హాజీపూర్
హాజీపూర్ బీహార్ రాష్ట్రం, వైశాలి జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం.[7] ఇది తిర్హుత్ డివిజనులో భాగం.[8] జనాభా పరంగా హాజీపూర్, బీహార్ రాష్ట్రం లోని పట్టణాల్లో 17 వ స్థానంలో ఉంది. పాట్నా తరువాత రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో రెండవ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 1.47 లక్షలు. అభివృద్ధి పరంగా బీహార్‌లోని 38 జిల్లాల్లో, వైశాలి జిల్లా [9] 8 వ స్థానంలో ఉంది.[10]
హాజీపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°41′N 85°13′E / 25.68°N 85.22°E | |
రాష్ట్రం | బీహార్ |
ప్రాంతం | మిథిల |
డివిజను | తిర్హుత్ |
జిల్లా | వైశాలి |
స్థాపన | సా.శ. 1350 |
Named for | హాజీ ఇల్యాస్ షా |
విస్తీర్ణం (2011)[1] | |
• Total | 19.64 కి.మీ2 (7.58 చ. మై) |
Elevation | 46 మీ (151 అ.) |
జనాభా | |
• Total | 1,47,126 |
• జనసాంద్రత | 7,500/కి.మీ2 (19,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ[5] |
Time zone | UTC+5:30 (IST) |
Pincode(s) | 84410X |
టెలిఫోన్ కోడ్ | +91–6224 |
Vehicle registration | BR-31 |
అక్షరాస్యత (2011) | 79.26% |
లింగ నిష్పత్తి[6] | 1.0892 ♂/♀ |
Website |
హాజీపూర్ పట్టణం అరటి పంటకు ప్రసిద్ది చెందింది.[11] ఇది బీహార్ రాజధాని పాట్నా నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఇది, పాట్నా ప్రాంతాభివృద్ధి సంస్థ ప్రాంతంలో భాగం.[12][13] ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెనలలో ఒకటైన మహాత్మా గాంధీ సేతు (5.75 కి.మీ.) హాజీపూర్‌ను పాట్నాకు కలుపుతుంది.[14][15] గంగా నది ఈ రెండు పట్టణాలను వేరు చేస్తోంది. గంగానది దక్షిణపు ఒడ్డున పాట్నా నగరం, ఉత్తరపు ఒడ్డున హాజీపూర్ పట్టణం ఉన్నాయి. దిఘా పూల్ అనే మరొక వంతెన కూడా ఉంది పాట్నాను గ్రేటర్ పాట్నాగా విస్తరించే ప్రణాళిక ప్రకారం హాజీపూర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర పట్టణాలను పాట్నాలో కలిపే అవకాశం ఉంది.[16]
హాజీపూర్ పట్టణం 19.64 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. పట్టణాన్ని 39 వార్డులుగా విభజించారు.[17] 1979 లో, బీహార్‌లోని ఆర్కియాలజీ, మ్యూజియం డైరెక్టరేట్ సంస్థ హాజిపూర్‌లో ఒక మ్యూజియంను స్థాపించింది.[18]
భౌగోళికం, వాతావరణం
మార్చుభౌగోళికం
మార్చు1972 అక్టోబరు 12 న ముజఫర్‌పూర్ జిల్లా నుండి విడిపోయిన తరువాత హాజీపూర్, వైశాలి జిల్లాకు ముఖ్యపట్టణమైంది. ఇది 25°41′N 85°13′E / 25.68°N 85.22°E నిర్దేశాంకాల వద్ద ,[19] సముద్ర మట్టం నుండి 46 మీటర్ల ఎత్తున ఉంది.
హాజీపూర్ పట్టణానికి పశ్చిమాన నారాయణి గండక్ నది, దక్షిణాన పవిత్ర గంగా నది ప్రవహిస్తున్నాయి. పట్టణంలో రైలు, రోడ్డు, జల రవాణా సౌకర్యాలున్నాయి. వీటిద్వారా పట్టణానికి జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రం,, దేశం లోని ఇఅతర ప్రాంతాలతో చక్కటి రవాణా సౌకర్యాలున్నాయి. గంగా నది మీదుగా నిర్మించిన మహాత్మా గాంధీ సేతు (5,575 మీటర్ల పొడవు) పట్టణాన్ని రాష్ట్ర రాజధాని పాట్నాతో కలుపుతుంది,[20] గండక్ మీదుగా మరో రైలు, రోడ్డు వంతెన సోనేపూర్‌తో కలుపుతుంది.
