ప్రమతి
ప్రమతి భృగు వంశంలోని దివ్య తపస్వియైన మహర్షి. ఇతడు చ్యవన మహర్షి, సుకన్యల పుత్రుడు. ఘృతాచి అను అప్సరస ఇతనిని వలచి యాతని ఆశ్రమమునకు వచ్చి సేవచేయుచుండెను. కొంతకాలమునకు ఆతనికి ఆమెపై అనురాగము ఉదయించి పిదప ఘృతాచి యందు సుపుత్రుని పొందెను. అతడు రురుడు అను పేరుతో పెరుగుచు ధర్మాత్ముడు, తపశ్శాలి, విద్యావంతుడు, మన్మథోపముడై వెలుగొందెను.
ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |