నంది నాటక పరిషత్తు

నంది నాటక పరిషత్తు 1998 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది. నంది నాటకోత్సవం పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ప్రతి సంవత్సరం నంది నాటకోత్సవాల్ని నిర్వహిస్తుంది.[1] రాష్ట్ర వ్యాప్తంగా సమాజాల నుండి ఎంట్రీలను స్వీకరించి ప్రాథమిక న్యాయ నిర్ణేతల ద్వారా స్క్రూటినీలు చూసి తుదిపోటీలకు 10 పద్యనాటకాలు, 10 సాంఘిక నాటకాలు, 12 సాంఘిక నాటికలు, 12 బాలల నాటికలను ఎంపిక చేస్తారు. వీటినుండి ఉత్తమ ప్రదర్శనకు - బంగారు నంది, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు - రజత నంది బహుమతులతో పాటుగా నగదు పురస్కారం కూడా ఇస్తారు.[2][3]

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం మార్చు

నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు. ఇంతవరకు ఈ పురస్కారాన్ని పొందినవారు:

 1. 1998: అబ్బూరి కమలాదేవి - పద్యనాటకం.
 2. 1999: వేమూరి రామయ్య - పద్యనాటకం.
 3. 2000: జోలేపాళెం సిద్ధప్పనాయుడు - చారిత్రక, పద్యనాటకం.
 4. 2001: ఆచంట వెంకటరత్నం నాయుడు - పద్యనాటకం.
 5. 2002: పృథ్వీ వెంకటేశ్వరరావు - పద్యనాటకం.
 6. 2003: ఆర్.వి.చలం - సాంఘిక నాటకం.
 7. 2004: తెలుగు కనకం - పద్యనాటకం.
 8. 2005: దుగ్గిరాల సోమేశ్వరరావు - సాంఘిక నాటకం.
 9. 2006: బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి - పద్యనాటకం.
 10. 2007: భాను ప్రకాష్ - సాంఘిక నాటకం.
 11. 2008: లొద్దిపల్లి అల్లాబకష్ మొల్ల - పద్యనాటకం.
 12. 2009: చాట్ల శ్రీరాములు - సాంఘిక నాటకం.
 13. 2010: జి.ఎస్.ఎన్. శాస్త్రి - పద్యనాటకం.
 14. 2011: కె.ఎస్.టి. శాయి - పద్యనాటకం.
 15. 2012: మొదలి నాగభూషణ శర్మ - సాంఘిక నాటకం.
 16. 2013: పేపకాయల లక్ష్మణరావు - పౌరాణిక నాటకం.
 17. 2014: నల్లూరి వెంకటేశ్వర్లు- సాంఘిక నాటకం.[4]
 18. 2015: జె. వి. రమణమూర్తి- సాంఘిక నాటకం.
 19. 2016: గుమ్మడి గోపాలకృష్ణ- పద్య నాటకం.
 20. 2017: పాటిబండ్ల ఆనందరావు - సాంఘీక నాటకం
 21. 2022: డా. మీగడ రామలింగస్వామి - పద్య నాటకం

కందుకూరి పురస్కారం మార్చు

రంగస్థలం లో కొన్నేళ్లుగా మంచి ప్రతిభ కనబరుస్తూ నాటకరంగ అభివృద్ధికి కృషిచేసిన వారిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయా నాటకరంగ కళాకారులకు కందుకూరి వీరేశలింగం పేరు మీదుగా విశిష్ట పురస్కారం అందజేస్తుంది.

 1. కందుకూరి పురస్కారం - 2017

ఇంతవరకు జరిగిన నాటకోత్సవాలు మార్చు

1998 మార్చు

1998 - రవీంద్ర భారతి, హైదరాబాదులో 1999 మే 23 నుండి 31 వరకు జరిగాయి.
ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

 • పద్యనాటకాలు - 1. శ్రీ శ్రీనివాస కళాభారతి నృత్య కళాశాల, తిరుపతి వారి 'శ్రీ శ్రీనివాస కళ్యాణం ' 2. శ్రీ సాయి విజయ నాట్యమండలి (సురభి ) హైదరాబాద్ వారి -'శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం.
 • సాంఘిక నాటకాలు - 1. బహురూప నట సమాఖ్య, విశాఖపట్నం వారి 'కించిత్ భోగం ' 2. భూమిక, హైదరాబాద్ వారి 'చరణ దాసు '
 • సాంఘిక నాటికలు - 1. గంగోత్రి, పెదకాకాని వారి ' హింసధ్వని ' 2. గురజాడ కళామందిర్, విజయవాడ వారి ' మనుధర్మం '

1999 మార్చు

 • 1999- రవీంద్ర భారతి, హైదరాబాద్ 2000 మే 22 నుండి 28 వరకు జరిగాయి.

ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

 • పద్యనాటకాలు - 1. శ్రీ సత్యసాయి కళానికేతన్, హైదరాబాద్ వారి 'శ్రీ కృష్ణతులాభారం' 2. సవేరా ఆర్ట్స్ కడప వారి -'శ్రీ రామ వనవాసం'.
 • సాంఘిక నాటకాలు - 1. గంగోత్రి, పెదకాకాని వారి 'వానప్రస్థం' 2. బహురూప నట సమాఖ్య, విశాఖపట్నం వారి ' కలల రాజ్యం'
 • సాంఘిక నాటికలు - 1. సంగం డైరీ క్రియేషన్స్, వడ్లమూడి వారి ' ' 2. ఎల్.వీ.ఆర్. క్రియేషన్స్, గుంటూరు వారి 'జారుడు మెట్లు'

2000 మార్చు

 • 2000- రవీంద్ర భారతి, హైదరాబాద్; 2001 మే 28 నుండి జూన్ 4 వరకు జరిగాయి.

ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

 • పద్యనాటకాలు - 1. సంస్కార భారతి, హైదరాబాద్ వారి 'మహాకవి కాళిదాసు' 2. విజయలక్ష్మీ శ్రీనివాస నాట్యమండలి, తెనాలి వారి -'తిరుపతమ్మ కథ' .
 • సాంఘిక నాటకాలు - 1. వంశీ నిరంజన్ కళాకేంద్రం, హైదరాబాద్ వారి 'ప్రతిస్పందన' 2. కళాదర్శిని, విజయవాడ వారి 'ప్రేమ సామ్రాజ్యం'
 • సాంఘిక నాటికలు - 1. ఎల్.వీ.ఆర్ క్రియేషన్స్, గుంటూరు వారి 'మేలుకొలుపు' 2. సాగరి, చిలకలూరిపేట వారి 'వఱడు'

2001 మార్చు

 • 2001- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2002 మే 28 నుండి జూన్ 3 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

పద్యనాటకాలు - 1. శ్రీ మీరా కళాజ్యోత్స్న, విశాఖపట్నం వారి 'అశ్వత్థామ' 2. విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి 'శ్రీనాథుడు'. సాంఘిక నాటకాలు - 1. కళావాణి, ఉభయగోదావరులు వారి 'అమరజీవి' 2. రమణీయ రంగం, హైదరాబాద్ వారి 'గాంధీ జయంతి' సాంఘిక నాటికలు - 1. శ్రీ సద్గురు కళానిలయం, గుంటూరు వారి 'బహురూపి' 2. అభ్యుదయ కళాసమితి, ఒంగోలు వారి 'పోనీ పోనీ పోతే పోనీ'

2002 మార్చు

 • 2002- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2003 మే 28 నుండి జూన్ 6 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

పద్యనాటకాలు - 1. కళాతరంగిణి, విశాఖపట్నం వారి ' శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం ' 2. శ్రీ మీరా కళాజ్యోత్స్న, విశాఖపట్నం వారి -' గుణనిధి ' . సాంఘిక నాటకాలు - 1. విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' ఇదిగో దేవుడు చేసిన బొమ్మ ' 2. కళారాధన, హైదరాబాద్ వారి ' జీవన్నాటకం ' సాంఘిక నాటికలు - 1. ఎస్.ఎన్.ఎం.క్రియేషన్స్ క్లబ్, వరంగల్ వారి ' మూడోపాదం ' 2. రసఝరి, పొన్నూరు వారి ' సంపద '

2003 మార్చు

 • 2003- రవీంద్ర భారతి, హైదరాబాద్ ; 2004 జూన్ 19 నుండి జూన్ 26 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

