ప్రమాదము

దుర్ఘటన
(ప్రమాదాలు నుండి దారిమార్పు చెందింది)

ప్రమాదము, విపత్తు లేదా ఆపద (Accident) ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మరణానికి కారణం.

వివిధ రకాలు

మార్చు

Ma basti roads problem gurichi

మార్చు

ప్రమాదానికి కారణమైన వాహనం యజమాని నుంచి మోటారు వాహనాల చట్టం సెక్షన్‌ 146 ప్రకారం పరిహారం పొందవచ్చు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే 'మోటార్‌ ఏక్సిడెంట్స్‌ క్లైమ్స్‌ ట్రిబ్యునల్‌'కు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలి. మోటార్‌ క్రైం ట్రిబ్యునల్‌ సభ్యుడిగా జిల్లా జడ్జి వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాద కేసులను విచారించే కోర్టు ప్రతి జిల్లా కేంద్రంలో వుంటుంది. రోడ్డు ప్రమాదంలో నష్టపోయిన వ్యక్తి లేదా మరణించిన అతని వారసులు పరిహారం కోసం కింద తెలిపిన పత్రాలను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత డాక్టర్‌ సర్టిఫికెట్స్‌, మెడికల్‌ ఖర్చులు తదితర వివరాలను తెలిపే పత్రాలను కోర్టుకు సమర్పించాల్సి వుంటుంది.వాటి ఆధారంగా కోర్టు ప్రమాద తీవ్రతను బట్టి బాధితునికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని తీర్పునిస్తుంది. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని సూచిస్తుంది. ప్రమాదానికి కారణమైన వాహనానికి ఏ సంస్థలో అయితే బీమా చేసి ఉంటారో ఆ సంస్థ నష్టపరిహారం చెల్లిస్తుంది. అర్జీ స్వయంగా లేదా లాయర్‌ ద్వారా కోర్టుకు అందచేయవచ్చు.నష్టం జరిగినట్లు తెలిపే పోలీసు కేసు ఎఫ్‌ఐఆర్‌ ప్రతి,ప్రమాదానికి కారణమైన వాహనం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, ఇన్సూరెన్స్‌ పాలసీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నకలు,చికిత్స చేసిన వైద్యుని అభిప్రాయాన్ని తెలిపే మెడికల్‌సర్టిఫికెట్‌, వెద్యుడిచ్చే సర్టిఫికెట్‌లో బాధితుడికి శారీరకంగా ఎంత మేర నష్టం వాటిల్లిందనే సమాచారంతో పాటు, వైద్యసేవలకు అయిన ఖర్చుల వివరాలు జతచేయాల్సి వుంటుంది.కోర్టు ఫీజు క్లైమ్‌ మొత్తంలో ఒక్క శాతం చెల్లించాలి. ఆ ఫీజును కూడా చెల్లించే స్థోమతలేని క్లైయిమ్‌దారులకు నష్టపరిహారం మంజూరు అయిన తర్వాత అందులో నుంచి కోర్టు ఫీజును చెల్లించవచ్చు.కేసును త్వరగా పరిష్కరించుకోవాలనుకుంటే న్యాయవాది ద్వారా కేసును లోక్‌అదాలత్‌కు బదిలీ చేయించుకోవచ్చు. క్లైమ్‌దారుడు, బీమా కంపెనీ ఉమ్మడిగా 'లోక్‌అదాలత్‌'లో మెమో దాఖలు చేసి ఇద్దరికీ ఆమోద యోగ్యమైన విధంగా చర్చించుకుని కేసును త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు.ప్రమాదంలో నష్టపోయిన బాధితులు ఇతర ప్రాంతాలవారో లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వారో అయితే మోటార్‌వాహనాల చట్టం 166(2) ప్రకారం ప్రమాదం జరిగిన ప్రాంతంలో కానీ, తాను నివాసం వుంటున్న ప్రాంతంలో గాని కోర్టులో ఏక్సిడెంట్‌ క్లైమ్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

2021 తుపాన్ విపత్తు

మార్చు

దేశంలో 2021వ సంవత్సరంలో సంభవించిన విపత్తుల్లో 1750 మంది మరణించారని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ విపత్తుల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, మెరుపులు, తుపానులు, చలి తరంగ సంఘటనలు మొదలైనవి చోటుచేసుకున్నాయి.[1]

మూలాలు

మార్చు
  1. "2021 తుపాన్ విపత్తుల్లో 1750 మంది మృతి...ఐఎండీ నివేదిక వెల్లడి". andhrajyothy. Retrieved 2022-01-15.

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రమాదము&oldid=4361464" నుండి వెలికితీశారు