నివాస సౌకర్యాలతో కూడిన ప్రాథమిక విద్యాసంస్థలను గురుకుల విద్యాలయాలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ గురుకులాలుసవరించు

గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో విద్యావకాశాలను పెంచడానికి, సాధారణ, ఎస్ సి, ఎస్ టి, బిసి,, అల్పసంఖ్యక వర్గాల గురుకులాలు లేక ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిని నిర్వహించే సంస్థలు.

  1. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ[1]
  2. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ [2]
  3. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ [3]

కేంద్ర ప్రభుత్వ గురుకులాలు (నవోదయ పాఠశాలలు)సవరించు

నవోదయ విద్యాలయ సమితి [4] జిల్లాకి ఒకటి చొప్పున గురుకుల పాఠశాలలను నిర్వహిస్తున్నది.

ప్రవేశ పద్ధతిసవరించు

ఒకటవ తరగతి లో ప్రవేశంసవరించు

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే కొన్ని పాఠశాలలలో ఒకటవ తరగతిలో ప్రవేశం ఉంది.

మూడవ తరగతి లో ప్రవేశంసవరించు

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే కొన్ని పాఠశాలలలో మూడవ తరగతిలో ప్రవేశం ఉంది.

ఐదవ తరగతి లో ప్రవేశంసవరించు

ఆంధ్రప్రదేశ్ గురుకులాలు: 5 తరగతిలో ప్రవేశం పొందడంకోసం, 2009-10 వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేవారు. ఐతే విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ నుండి అమలు కావడంతో దీనిని రద్దు చేశారు.[5] ప్రవేశ నియమాలు ప్రకటించవలసి ఉంది. ఇతర కులాలు, వెనుకబడిన కులాల వారు 9 నుండి 11సంవత్సరాల వయస్సు కలవారై, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు 9 నుండి 13సంవత్సరాల వయస్సు కలవారై వుండాలి. క్రిందటి రెండు సంవత్సరాలు అంతరాయం లేకుండా గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతుండాలి. ఈ నిబంధన ఎస్ సి, ఎస్ టి వారికి వర్తించదు.

ఎంపిక రిజర్వేషన్, ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. మామూలుగా, ఏ జిల్లా విద్యార్థులు ఆజిల్లాలోని పాఠశాలలలోనే చేరాలి. ఐతే, కొన్ని వెనుకబడిన వర్గాల,, అల్పసంఖ్యక వర్గాల పాఠశాలల్లో ఇతర జిల్లాల విద్యార్థుల ప్రవేశానికి అవకాశం ఉంది. దరఖాస్తులు గురుకుల పాఠశాలలు, జిల్లా విద్యా శాఖాధికారి, జిల్లా ఉప విద్యా శాఖాధికారి కార్యాలయాల్లో, గిరిజన ప్రాంతాలలోని ఐ టిడిఎ ప్రాజెక్టు అధికారి కార్యాలయాల్లో అమ్ముతారు.

ఆరవ తరగతి లో ప్రవేశంసవరించు

నవోదయ పాఠశాలలో ఆరవ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఖాళీ సీట్లకి 9, 11తరగతులలోకూడా ప్రవేశం వుంటుంది. సాధారణంగాప్రవేశ పరీక్ష దరఖాస్తులు సెప్టెంబరు మాసంలో, ప్రవేశ పరీక్ష పిభ్రవరి మాసంలో జరుగుతుంది.

ఎనిమిదవ తరగతి లో ప్రవేశంసవరించు

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 6 ప్రతిభా పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన ఉంది. ఇవి చాకలి బెల్గాం, ఏటపాక, శ్రీశైలం, లో ఉన్నాయి. 7 వతరగతి తెలుగు, లేక ఇంగ్లీషు మాధ్యమాలలో ఉత్తీర్ణత పొందిన వారు ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందుతారు. 30 శాతం సీట్లు బాలికలకు కేటాయించ బడినవి. ప్రవేశం కోరే పిల్లలు గిరిజనులై, వారి తల్లిదండ్రుల ఆదాయం రు. 60,000 (2010 లో ప్రవేశానికి) మించకూడదు.