పద్యనాటకాలు - 1. శ్రీ మీరా కళాజ్యోత్స్న, విశాఖపట్నం వారి -' చిరుతొండ నంబి ' 2. యువకళావాహిని, హైదరాబాద్ వారి -' రాణాప్రతాప్ ' . సాంఘిక నాటకాలు - 1. కళాలయ, కొలకలూరు వారి ' ఎక్కడ ఉన్నా ఏమైనా ' 2. అమృత వర్షిణి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' టామీ ' సాంఘిక నాటికలు - 1. స్వర్ణభారతి కల్చరల్ క్లబ్, గుంటూరు వారి ' ఆశల "పల్లె "కి ' 2. కళాప్రియ రాజమండ్రి వారి ' ఆల్బం '

2004 మార్చు

 • 2004- తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ ; 2005 జనవరి 16 నుండి 23 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

పద్యనాటకాలు - 1. సురభిళ కళానాట్యమండలి, హైదరాబాద్ వారి ' శశిరేఖాపరిణయం ' 2. శ్రీ విజేత ఆర్ట్స్, రాజం పేట వారి ' భూయో భూయో నమామ్యహం ' . సాంఘిక నాటకాలు - 1. బహురూప నట సమాఖ్య, విశాఖపట్నం వారి ' ఎలా బతకాలి ' 2. మంజు ఆర్ట్ థియేటర్స్, వరంగల్ వారి ' ఓం ' సాంఘిక నాటికలు - 1. గంగోత్రి, పెదకాకాని వారి ' ఆంబోతు' 2. భాగ్యశ్రీ ఫైనార్ట్స్ కల్చరల్ అసోసియేషన్, విశాఖపట్నం వారి ' మానవత్వానికి మరో కోణం'

2005 మార్చు

 • 2005- మహతి కళాక్షేత్రం , తిరుపతి ; 2006 జనవరి 16 నుండి 23 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

పద్యనాటకాలు - 1. గంగోత్రి, పెదకాకాని వారి ' పల్నాటి భారతం ' 2. సవేరా ఆర్ట్స్, కడప వారి ' వాసవీ కన్యక ' . సాంఘిక నాటకాలు - 1. వి.టి.పి.ఎస్.కల్చరల్ అసోసియేషన్, విశాఖపట్నం వారి ' పరమాత్మా వ్యవస్థిత ' 2. వంశీ నిరంజన్ కళాక్షేత్రం, హైదరాబాద్ వారి ' నిశ్శబ్దం ' సాంఘిక నాటికలు - 1. వంశీ నిరంజన్ కళాక్షేత్రం, హైదరాబాద్ వారి ' నకు దీర్ఘమిస్తే ' 2. కళాభారతి, తిరుమాలి, కాకినాడ వారి ' మృగం '

2006 మార్చు

 • 2006- రాజీవ్ గాంధీ ఆడిటోరియం, నిజామాబాద్ ; 2007 జనవరి 18 నుండి 24 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

పద్యనాటకాలు - 1. సవేరా ఆర్ట్స్, కడప వారి ' సతీ అహల్య ' 2. శ్రీ పూర్ణశ్రీ నాట్య కళా సమితి, తెనాలి వారి ' శ్రీ వేమన యోగి ' . సాంఘిక నాటకాలు - 1. ఫరెవర్ ఆర్ట్ థియేటర్స్, సూర్యాపేట వారి ' శాపగ్రస్తులు ' 2. ప్రగతి నగర్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' రాచపుండు ' సాంఘిక నాటికలు - 1. రంగయాత్ర, గుంటూరు వారి ' సత్యాగ్రహి ' 2. క్రియేటర్స్, పాలకొల్లు వారి ' తల్లీ క్షమించు '

2007 మార్చు

 • 2007- ఆనం కళాక్షేత్రం, రాజమండ్రి ; 2008 జనవరి 18 నుండి 24 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

