ప్రభుదాస్ పట్వారి

భారతీయ రాజకీయవేత్త

ప్రభుదాస్ పట్వారీ (1909-85) గుజరాత్ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, గాంధేయవాది. 1977-1980 మధ్యకాలంలో తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశాడు.[1] 1978లో తమిళ గ్రామీణ ప్రాంతాలలో బాగా ప్రాచూర్యం పొందాడు.[2]

ప్రభుదాస్ పట్వారి
జననం1909
మరణం1985
జాతీయతభారతీయురాలు
వృత్తిన్యాయవాది
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, గాంధేయవాది

జననం మార్చు

ప్రభుదాస్ 1909లో గుజరాత్ రాష్ట్రంలో జన్మించాడు.

ఉద్యమంలో మార్చు

మహాత్మా గాంధీ పిలుపుమేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో చేరి గాంధేయవాదిగా, తమిళనాడు రాజ్‌భవన్‌లో మాంసాన్ని వడ్డించడానికి నిరాకరించి శాఖాహారుడిగా నిలిచాడు.[3]

సామాజిక సేవ మార్చు

నిరు పేదలకు సహాయం చేయడానికి అనేక మార్పులను తీసుకువచ్చాడు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌తోపాటు, తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా అట్టడుగు వర్గాల మహిళలకు సహాయం చేయడానికి, బాల్య వివాహాలను నిరోధించడానికి అనేక సంస్థలను ప్రారంభించడంలో సహాయం చేశాడు. కార్మికులు, మహిళలతోపాటు సమాజంలోని బలహీనుల కోసం ప్రో-బోనో కేసులపై పోరాడాడు. హిందూ-ముస్లిం ఐక్యతను గౌరవిస్తూ ఇరువర్గాలకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు. మతపరమైన అల్లర్ల సమయంలో వారిని ఏకం చేశాడు. ఇందిరాగాంధీ పరిపాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుశిక్షను అనుభవించాడు.

మరణం మార్చు

ప్రభుదాస్ పట్వారీ 1985లో మరణించాడు.

మూలాలు మార్చు

  1. March 13, india today digital; October 31, 2014 ISSUE DATE:; March 12, 1978UPDATED:; Ist, 2015 11:58. "Tamil Nadu Governor Prabhudas Patwari makes news for his vegetarianism, Gandhian austerity". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-11-14. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Tamil Nadu Governor Prabhudas Patwari makes news for his vegetarianism, Gandhian austerity".
  3. "Tamil Nadu governor Banwarilal Purohit on the same page as former governor Patwari".