మహబూబాబాద్

తెలంగాణ, వరంగల్ జిల్లా, మహబూబాబాద్ మండలం లోని జనగణన పట్టణం
  ?మహబూబాబాద్
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167Coordinates: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 44.99 కి.మీ² (17 చ.మై)
జిల్లా (లు) మహబూబాబాద్ జిల్లా
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం మహబూబాబాద్


మహబూబాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన జనగణన పట్టణం, అదే పేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం,మండల కేంద్రం.[1]. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]మహబూబాబాద్ ను మానుకొట అని కూడా అంటారు.మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పట్టణం.ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరం. ఎన్నో విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయాలు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.

జిల్లా గ్రంథాలయం మహబూబాబాద్

పేరు వెనుక చరిత్రసవరించు

మానుకోట తెలుగులో “మ్రాను” అంటే “చెట్టు” మరియు “కోట” అంటే “కోట”. ఆంగ్లం లో ఇది “చెట్లతో చేసిన కోట” అని అనువదిస్తుంది. పూర్వపు రోజుల్లో మానుకోట కోట వంటి చెట్లతో పుష్కలంగా ఉండేది. అందుకే ఈ ప్రాంతాన్ని మానుకోట అని పిలుస్తారు.

నిజాం పాలకుడు “మహాబూబ్ అలీ ఖాన్” నగరాన్ని సందర్శించినప్పుడు, మానుకోటను మహబూబాబాద్ గా మార్పు చేశారు.నిజాం అధికారులలో ఒకరైన మహాబుబ్. అతను ఒకసారి స్వతంత్రానికి ముందు మనుకోటకు వచ్చి ఈ పట్టణం వెలుపల “షికార్ఖానా” అని పిలువబడే ప్రదేశంలో ఉన్నాడు. ఆ కారణంగా మహాబూబాబాద్ అని పిలుస్తూ ఉండడంతో కాలం గడిచేకొద్దీ మనుకోట పేరు మహబూబాబాద్ గా మార్చబడింది.[3]

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,13,812 - పురుషులు 56,424 - స్త్రీలు 57,388..పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719. మ్రానుకోట నుంచి మానుకోటగా ఆ తరువాత మహబూబాబాద్ గా పిలువబడుతున్న ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవిని కలిగి ఉండేదని పెద్దలు చెబుతుంటారు. ఆ ప్రాంతం మైదాన, మన్యం ప్రాంతాల క లయికతో విభిన్న వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటికీ మానుకోటగాను, మహబూబాబాద్ గాను, మహబాద్ గాను పిలుస్తుంటారు. గిరిజన జనాభా అధికంగా ఉండే ప్రాంతంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జనాభా పెరుగుతున్నప్పటికీ దానికి తగినట్టుగా రెవెన్యూ జనరేట్ అయ్యే పరిస్థితులు ఇక్కడ లేవు. కేవలం భవన నిర్మాణ రంగంపైనే చాలా మంది ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ప్రాంతం కావడంతో ఇక్కడ పల్లెలలో ఖరీఫ్, రబీ సమయాల్లో వ్యవసాయ పనులతో ఉపాధి లభిస్తుంది. గ్రానైట్ రంగం అభివ్రుద్ధి చెందుతుండటంతో కొందరికి అది ఉపాధిని ఇస్తోంది. 461 గ్రామపంచాయతీలతో జిల్లాగా ఉన్న మహబూబాబాద్ ప్రజలు ఇప్పటికీ విద్యా, ఉద్యోగ, ఇతర అవసరాల కోసం వరంగల్, ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్ నగరాలకు వెళుతుంటారు. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినా కూడా మహబూబాబాద్లో ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలు లేవు...

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.సవరించు

లోగడ మహబూబాబాద్ వరంగల్ జిల్లాకు చెందిన ఒక పట్టణం, రెవిన్యూ డివిజన్,మండల కేంద్రం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహబూబాబాద్ ను కొత్త జిల్లాగా ప్రకటించి, అదే జిల్లాలో రెవిన్యూ డివిజను కేంద్రంగా, మండలం కేంద్రంగా (1+19) ఇరవై గ్రామాలుతో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

రవాణా సదుపాయాలుసవరించు

మహబూబాబాదుకు బస్సు, రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. కాజీపేట్ - విజయవాడ రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉంది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన వరంగల్లు నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిమీ దూరంలో ఉంది.

ప్రభుత్వ ఆసుపత్రిసవరించు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో వెల్స్ ఫార్గో, యునైటెడ్ వే అనే స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో 36 పడకల భవనం నిర్మించబడింది. ఇందులో క్రిటికల్ కేర్, కొవిడ్ రోగుల చికిత్స చేస్తారు. 2022 ఏప్రిల్ 18న తెలంగాణ రాష్ట్ర గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ బిందు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.[4]

వైద్య కళాశాలసవరించు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 550 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 2022 మే 10న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్‌ రావు శంకుస్థాపన చేశాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో రేడియాలజీ సేవల భవనం, 41 పడకల జనరల్ వార్డ్, డెడికేటెడ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ కె. శశాంక, జెడ్పీ చైర్‌ పర్సన్‌ అంగొతు బిందు తదితరులు ఉన్నారు.[5] ఈ వైద్య కళాశాలకు 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లభించింది.[6]

పట్టణ ప్రముఖులుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

ప్రదేశాలు జలపాతంలుసవరించు

1.B.N గుప్తా(తులారం)జలపాతం,2.ఏడుబావుల జలపాతం,3.బయ్యారం చెరువుశాసనం ,4.భీమునిపదం జలపాతం,5.కంబాలపల్లి చెరువు,6.కురవి వీరభద్రస్వామి ,7.అనంతరం (అనంత్రద్రీ), 8.డోర్నకల్ చర్చీ, బాలనాయక్స్స సొనో

మూలాలుసవరించు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "manu kota mahabubabad - Google Search". www.google.com. Retrieved 2022-06-14.
  4. telugu, NT News (2022-04-18). "మారుమూల ప్రాంతాల్లో కూడా కార్పొరేట్‌ వైద్యం : మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి". Namasthe Telangana. Archived from the original on 2022-04-18. Retrieved 2022-04-18.
  5. telugu, NT News (2022-05-10). "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే మానుకోట అభివృద్ధి : మంత్రి హరీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-05-11. Retrieved 2022-05-11.
  6. "మహబూబాబాద్‌ కొత్త వైద్య కళాశాలకు అనుమతి". EENADU. Archived from the original on 2022-11-04. Retrieved 2022-11-04.
  7. telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  8. "హైకోర్టుకు 12 మంది జడ్జీలు!". Sakshi. 2022-02-03. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.

బయటి లింకులుసవరించు