ప్రాయశ్చిత్తం 1962, మార్చి 23న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. పాళుం పళముం అనే తమిళ సినిమాకు ఇది తెలుగు తర్జుమా.

ప్రాయశ్చిత్తం
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.భీంసింగ్
తారాగణం శివాజీ గణేశన్,
బి.సరోజాదేవి,
జానకి
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ శరవణా ఫిలింస్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • శివాజీ గణేశన్
 • బి.సరోజాదేవి
 • షావుకారు జానకి
 • ఎం.ఆర్.రాధా
 • టి.ఎస్.బాలయ్య
 • ఎస్.వి.సుబ్బయ్య
 • ఎం.ఎస్.సుందరీబాయి
 • ఎ.కరుణానిధి
 • మనోరమ
 • చిత్తూరు నాగయ్య
 • ప్రేమ్‌ నజీర్
 • కె.డి.సంతానం

సాంకేతికవర్గం మార్చు

 • దర్శకత్వం: ఎ. భీంసింగ్
 • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్, రామమూర్తి, జి.కె.వెంకటేష్
 • పాటలు, మాటలు: అనిసెట్టి
 • కళ: పి.పి.చౌదరి
 • ఛాయాగ్రహణం: జి.విఠల్ రావు

పాటలు[1] మార్చు

 1. ఆకసమందునా సూర్యుడు ఆడెనులే ఆమనికోయిల - పి.సుశీల
 2. కాంతల ఎదల చింతలదీర్చ గగన వీధినే పోదునా - పి.సుశీల
 3. నీ పేరే నా ప్రాణం నీ మాటే వేదం నీతోటే భువిలోన ( సంతోషం ) - పి.సుశీల, ఘంటసాల
 4. నీ పేరే నా ప్రాణం నీ మాటే వేదం నీతోటే భువిలోన (విషాదం) - పి.సుశీల, ఘంటసాల
 5. పోతే పోనీ పోరా ఈ పాపపు జగతి శాశ్వతమెవడురా - ఘంటసాల కోరస్
 6. మధుర ప్రేమను కానుక ఇచ్చి మనసులోన మమతను - ఘంటసాల
 7. నాటి సౌఖ్యమే నేటి భాధలో తీరెనిదేలమ్మా - పి.సుశీల

సంక్షిప్త కథ మార్చు

ఒక ఉదారుని పోషణలో పెద్ద డాక్టరయిన రవి శాంతి అనే నర్సును పెళ్ళి చేసుకుంటాడు. ఆ ఉదారుని కుమార్తె నళిని ఈ రవి కోసం అలాగే వేరే ఉంటుంది. శాంతి సహకారంతో రవి క్యాన్సర్‌కు మందు కనిపెడతాడు. కానీ శాంతికి క్షయ అంకురించి ఇల్లు వెడలిపోతుంది. రైలు ప్రమాదంలో శాంతి మరణించిందని రేడియో వార్త విని రవి కృంగిపోతాడు. నళిని రవికి రెండవ భార్యగా వస్తుంది. కానీ శాంతి స్విట్జర్లాండుకు వెళ్ళి అక్కడ తన వ్యాధి మేలు చేసుకుంటుంది. క్లైమాక్సులో రవికి కళ్ళు పోవడం, శాంతి నర్సుగా రావడంతో ఇద్దరు భార్యలు ఒక డాక్టరుల మానసిక వ్యధగా కథ నడుస్తుంది. రవికి కళ్ళు రావడం, శాంతిని చూసి సంతోషించడం, నళిని చేత రవి విడాకులు పుచ్చుకోవడం, నళిని రెడ్‌క్రాస్‌లో శిక్షణకు జెనీవా వెళ్ళడం, రవి, శాంతి కలిసిపోవడం మిగిలిన కథ[2].

మూలాలు మార్చు

 1. కొల్లూరి భాస్కరరావు. "ప్రాయశ్చిత్తం - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 21 February 2020.
 2. కృష్ణానంద్ (25 March 1962). "ప్రాయశ్చిత్తం". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 21 February 2020.[permanent dead link]