షావుకారు జానకి

సినీ నటి

షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి (జ. 1931 డిసెంబరు 12) అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370 కి పైగా సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు. ఈమె రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ మొదలైన నటుల సరసన కథానాయికగా నటించింది. ఈమె చెల్లెలు కృష్ణకుమారి కూడా సినీ నటి. 2022లో షావుకారు జానకి తమిళనాడు రాష్ట్రం తరపున పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు.[3]

షావుకారు జానకి
Sowcar Janaki.jpg
షావుకారు జానకి
జననం
షావుకారు జానకి

(1931-12-12) 1931 డిసెంబరు 12 (వయస్సు 90)
వృత్తితెలుగు రంగస్థల, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1949–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశంకరమంచి శ్రీనివాసరావు (వివాహం 1947)[1]
సన్మానాలుపద్మశ్రీ[2]

జననంసవరించు

జానకి 1931 సంవత్సరం డిసెంబరు 12న రాజమండ్రిలో జన్మించింది. అక్కడే పెరిగింది.[4] తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు. ఈయన ఇంగ్లండులో మూడేళ్ళపాటు పేపర్ మ్యానుఫాక్చరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివి వచ్చాడు. తల్లి పేరు శచీదేవి. ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది. 15 ఏళ్ళకే పెళ్ళయింది.

రంగస్థల సినిమా ప్రస్థానంసవరించు

అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11 వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం షావుకారు ఈమె ఇంటి పేరైపోయింది. ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది. ఈమె సత్యసాయిబాబా భక్తురాలు.

విజయా ప్రొడక్షన్స్ వారి షావుకారు (1950) ఈమె మొదటి సినిమా. 1949లో రక్షరేఖ అనే సినిమాలో చంద్రికగా నటించింది. తరువాత ఆమె షావుకారు జానకిగా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని - షావుకారు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి.

నటించిన కొన్ని తెలుగు సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Sowcar Janaki Returns". www.indiaglitz.com. Retrieved 23 December 2014.
  2. Andhrajyothy (26 January 2022). "90 ఏళ్ల వయసులో... పద్మశ్రీ". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. Andhrajyothy (26 January 2022). "ఎట్టకేలకు 'పద్మ' జాబితాలో షావుకారు జానకి". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. "'మహానటి' బయోపిక్‌ తీసి ఉండాల్సింది కాదు!". ఈనాడు. 15 May 2019. Archived from the original on 15 May 2019.
  5. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.

ఇతర లింకులుసవరించు