పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.

ఘృతాచి ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. ఈమెకు ప్రమతి వలన రురుడు అను కుమారుడు కలిగెను.


ఒకసారి ఈమెను విశ్వకర్మ చూచి, పొందు కోరగా ఘృతాచి నిరాకరించెను. కోపము వచ్చిన విశ్వకర్మ శూద్రయోని యందు పుట్టమని శపించెను. ఘృతాచి విశ్వకర్మను భూలోకమున జన్మించమని ప్రతిశాపమిచ్చెను. శాపవశమున ఘృతాచి మదనుడను వానికి గోపకాంత యందు జన్మించి, భూలోకమున జన్మించిన విశ్వకర్మతో భోగించెను.


వ్యాసుడు తపస్సు చేసుకొను సమయంలొ ఘృతాచి విహరించుట తటస్థించెను. అప్పుడు అతని హృదయము మదన ప్రేరితమైనది. ఆతని చూపులకు భయపడి ఘృతాచి శుకము యొక్క రూపమును దాల్చి తిరుగుచుండెను. ఆ సమయములోనే వ్యాసుని రేతస్సు పతనమై అందుండి శుకుడు జన్మించెను.

"https://te.wikipedia.org/w/index.php?title=ఘృతాచి&oldid=2985048" నుండి వెలికితీశారు