పద్యనాటకాలు - 1. కల్చరల్ అసోసియేషన్, కాకినాడ వారి ' భక్త పోతన ' 2. పల్లవి ఆర్ట్స్ ప్రొద్దుటూరు వారి ' భీష్మ ' . సాంఘిక నాటకాలు - 1. వంశీ నిరంజన్ కళాక్షేత్రం, హైదరాబాద్ వారి ' పునాది ' 2. ఆర్ట్స్ కో, హైదరాబాద్ వారి ' మృతసంజీవని ' సాంఘిక నాటికలు - 1. అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ' ధ్వంస రచన ' 2. మయూరి ఆర్ట్ క్రియేషన్స్, వరంగల్లు వారి ' రెండో భర్త '

2008 మార్చు

 • 2008- ఆనం కళా కళాకేంద్రం, నెల్లూరు ; 2009 జనవరి 18 నుండి 24 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

పద్యనాటకాలు - 1. డా.రామన్ ఫౌండేషన్ సాయిబాబా నాట్యమండలి, విజయవాడ వారి ' ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం -1857 ' 2. ది యంగ్ మెన్స్ హాపీ క్లబ్, కాకినాడ వారి ' అల్లసాని పెద్దన ' . సాంఘిక నాటకాలు - 1. సుచరిత ఆర్ట్స్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' బొమ్మలు చెప్పిన భజగోవిందం ' 2. న్యూ స్టార్స్ మాడరన్ థియేటర్స్, విజయవాడ వారి ' జజ్జనకరి జనారే...జనకు జనకు జనారే ' సాంఘిక నాటికలు - 1. హేలాపురి కల్చరల్ అసోసియేషన్, ఏలూరు వారి ' ఎవరో ఒకరు ' 2. విశ్వ శాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' తలుపు '

2009 మార్చు

 • 2009- భక్త రామదాసు కళాక్షేత్రం, ఖమ్మం ; 2010 జనవరి 30 నుండి ఫిబ్రవరి 7 వరకు జరిగిన ఈ ఉత్సవాలలో బంగారు, వెండి నంది బహుమతుల వివరాలు.

పద్యనాటకాలు - 1. వివేకానందనగర్ కాలనీ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ' విప్రనారాయణ ' 2. డా.రామన్ ఫౌండేషన్ సాయిబాబా నాట్యమండలి, విజయవాడ వారి ' శ్రీ ఖడ్గ తిక్కన ' సాంఘిక నాటకాలు - 1. హేలాపురి కల్చరల్ అసోసియేషన్, ఏలూరు వారి ' సై..సై...జోడెడ్ల బండి ' 2. కళారాధన, నంద్యాల వారి ' ఇక్కడ కాసేపు ఆగుదాం ' సాంఘిక నాటికలు - 1.అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ' అరవై దాటాయి ఎందుకు ' 2. ఫరెవర్ ఆర్ట్ థియేటర్, సూర్యాపేట వారి ' గాయత్రి డాటర్ ఆఫ్ బషీర్ అహ్మద్ ' బాలల నాటికలు - 1. స్వరవర్షిణి ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్ వారి ' బాపు కలలు గన్న దేశం ' 2. ది యంగ్ మెన్స్ హాపీ క్లబ్, కాకినాడ వారి ' విజయ దశిమి '

2013 మార్చు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కారణంగా 2013 నంది నాటక పరిషత్తును నిర్వహించడంలో ఆలస్యం జరిగింది. దాంతో 2013, 2014 సంవత్సరాల నంది నాటకోత్సవాలను ఒకేసారి నిర్వహించారు. 2015 మే 16 నుండి 30 వరకి, రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో నంది నాటక పరిషత్తు - 2013 జరిగింది. 15 రోజుల పాటు జరిగిన నాటకోత్సవంలో ఒకరోజు 2013 నాటక ప్రదర్శనలు, మరోరోజు 2014 నాటక ప్రదర్శనలు జరిగాయి. విజేతలకు జూన్ 1న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.[4]

2014 మార్చు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కారణంగా 2014 నంది నాటక పరిషత్తును నిర్వహించడంలో ఆలస్యం జరిగింది. దాంతో 2013, 2014 సంవత్సరాల నంది నాటకోత్సవాలను ఒకేసారి నిర్వహించారు. 2015 మే 16 నుండి 30 వరకి, రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో నంది నాటక పరిషత్తు - 2014 జరిగింది. 15 రోజుల పాటు జరిగిన నాటకోత్సవంలో ఒకరోజు 2013 నాటక ప్రదర్శనలు, మరోరోజు 2014 నాటక ప్రదర్శనలు జరిగాయి. విజేతలకు జూన్ 1న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.[4]

2015 మార్చు

2016 జనవరి 18 నుండి 27 వరకి, తిరుపతి లోని మహతి ఆడిటోరియంలో నంది నాటక పరిషత్తు - 2015 జరిగింది. 15 రోజుల పాటు జరిగిన నాటకోత్సవంలో నాటక ప్రదర్శనలు జరిగాయి. విజేతలకు జనవరి 27న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.

