ప్రాసయతి అనగా ,ఏదేని పద్య పాదములో ఉన్న మొదటిదైన యతి అక్షరమును తిరిగి యతిస్థానంలో లోవ్రాయటానికి అవకాశం లేనప్పుడు ప్రాసగా రెండవ స్థానంలో ఉన్న ప్రాసాక్షరాన్ని తిరిగి యతిస్థానానికి ప్రక్కన వ్రాయటం. కొన్ని పద్య రీతులలో యతి నియమము బదులు ప్రాస యతి చెల్లుతుంది. యతిప్రాసలు పద్యానికి అందాన్నిస్తాయి.

నియమముసవరించు

పాదమందలి మొదటి అక్షరమునకు, యతి మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు ప్రాస కుదుర్చుటను ప్రాసయతి అంటారు.[1]

ప్రతి పాదానికి మొదటి అక్షరం యతి అని రెండవ అక్షరం ప్రాస అవుతుంది. అయితె ప్రాసకు ముందున్న అక్షరం హ్రస్వం అయితే ప్రాసయతి స్థానంలో కూడ హ్రస్వమేవాడాలి. అలాగే ప్రాసకు ముందున్న అక్షరం దీర్ఘం అయితే ప్రాసయతి స్థానంలో కూడ దీర్ఘమే వాడాలి. కాని ప్రాస పూర్వాక్షారం హ్రస్వంగాను ప్రాసయతి పూర్వాక్షరం దీర్ఘం గాను ఉండ కూడదు. తేటగీతి, ఆటవెలది, సీసము మొదలగు పద్యములలో “ప్రాసయతి” వాడవచ్చు. ఉదాహరణకు “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.

ఉదాహరణ పద్యంసవరించు

దేవకీ కుమార గోవర్ధనోద్ధార
తోయజాక్ష పాండవేయ పక్ష
ఘనవినీలగాత్ర మునిజన స్తుతి పాత్ర
యదు కులాబ్ది సోమ కదనభీమ

వివరణ: పై పద్యంలో మొదటి పాదంలో "దేవ - గోవ", రెందవ పాదంలో "తోయ - వేయ", మూడవ పాదంలో "ఘన - జన" , నాల్గవ పాదంలో "యదు - కద" గా ప్రాసయతి వాడబడినది.

మూలాలుసవరించు

  1. "యతి-ప్రాస నియమాలు". www.siliconandhra.org. Retrieved 2021-04-22.

బాహ్య లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాసయతి&oldid=3174221" నుండి వెలికితీశారు