ఇంటర్ లో ప్రవేశంసవరించు

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థసవరించు

సంస్థ నిర్వహిస్తున్న 6 ప్రతిభా పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమంలో బోధన ఉంది. ఇవి చాకలి బెల్గాం, ఏటపాక,, శ్రీశైలం, మరికవలస, న్యూ సాహుంపేట, శ్రీకాళహస్తిలో ఉన్నాయి. వృత్తి విద్యా ప్రవేశపరీక్షలకు ప్రత్యేక శిక్షణకూడ ఉంది. 10 వతరగతి తెలుగు, లేక ఇంగ్లీషు మాధ్యమాలలో ఉత్తీర్ణత పొందిన వారు ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందుతారు. 20 శాతం సీట్లు బాలికలకు కేటాయించ బడినవి. ప్రవేశం కోరే పిల్లలు గిరిజనులై, వారి తల్లిదండ్రుల ఆదాయం రు1,00,000 (2010 లో ప్రవేశానికి) మించకూడదు.

సంస్థ నిర్వహిస్తున్న 51 జూనియర్ కళాశాలలలో తెలుగు మాధ్యమంలో బోధన ఉంది. ఇంటర్మీడియట్ లో ఎంపిసి, బైపిసి, సిఇసి, హెచ్ఇసి, ఎంఇసి, వృత్తి విద్యా కోర్సులు (ఎ&టి, ఎమ్ఎల్టి, ఒఎ, ఇడబ్ల్యుఎస్, ఎంపిహెచ్ డబ్ల్యు) ఉన్నాయి.గిరిజన విద్యార్థులు, పరిమిత సంఖ్యలో ఇతరులు వారి వారిజిల్లాలలోని కళాశాలలోనే చేరటానికి అర్హులు. 10 వ తరగతి మార్కులు ఆధారంగా ఎంపిక వుంటుంది.

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థసవరించు

ప్రవేశ పరీక్షలో ప్రతిభ,, ప్రాంత, వర్గ నియమాల ప్రకారం కేటాయింపులకు అనుగుణంగా ప్రవేశం కల్పిస్తారు.
తెలుగు, ఇంగ్లీషు మీడియం కళాశాలలు:
బాలురకు:వెంకటగిరి, గ్యారంపల్లి, సర్వేలు
బాలికలకు: తాటిపూడి, బనవాసి, హసన్ పర్తి
ఉర్దూ, ఇంగ్లీషు మీడియం కళాశాలలు:
బాలురకు (అల్ప సంఖ్యాక వర్గాలవారికి) :గుంటూరు, కర్నూలు, నిజామాబాద్, హైద్రాబాద్
ఇంగ్లీషు మీడియం కళాశాలలు:
బాలురకు:నాగార్జునసాగర్, కొడిగెనహళ్లి
బాలురకు, బాలికలకు: నిమ్మకూరు

డిగ్రీ లో ప్రవేశంసవరించు

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థసవరించు

సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, బి, క్యాంపు, కర్నూలు (ఆంగ్ల, తెలుగు మాధ్యమము)
నాగార్జునసాగర్ (కేవలము ఆంగ్ల మాధ్యమము)

వనరులుసవరించు

  1. "ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైటు". Archived from the original on 2018-12-12. Retrieved 2020-01-14.
  2. "ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైటు". Archived from the original on 2010-05-01. Retrieved 2010-05-01.
  3. "ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వెబ్ సైటు". Archived from the original on 2010-06-30. Retrieved 2010-05-01.
  4. "నవోదయ విద్యాలయ సమితి వెబ్ సైటు". Archived from the original on 2008-09-13. Retrieved 2010-05-01.
  5. జి ఒ ఆర్ టి నం 246 తేది మే 17, 2010