటెడ్ ఓవర్ టోర్నమెంట్‌లో మూర్స్ స్పోర్ట్స్ క్లబ్ కోసం 2019 డిసెంబరు 15న తన లిస్ట్ ఎ క్రికెటం లోకి అరంగేట్రం చేశాడు.[5] 2020 జనవరి 4న 2019–20 ఎప్ఎల్సీ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో మూర్స్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[6]

2021 ఆగస్టులో 2021 ఎస్ఎల్సీ ఇన్విటేషనల్ టీ20 లీగ్ టోర్నమెంట్ కోసం ఎస్ఎల్సీ బ్లూస్ జట్టులో ఎంపికయ్యాడు.[7] 2022 జూలైలో లంక ప్రీమియర్ లీగ్మూడవ ఎడిషన్ కోసం జాఫ్నా కింగ్స్ చేత సంతకం చేయబడ్డాడు.[8]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2021 ఏప్రిల్ లో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు.[9] 2021 ఏప్రిల్ 29న బంగ్లాదేశ్‌పై శ్రీలంక తరపున తన టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[10] అరంగేట్రం మొదటి ఇన్నింగ్స్‌లో 92 పరుగులకు ఆరు వికెట్లు తీశాడు,[11] టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన శ్రీలంక తరపున ఐదవ బౌలర్‌గా రికార్డు సాధించాడు.[12] రెండో ఇన్నింగ్స్‌లో 86 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు. శ్రీలంక తరఫున మొదటి బౌలర్‌గా, టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రంలో పది వికెట్లు తీసిన మొత్తం మీద 16వ బౌలర్‌గా నిలిచాడు.[13][14] టెస్ట్ క్రికెట్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అరంగేట్రం చేసిన అత్యుత్తమ బౌలింగ్ ఇది, 2008లో జాసన్ క్రెజ్జా తర్వాత అరంగేట్రంలోనే 10 వికెట్లు తీసిన మొదటి బౌలర్ ఇతడు.[15]

2021 జూన్ లో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌కు శ్రీలంక జట్టులో జయవిక్రమ ఎంపికయ్యాడు.[16] 2021 జూన్ 29న ఇంగ్లాండ్‌పై శ్రీలంక తరపున వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు.[17] 2021 జూలైలో భారత్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[18] 2021 ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం శ్రీలంక ట్వంటీ 20 ఇంటర్నేషనల్జట్టులో ఎంపికయ్యాడు.[19]

2021 సెప్టెంబరులో 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో జయవిక్రమ ఎంపికయ్యాడు.[20] 2021 సెప్టెంబరు 12న శ్రీలంక తరపున దక్షిణాఫ్రికాపై టీ20 అరంగేట్రం చేసాడు.[21]

మూలాలు

మార్చు
  1. "Praveen Jayawickrama". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
  2. http://www.holycross.8m.net/index.htm
  3. "Group B, Premier League Tournament Tier A at Colombo, Jan 11-13 2019". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
  4. "U-19 Cricket: Kamindu to lead Sri Lanka U19s at ICC Youth WC". Sunday Times (Sri Lanka). 11 December 2017. Retrieved 2023-08-22.
  5. "Group D, SLC Invitation Limited Over Tournament at Panadura, Dec 15 2019". ESPNcricinfo. ESPN Inc. 15 December 2019. Retrieved 2023-08-22.
  6. "Group A, SLC Twenty-20 Tournament at Colombo (PSS), Jan 4 2020". ESPNcricinfo. ESPN Inc. 4 January 2020. Retrieved 2023-08-22.
  7. Weerasinghe, Damith (9 August 2021). "Sri Lanka Cricket announce Invitational T20 squads and schedule". The Papare. Retrieved 2023-08-22.
  8. "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPNcricinfo. ESPN Inc. 6 July 2022. Retrieved 2023-08-22.
  9. Gaur, Akshat (17 April 2021). "Sri Lanka announces 18-man squad for Bangladesh Test series". Cricket Times. Retrieved 2023-08-22.
  10. "2nd Test, Kandy, Apr 29 - May 3 2021, Bangladesh tour of Sri Lanka". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
  11. "Jayawickrama's dream debut blunts Bangladesh on moving day". International Cricket Council. 1 May 2021. Retrieved 2023-08-22.
  12. "Sri Lanka vs Bangladesh, 2nd Test Day 3: Sri Lanka still have the edge over Bangladesh". Cricket World. 1 May 2021.
  13. "Statistics / Statsguru / Test matches / Bowling records". ESPNcricinfo. ESPN Inc. 3 May 2021. Retrieved 2023-08-22.
  14. "Jayawickrama helps Sri Lanka clinch first series win of 2021". International Cricket Council. 3 May 2021. Retrieved 2023-08-22.
  15. Isam, Mohammad (3 May 2021). "Praveen Jayawickrama's stunning debut seals Sri Lanka's dominant victory". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
  16. "Sri Lanka squad for England T20I and ODI series". Sri Lanka Cricket. 8 June 2021. Retrieved 2023-08-22.
  17. "1st ODI, Chester-le-Street, Jun 29 2021, Sri Lanka tour of England". ESPNcricinfo. ESPN Inc. 29 June 2021. Retrieved 2023-08-22.
  18. "Bhanuka Rajapaksa picked for India ODIs, T20Is; Kumara, Rajitha return from injuries". ESPNcricinfo. ESPN Inc. 16 July 2021. Retrieved 2023-08-22.
  19. Fernando, Andrew Fidel (30 August 2021). "Kusal Perera back in limited-overs squads after recovering from Covid-19". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
  20. Fernando, Andrew Fidel (10 September 2021). "Theekshana and Rajapaksa surprise picks in Sri Lanka's T20 World Cup squad". ESPNcricinfo. ESPN Inc. Retrieved 2023-08-22.
  21. "2nd T20I (N), Colombo (RPS), Sep 12 2021, South Africa tour of Sri Lanka". ESPNcricinfo. ESPN Inc. 12 September 2021. Retrieved 2023-08-22.

బాహ్య లింకులు

మార్చు