2016 మార్చు

2016 నంది నాటకోత్సవంలో కొత్త మార్పులు వచ్చాయి. గతంలో మాదిరిగా ప్రాథమిక పరిశీలన లేకుండా, దరఖాస్తుచేసిన నాటక సమాజాలన్నీంటికి ప్రదర్శన అవకాశం, ప్రదర్శన పారితోషకం ఇచ్చారు. అంతేకాకుండా, ఈ నంది నాటకోత్సవాన్ని ఒకేసారి మూడు వేరువేరు ప్రాంతాలు (గుంటూరు, కర్నూలు, విజయనగరం)లో నిర్వహించారు.[5] జనవరి 18న ప్రారంభమైన ఈ నాటకోత్సవాలు ఫిబ్రవరి 15న ముగిసాయి.[6][7]

2017 మార్చు

2017 నంది నాటకోత్సవం ఐదు వేరువేరు ప్రాంతాలు (తెనాలి, కాకినాడ, రాజమహేంద్రవరం, కర్నూలు, నంద్యాల) లో నిర్వహించారు.[8]

2022 మార్చు

2022 నంది నాటకోత్సవానికి సంబంధించి 2023 జూలై 5వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. 5 విభాగాల్లో మొత్తం 115 ఎంట్రీలు వచ్చాయి. తుదిపోటీలకు 10 పద్యనాటకాలు, 6 సాంఘీక నాటకాలు, 12 సాంఘీక నాటికలు, 5 బాలల నాటికలు, 5 కళాశాల లేదా విశ్వవిద్యాలయ నాటికలను ఎంపిక చేస్తారు. 5 విభాగాల్లో మొత్తం 73 నంది అవార్డులు ఇవ్వనున్నారు.[9]

మూలాలు మార్చు

 1. ఆంధ్రజ్యోతి (20 September 2015). "నంది నాటక పోటీలు మేలుచేస్తున్నాయా?". www.andhrajyothy.com. Archived from the original on 4 November 2020. Retrieved 4 November 2020.
 2. ఆంధ్ర ప్రదేశ్ సామాచార శాఖ. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది నాటక బహుమతులు" (PDF). www.ipr.ap.nic.in. Retrieved 5 April 2018.
 3. "ఆంధ్రప్రదేశ్ నంది నాటకోత్సవాల బహుమతుల వివరాలు (1998-2017)". apsftvtdc.in. Archived from the original on 2021-01-24. Retrieved 2023-07-25.
 4. 4.0 4.1 4.2 ప్రజాశక్తి, జిల్లాలు (16 May 2015). "రంగరంగ వైభవంగా రంగస్థల పండుగ". www.prajasakti.com. Archived from the original on 21 April 2020. Retrieved 21 April 2020.
 5. సాక్షి. "కర్నూలులో నంది నాటకోత్సవాలు". Retrieved 20 July 2017.
 6. ఆంధ్రప్రభ. "అమరావతి: నేటి నుంచి రాష్ట్ర నంది నాటకోత్సవాలు". Retrieved 20 July 2017.[permanent dead link]
 7. తెలుగు వెలుగు, వ్యాసాలు. "'రంగ'రంగ వైభోగంగా నంది వెలుగు". www.teluguvelugu.in. రామకృష్ణ, మల్లికార్జునరావు, శ్రీనివాస్‌. Archived from the original on 16 July 2020. Retrieved 16 July 2020.
 8. The Hindu, Andhra Pradesh (15 March 2018). "Nandi drama fest gets under way". Special Correspondent. Retrieved 7 April 2018.
 9. "పారదర్శకంగా నంది నాటకోత్సవాలు". Sakshi. 2023-09-20. Archived from the original on 2023-09-22. Retrieved 2023-09-22.