వెంకటగిరి
వెంకటగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలోని ఒక చారిత్రక పట్టణం, అదే పేరు గల మండల కేంద్రం.
పట్టణం | |
![]() | |
Coordinates: 14°00′N 79°36′E / 14°N 79.6°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండలం | వెంకటగిరి మండలం |
Area | |
• మొత్తం | 25.43 km2 (9.82 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 52,688 |
• Density | 2,100/km2 (5,400/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1016 |
Area code | +91 ( 8625 ![]() |
పిన్(PIN) | 524132 ![]() |
Website |
పేరు వ్యుత్పత్తి సవరించు
వెంకటగిరి అనే గ్రామనామం వెంకట అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. వెంకట అనేది దైవ సూచి, శ్రీనివాసుని మరో పేరు వెంకట.[2]
చరిత్ర సవరించు
మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9 లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, వరంగల్ రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతన్ని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో లార్డ్ క్లైవు కాలంలో సనద్ ను పొందారు. తమ వంశం జమీందార్లు "రాజా" అనే బిరుదును వాడుతూ వచ్చారు.
వెంకటగిరి జమీందారుల పూర్వీకుడైన యాచమనాయుడు 1614లో రెండవ తిరుమల దేవరాయల తర్వాతి విజయనగర సామ్రాజ్య వారసత్వంపై జరిగిన పోరాటంలో తిరుమల దేవరాయలు వారసునిగా నిర్ణయించిన శ్రీరంగరాయలకు అనుకూలంగా పోరాడారు. వారసత్వపు తగాదాల్లో జగ్గరాయుడు అనే రాచబంధువు శ్రీరంగరాయల కుటుంబాన్ని అంతా చంపేసినా, రంగరాయల కుమారుడు కుమారుడైన రామదేవరాయలను సింహాసనంపై నిలిపారు.[3]
భౌగోళికం సవరించు
ఈ పట్టణం అక్షాంశ రేఖాంశాలు 13°58′00″N 79°35′00″E / 13.9667°N 79.5833°E.[4]
జనగణన వివరాలు సవరించు
జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ.
రవాణా సౌకర్యాలు సవరించు
- వెంకటగిరిలో రెండు బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుకు బస్సులు ఉన్నాయి. చుట్టుపక్కల చిన్న ఊర్లకు పల్లెలకు బస్సులు మాత్రమే కాక ఆటోలు, వ్యానులు ఉన్నాయి.
- ఇక్కడ రైల్వేస్టేషను గూడూరు - శ్రీకాళహస్తి మార్గం మధ్యలో వుంది. దగ్గర లోని పెద్ద జంక్షన్ గూడూరు, రేణిగుంట.
- అతి దగ్గరలోని విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం
ఉత్పత్తులు సవరించు
వెంకటగిరి పట్టణం పట్టుచీరలకు ప్రసిద్ధి.
దర్శనీయ ప్రదేశములు సవరించు
శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం సవరించు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని,తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసన వినాయక చవితి తర్వాత వచ్చే మూడో బుధవారం నాడు గ్రామస్తులు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది
ఇవీ చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 233. Retrieved 10 March 2015.
- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
- ↑ "Falling Rain Genomics, Inc - Venkatagiri Town". Archived from the original on 2008-01-14. Retrieved 2008-02-03.