శీతోష్ణస్థితి
మార్చుపట్టణం లోను, దాని చుట్టుపక్కలా ఉన్న లోని మైదాన ప్రాంతం అరటి, లిట్చి, మామిడి తోటలకు ప్రసిద్ధి చెందింది. సెమీ ట్రాపికల్ రుతుపవన వాతావరణంలో పెరుగుతున్న మొక్కలతో, చెట్లతో ఈ ప్రాంతం పచ్చగా కనిపిస్తుంది. మే-జూన్ నెలలు వేడిగా ఉంటాయి. డిసెంబర్-జనవరి చల్లగా ఉంటాయి.[21]
హాజీపూర్‌లో వాతావరణం వెచ్చగా, సమశీతోష్ణంగా ఉంటుంది. దీన్ని Csa గా కొప్పెన్, గీగర్ వర్గీకరించారు. ఇక్కడ ఉష్ణోగ్రత సగటు 25.8 °C. సగటు వార్షిక వర్షపాతం 993 మి.మీ. ఉంటుంది. 3 మి.మీ. వర్షపాతంతో డిసెంబరు అత్యంత పొడిగా ఉండే నెల. అత్యధిక వర్షపాతం ఉండే జూలై నెలలో 266 మి.మీ. వర్షపాతం ఉంటుంది. సంవత్సరంలో వెచ్చని నెల మే, సగటు ఉష్ణోగ్రత 32.2 °C. జనవరిలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 17.1 °C.[22]
శీతోష్ణస్థితి డేటా - Hajipur | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
Source: Climate table (average high and low) and average precipitation[23] |
జనాభా
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 21,398 | — |
1911 | 19,233 | −10.1% |
1921 | 16,760 | −12.9% |
1931 | 19,299 | +15.1% |
1941 | 21,963 | +13.8% |
1951 | 25,149 | +14.5% |
1961 | 34,044 | +35.4% |
1971 | 41,890 | +23.0% |
1981 | 62,520 | +49.2% |
1991 | 87,687 | +40.3% |
2001 | 1,19,412 | +36.2% |
2011 | 1,47,688 | +23.7% |
సాంస్కృతికంగా, భాషాపరంగా, హాజీపూర్ పాట్నా మాదిరిగానే ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం హాజీపూర్ పట్టణంలో 1,47,688 జనాభా ఉంది, వీరిలో పురుషులు 78,047, మహిళలు 69,641. అక్షరాస్యత 76.80%. ఇది జాతీయ సగటు 74.04% కన్నా ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 82.45%, స్త్రీ అక్షరాస్యత 70.47%. హాజీపూర్‌లో, జనాభాలో 14.15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. లింగ నిష్పత్తి 892 . ఇది జాతీయ సగటు 944 కంటే తక్కువ. పట్టణం లోని ప్రధాన భాష హిందీ.[24][25]
పట్టణ ప్రముఖులు
మార్చు- వర్ధమాన మహావీరుడు
- రామ్ విలాస్ పాస్వాన్ (రాజకీయవేత్త)
- బిందేశ్వర్ పాథక్ (సులభ్ ఇంటర్నేషనల్)
రవాణా
మార్చుహాజీపూర్ పట్టణంలో భారత రైల్వేలకు చెందిన తూర్పు సెంట్రల్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది.[26]
హాజిపూర్ రైల్వే స్టేషన్ గుండా మూడు రైలు మార్గాలు పోతున్నాయి. ఇవి పట్టణాన్ని ముజఫర్‌పూర్, ఛప్రా, బరౌనిలతో కలుపుతాయి. గౌహతి రాజధాని ఎక్స్‌ప్రెస్ (20503/20504), వైశాలి ఎక్స్‌ప్రెస్ (12553/12554), బీహార్ సంపార్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12565/12566), గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (12203/12204), స్వతంత్ర సైనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (1256) లోహిత్ ఎక్స్‌ప్రెస్ (15651/15652), లిచ్చావి ఎక్స్‌ప్రెస్ (14005/14006), అరుణాచల్ ఎక్స్‌ప్రెస్ (22411/22412) రైళ్ళు ఈ మార్గం గుండా వెళ్తాయి.[27]
- ఈ పట్టణానికి ప్రధానంగా లోక్ నాయక్ జయప్రకాష్ విమానాశ్రయం, పాట్నా (PAT) సేవలు అందిస్తోంది.
రోడ్లు
మార్చుజాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా హాజీపూర్ భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. పట్టణం గుండా వెళ్ళే ప్రధాన రహదారులు:
- నుజాతీయ రహదారి 19 [28] పట్టణాన్ని ఛప్రాతో కలుపుతుంది, ఇది యుపిలోని ఘాజిపూర్ పట్టణం వరకూ పోతుంది. జాతీయ రహదారి 19 పాట్నా నుండి మొదలై గయా, బోధగయల రాష్ట్ర రహదారి ద్వారా కలుపుతుంది.[29]
- జాతీయ రహదారి 77 ముజఫర్పూర్, సీతామఢీ ల ద్వారా సోన్‌బర్సా (నేపాల్ సరిహద్దు) హాజీపూర్ లను కలుపుతుంది
- కచ్చి దర్గా-బిదుపూర్ వంతెన బీహార్ లోని పెద్ద ప్రాజెక్టు. ఈ వంతెన రెండు ప్రధాన జాతీయ రహదార్లు 103, 30 లను కలుపుతుంది.[30] ఈ వంతెన పూర్తయిన తర్వాత భారతదేశంలో అతి పొడవైన వంతెన అవుతుంది.[31]
- జాతీయ రహదారి 103 హాజీపూర్ నుండి ప్రారంభమై, జందాహా ద్వారా ముస్రీ ఘరారీ (సమస్తిపూర్) వద్ద జాతీయ రహదారి 28A లో కలుస్తుంది.
