ప్రమోద్ భగత్

(ప్రమోద్‌ భగత్‌ నుండి దారిమార్పు చెందింది)

ప్రమోద్‌ భగత్‌ భారతదేశానికి చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్3 విభాగంలో స్వర్ణ పతకం గెలిచాడు.[2] ప్రమోద్‌ భగత్‌ పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ విభాగంలో స్వర్ణం పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.[3]

ప్రమోద్‌ భగత్‌
వ్యక్తిగత సమాచారం
జననం (1988-06-04) 1988 జూన్ 4 (వయసు 36)
హాజీపూర్, వైశాలి జిల్లా, బీహార్, భరత్.[1]
నివాసముభువనేశ్వర్, ఒడిశా
దేశం భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు2006– ప్రస్తుతం
వాటంఎడమ
పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్3
అత్యున్నత స్థానం1
ప్రస్తుత స్థానం1
BWF profile

2006లో పారా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన ప్రమోద్‌ ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకాలు ఉన్నాయి.

భగత్ బీహార్‌లోని హాజీపూర్ నగరంలో 4 జూన్ 1988న జన్మించాడు.[4] ఆయన ఐదేళ్ల వయస్సులో పోలియో బారిన పడ్డాడు. ప్రమోద్‌ భగత్‌ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌ ఆటకు ఆకర్షితుడై, తన తండ్రి ప్రోత్సాహంతో బాడ్మింటన్‌లో శిక్షణ తీసుకున్నాడు.[5]

సాధించిన పతకాలు

మార్చు
  • 2021లో టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్3 విభాగంలో స్వర్ణ పతకం
  • 2019లో దుబాయ్‌ పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో సింగిల్స్‌ విభాగంలో స్వర్ణ పతకం
  • ఐడబ్ల్యూఏఎస్‌ వరల్డ్ గేమ్స్ 2019 పురుషుల సింగిల్స్‌, డబుల్స్ ,మిక్సడ్‌ డబుల్స్ ఈవెంట్‌లలో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం.
  • ఆస్ట్రేలియా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో బంగారు, వెండి పతకాలు.
  • ఆసియా పారా గేమ్స్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్స్‌లో బంగారు, కాంస్య పతకాలు
  • 2009 ఆసియా పారా గేమ్స్ సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో రజతం, బంగారు పతకాలు.
  • రైల ఇంటర్నేషనల్ ఛాలెంజర్ టోర్నమెంట్ 2007లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు

పురస్కారాలు

మార్చు
  • 2019- అర్జున అవార్డు [6]
  • 2019 - బిజూ పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు - ఒడిశా ప్రభుత్వం
  • 2021 - మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న [7]
  • 2022- పద్మశ్రీ పురస్కారం [8]

మూలాలు

మార్చు
  1. https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1758976
  2. Sakshi (4 September 2021). "చరిత్ర సృష్టించిన ప్రమోద్‌ భగత్‌.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  3. News18 Telugu (4 September 2021). "Paralympics 2020 : సాహో ప్రమోద్ భగత్.. భారత్ కు నాలుగో గోల్డ్ మెడల్." Archived from the original on 5 సెప్టెంబరు 2021. Retrieved 5 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Tokyo Paralympics: Polio-stricken Pramod Bhagat picked badminton to live his dream | Tokyo Paralympics News - Times of India". The Times of India. 5 September 2021.
  5. Sakshi (4 September 2021). "ప్రమోద్‌ భగత్‌ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  6. The New Indian Express (18 August 2019). "Pramod Bhagat becomes Odisha's eighth Arjuna awardee". Archived from the original on 5 September 2021. Retrieved 5 September 2021.
  7. Andrajyothy (14 November 2021). "'ఖేల్‌రత్న'లు నీరజ్‌, మిథాలీ". Archived from the original on 14 నవంబరు 2021. Retrieved 14 November 2021.
  8. Jan 25, Subrat Mohanty / TNN / Updated:; 2022; Ist, 22:16. "Padma Shri for para shuttler Pramod Bhagat | Badminton News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)