ప్రసాదమూర్తి ముదనూరి

ప్రసాదమూర్తి ముదనూరి ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, నిర్వాహకుడు. నాటకాన్ని కేవలం పరిషత్తుల ప్రదర్శనకే పరిమితం చేయకుండా, నాటక ప్రదర్శనలో సాంకేతిక విలువలు పెంచి, తెలుగు నాటకం జాతీయ స్థాయిలో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి పునాదులు వేయాలకున్నాడు.

ప్రసాదమూర్తి ముదనూరి
జననం(1955-01-14)1955 జనవరి 14
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, నిర్వాహకుడు
తల్లిదండ్రులుముదనూరి రామన్న, రత్నమ్మ

జననం మార్చు

ప్రసాదమూర్తి 1955, జనవరి 14 న ముదనూరి రామన్న, రత్నమ్మ దంపతులకు పశ్చిమగోదావరి జిల్లా లోని కాశిపాడులో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి స్థిరనివాసం ఏర్పరచుకొన్నాడు.

నాటకరంగ ప్రస్థానం మార్చు

1972లో వరుడుకావాలి నాటికతో ప్రసాదమూర్తి నాటకరంగ ప్రస్థానం మొదలైంది. నటుడుగా, దర్శకుడుగా, ప్రయోక్తగా, నిర్వాహకుడుగా ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఎన్నెన్నో ఆణిముత్యాల్లాంటి నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. వద్దంటే పెళ్ళి (2009) ఆయన చివరి నాటిక.

తెలుగు నాటకరంగంలోని అన్ని పరిషత్తుల్లోనూ ప్రసాదమూర్తి నాటకం వేశాడు. 1973లో కళావాణి అనే సంస్ధ పెట్టి ఉభయగోదావరి జిల్లా అంతా నాటకాలు ప్రదర్శించాడు. నంది నాటక పరిషత్తులో అనేకసార్లు నందులు, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందుకున్నాడు. రాజమండ్రి కేంద్రంగా చేసుకొని మూడు దశాబ్దాలపాటు నాటకరంగానికి సేవలు అందించాడు.[1]

నాటికలు - నాటకాలు మార్చు

  1. సద్గతి
  2. వైతాళికుడు
  3. తెలుగు వెలుగులు
  4. ఏ వెలుగులకీ ప్రస్థానం
  5. అమరజీవి
  6. అలరాసపుట్టిల్లు
  7. మహాత్మా జ్యోతిరావు పూలే
  8. అగ్నిపుష్పం
  9. శ్వేతపత్రం
  10. భయం
  11. తెల్లకాగితం
  12. మిధునం
  13. నరకంమరెక్కడోలేదు
  14. ఎవరికోసం
  15. చివరకు మిగిలింది
  16. అహంబ్రహ్మస్మి
  17. అప్పాజీ

మొదలగునవి ఆయన నటనా ప్రతిభకు, దర్శకత్వ నిపుణతకు ప్రతిబింబాలు.

మరణం మార్చు

ప్రసాదమూర్తి 2009, ఆగష్టు 5న (మరో రెండు రోజుల్లో, అంటే ఆగస్టు 7న తన పుత్రుని వివాహం జరుగవలసి వుంది) గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.

మూలాలు మార్చు

  1. Ramarao Peddi Essays & more. "ప్రసాదమూర్తికి నివాళి". ramaraopeddi.blogspot.in/. Archived from the original on 1 ఆగస్టు 2017. Retrieved 5 August 2017.