- రాష్ట్ర రహదారి 74 హాజీపూర్‌ను వైశాలిలోని లాల్‌గంజ్‌తో కలుపుతుంది.
- రాష్ట్ర రహదారి 49 హాజీపూర్‌ను మహువా, తాజ్‌పూర్, సమస్తిపూర్‌తో కలుపుతుంది.
- రాష్ట్ర రహదారి 93 హాజీపూర్‌ను మోహీదున్ పట్టణ్‌లోని మహ్నార్‌తో కలుపుతుంది.
మూలాలు
మార్చు- ↑ Total area of Hajipur including urban and rural as on (2001) Page-24 PDF censusindia.gov.in access date-2011
- ↑ Elevation details of Hajipur city Archived 2015-12-01 at Archive.today hajipuronline.in
- ↑ "Hajipur City Population Census 2011 | Bihar". www.census2011.co.in. Retrieved 2017-12-23.
- ↑ Population details of Hajipur including urban and rural Page-24 PDF censusindia access date-2011
- ↑ Hindi is official language of Hajipur Archived 2015-12-01 at Archive.today hajipuronline.in
- ↑ Human sex ratio of Hajipur census2011.co.in access date- 2011
- ↑ International Alphabet of Sanskrit Transliteration (Hajipur) maps-street view.com
- ↑ Tirhut Division Official website Archived 2015-03-16 at the Wayback Machine tirhut-muzaffarpur.bih.nic.in
- ↑ Vaishali district is also known as Hajipur district Archived 2015-01-07 at the Wayback Machine gov.bih.nic.in
- ↑ District rank in Bihar in terms of growth Archived 2016-04-03 at the Wayback Machine business-standard.com
- ↑ Hajipur- City of Banana timesofindia.com Retrieved-(2001-11-20)
- ↑ "CDP Patna" (PDF). Infrastructure Professionals Enterprise (P) Ltd., C - 2, Green Park Extension, New Delhi – 110016, INDIA. PATNA — Urban Development Department. July 2006. pp. 20, 21 (area) 52 (metropolis), 31 (geography). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 13 April 2014.
- ↑ "Growth goes west, south & green Master plan to add more areas". The Telegraph (Calcutta). 13 February 2014. Retrieved 19 May 2015.
- ↑ https://economictimes.indiatimes.com/slideshows/infrastructure/nine-exemplary-bridges-in-india/mahatma-gandhi-setu/slideshow/25751932.cms
- ↑ "Longest River Bridge in India — Mahatma Gandhi Setu — Longest River Bridge in World". Thecolorsofindia.com. Retrieved 4 March 2012.
- ↑ Connectivity with Patna & details about the longest river bridge in India. hajipuronline.in.
- ↑ detail about number of wards in Hajipur census2011.co.in
- ↑ "Deep Narayan Singh Museum, Hajipur". Archived from the original on 15 ఫిబ్రవరి 2015. Retrieved 14 May 2015. yac.bih.nic.in.
- ↑ Falling Rain Genomics, Inc - Hajipur
- ↑ Gammon India Limited. Archived 17 ఫిబ్రవరి 2011 at the Wayback Machine
- ↑ Climate, region and plantation details of Hajipur Archived 2015-09-19 at the Wayback Machine ecourts.gov.in
- ↑ Details about the climate, temperature, rainfall, annual averages and precipitation of Hajipur en.climate-data.org
- ↑ "Monthly mean maximum & minimum temperature data, averages and precipitation for climate variables for Hajipur". climate-data.org.
- ↑ 168 Hajipur census2011.co.in
- ↑ "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-04-16.
- ↑ "Official Website of Sonpur Division of East Central Railway". Government of India. Archived from the original on 6 May 2012. Retrieved 27 April 2012.
- ↑ official Rail Info and list of train stoppages in Hajipur junction indiarailinfo.com
- ↑ "National Highway 19". Mapsofindia.com. Retrieved 1 February 2010.
- ↑ CDP-Hajipur Archived 2016-03-04 at the Wayback Machine PDF
- ↑ "Nitish blasts Centre over roads". The Telegraph. 5 April 2015. Retrieved 25 July 2015.
- ↑ "Cabinet OKs new bridge on Ganga". The Times of India. 17 July 2015. Retrieved 25 July 2015.