ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 1984లో ప్రారంభించారు. మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ మరయు బస్ స్టేషన్ లకు దగ్గరలో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఇది ప్రారంభం అయ్యి కాల క్రమంలో విస్తరిస్తూ ప్రస్తుతం 26 ఎకరాల విస్తీర్ణంలో నడపబడుతున్నది.

కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,మహబుబాబాద్

కళాశాల చరిత్ర

మార్చు

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా 1984 నవంబరు 28న కళాశాల శంకుస్థాపన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పట్లో ఏర్పాటు చేయాలనుకున్న 133 కళాశాలల్లో భాగంగా మానుకోట డిగ్రీ కళాశాలను లేఖ సంఖ్య G.O.Ms.No.306 Edn.Dated 19 జూలై 1983 ప్రకారం ప్రారంభించవలసినంగా ఉత్తర్వులు విడుదల అయ్యాయి.

సౌకర్యాలు

మార్చు

తెలంగాణ స్కిల్స్‌ నాలెడ్జ్‌ సెంటర్‌

మార్చు

ద్వారా విద్యార్థులకు బహుముఖ శిక్షణ ఇస్తున్నారు. పోటీ పరీక్షలకు తర్ఫీదు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ తదితర అంశాల్లో శిక్షణనిస్తున్నారు.

ఆధునిక సౌకర్యాలతో ప్రయోగశాలలు

మార్చు

గ్రంధాలయం

మార్చు

15వేలకు పైగా సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలతో గ్రంథాలయం

విద్యార్ధినుల వసతి గృహం

మార్చు

2017-18 విద్యా సంవత్సరానికి 100 మంది విద్యార్థినులకు హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తున్నారు.

ప్రత్యేక తరగతులు

మార్చు

2015-16 విద్యాసంవత్సరం వార్షిక పరీక్ష సమయంలో కళాశాల అధ్యాపకులు నెలరోజుల పాటు సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనాన్ని అందించి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. 2016-17లో జిల్లా కలెక్టర్‌, జేసీ, సీపీడీసీ కమిటీ, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని అందించారు.

క్రీడా ప్రాంగణం

మార్చు

ఖోఖో, బాస్కెట్‌బాల్‌, అథ్లెటిక్స్‌ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇక్కడ లభిస్తోంది.

వ్యాయామ శాల

మార్చు

విద్యార్ధుల శారీరక ధృడత్వం కోసం వ్యాయామ శాల ఏర్పాటు చేసారు.

బోధనేతర కార్యక్రమాలు

మార్చు

విద్యాబోధనతో పాటు హరితహారం, సెమినార్‌లు, ఫీల్డ్‌ట్రిప్స్‌, విద్యార్థుల స్టడీ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు.

ప్రధానాచార్యుల కాలపట్టిక

మార్చు
  • డాక్టర్ టి.యుగంధర్ M.Sc, P.hD

కళాశాల సిబ్బంది

మార్చు

ప్రస్తుతం కళాశాలలో 22 మంది భోధనా సిబ్బంది, 10 మంది బోధనేతర సిబ్బందితో నిర్వహింపబడుతోంది.

కోర్సుల వివరాలు

మార్చు
  • B.Sc.(Botany-Zoology-Computer Applications)--English Medium
  • B.Sc.(Botany-Zoology-Chemistry)--English Medium
  • B.Com.(Accounts)--Telugu Medium
  • B.Sc.(Botany-Zoology-Chemistry)--Telugu Medium
  • B.Com(Computer)-English Medium
  • B.Sc(Life Science)-Diary Science

కళాశాలకు లభించిన గుర్తింపులు

మార్చు
  • ఐఎస్ ఓ గుర్తింపు:[1] విద్యార్ధులకు విద్యాప్రమాణాలు సౌకర్యాల కల్పన విషయంలో ప్రామాణికతకు గుర్తింపు ఇచ్చే విధానం తొలిసారిగా 2019-20 లో ప్రారంభం అయ్యింది దానిలో భాగంగా ఈ కళాశాలకు ఆ గుర్తింపు దక్కింది.
  • న్యాక్ లో 2.44 పాయింట్లతో జాతీయ స్థాయిలో బి గ్రేడ్ సాధించింది.[2]

కళాశాలలో విద్యనభ్యసించిన ముఖ్యులు

మార్చు
  1. గాయకుడు జయరాజు
  2. గాయకుడు చక్రి
  3. జబర్ధస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న రాజమౌళి
  4. జబర్ధస్త్ జీవన్

మూలాలు

మార్చు
  1. "ఈనాడు దిన పత్రిక". Retrieved 28 October 2020.
  2. "ఆంధ్రజ్యోతి దిన పత్రిక". www.andhrajyothy.com. Archived from the original on 31 అక్టోబరు 2020. Retrieved 28 October 2020.

బయటి లంకెలు

మార్చు