సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలు

(సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల నుండి దారిమార్పు చెందింది)

సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల లేదా రజతోత్సవ డిగ్రీ కళాశాల, కర్నూలు నగరం లోని బి.క్యాంపులో కల స్వతంత్ర ప్రతిపత్తి కల కళాశాల. భారతదేశ స్వతంత్ర రజతోత్సవాల సందర్భముగా ఈ కళాశాలను ఏర్పాటు చేసారు. ఇందులో ప్రవేశానికి రాష్ట్రవ్యాప్తముగా అర్హత పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థులెందరో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. విద్యార్థులకు చదువు, వసతి సౌకర్యాలను ప్రభుత్వము ఉచితముగా అందిస్తున్నది.

సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల
స్థాపితం1972
ప్రధానాధ్యాపకుడుడాక్టర్ టి.జి.ఆర్. ప్రసాద్
చిరునామకర్నూలు, ఆంధ్ర ప్రదేశ్, India India, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్, India
కాంపస్Urban

1972 లో స్వతంత్ర ప్రాప్తి రజతోత్సవ సంబరాల సందర్భంలో ఈ కళాశాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థాపించింది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన బాలురకి మాత్రం ఇందులో స్థానం దక్కేది. వేర్పాటు (తెలంగాణ, ఆంధ్ర) ఉద్యమాల నేపథ్యంలో, రాష్ట్రం లోని మూడు ప్రాంతాల నుండి విద్యార్థులకు ప్రవేశం కల్పించి ప్రాంతీయ సయోధ్య కుదర్చాలనే తాపత్రయంతో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు, ఐ ఏ ఎస్ అధికారి శ్రీ ఎం వి రాజగోపాల్ లు ఈ కళాశాల విద్యార్థులకు ఉచిత భోజన, ఉచిత విడిది, ఉచిత బోధన అందించేవిధంగా రూపకల్పన చేశారు. ఆంధ్ర రాష్ట్రం యొక్క మొదటి రాజధానిలో ఈ స్వప్నం సాకారమైనది. 42:36:22 నిష్పత్తిలో ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్త ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించేవారు. 2005 లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ కళాశాల యొక్క స్వయంప్రతిపత్తిని ప్రదానం చేసింది. బెంగుళూరుకి చెందిన నేషనల్ అక్రెడిషన్ అండ్ అసెస్ మెంట్ కౌన్సిల్ విద్యా సంబంధిత, మౌలిక సదుపాయాల పరీక్షించి . "ఏ" గ్రేడుని ప్రదానం చేసింది. ఈ కళాశాల ప్రారిశ్రామిక రసాయన శాస్త్రము, ఔషధ రసాయన శాస్త్రము, సూక్ష్మ జీవ శాస్త్రము, జీవ రసాయన శాస్త్రము, కంప్యూటర్ సైన్స్, ట్రావెల్ అండ్ పర్యాటకం వంటి వృత్తి విద్యా కోర్సులని పరిచయం చేసింది. ఆంగ్లం, తెలుగు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, అర్థ శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులని అందిస్తుంది.

కళాశాల విద్యల వివరాలు

మార్చు

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ [బి.ఎస్సీ]

మార్చు

బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ [బి.కామ్]

మార్చు

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ [బి.ఎ]

మార్చు

విద్యను అభ్యసించిన ప్రముఖులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.