డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము (పూర్వం ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయముగా పిలవబడేది) ఆంధ్ర ప్రదేశ్లో 1982లో స్థాపించబడిన సార్వత్రిక విశ్వవిద్యాలయము. దూర విద్యావిధానాన్ని భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే. చదువుకోవాలనే కోరిక వుండి, ఏవైనా కారణాలవల్ల కళాశాలకు వెళ్లలేనివారికి ఉన్నత విద్యావకాశాలను అందించటానికి ఈ విశ్వవిద్యాలయము ప్రారంభించబడింది. దీనికి 218 విద్యాకేంద్రాలు (23 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు, పిజి కేంద్రాలతో) ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాలలో చదువుకొనవచ్చు. కొన్ని కోర్సులు ఇంగ్లీషు మాధ్యమంలోనే ఉన్నాయి. కొన్ని విషయాలు ఉర్దూ మాధ్యమంలో చదువుకొనవచ్చు.

డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము చిహ్నం

కోర్సులు

మార్చు

సర్టిఫికేటు

మార్చు

ఆహారం, శక్తి (Food and nutrition)

అండర్ గ్రాడ్యుయేట్

మార్చు

విజ్ఞాన, వాణిజ్య, సామాజిక, కళల శాఖలలో బిఎ, బికాం, బియస్సి కోర్సులు న్నాయి. వీటి కాల వ్యవధి కనీసంగా 3, గరిష్ఠంగా 9 సంవత్సరాలు. చాలా కోర్సులు తెలుగు మాధ్యమంగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివినవారు నేరుగా ప్రవేశం పొందవచ్చు. సంస్థాగత విద్య లేని వారు, ప్రవేశపరీక్ష రాసి, దానిలో ఉత్తీర్ణులై ప్రవేశం పొందవచ్చు. మొదటి సంవత్సరంలో ఇంగ్లీషు, భాష (తెలుగు/ ఉర్దూ/హిందీ/ వాడుక ఇంగ్లీషు), విజ్ఞానం, సాంకేతికం, సామాజిక శాస్త్రములలో పీఠ విషయాలుంటాయి. రెండవ, మూడవ సంవత్సరాలలో మూడు ( ఆరు విషయాలు) చొప్పున ఐచ్ఛికాంశాలను ఎంచుకోవాలి. కంప్యూటర్ అనువర్తనాలు అనే ఐచ్ఛిక విషయం ఎన్ఐఐటి (NIIT) సహకారంతో అందచేయబడుతున్నది. ఇంకా ఒక సంవత్సరపు లైబ్రరీ, సమాచార శాస్త్రము, పౌర సంబంధాలు కోర్సులున్నాయి.

పిజి డిప్లొమా

మార్చు

మార్కెటింగ్ నిర్వహణ, వ్యాపార అర్థ శాస్త్రం, పరిసరాల విద్య, సమాచార సాధనాలకు రాయటం (తెలుగు), మానవ హక్కులు, స్త్రీ విద్యలో 1 సంవత్సరం కొర్సులున్నాయి.

ఆర్థిక శాస్త్రము, చరిత్ర, రాజకీయ శాస్త్రము, సామాజిక శాస్త్రము, భాషలు, వాణిజ్యం, మానసిక శాస్త్రము, లాంటి వివిధ ముఖ్యాంశాలతో ఎమ్ఎ కోర్సులున్నాయి. గణితం, జీవ శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, జంతు శాస్త్రములలో ఎమ్ఎస్సి కోర్సులున్నాయి. వ్యాపార నిర్వహణ (ఎమ్బిఎ) కోర్సు ఉంది.

పరిశోధన

మార్చు

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా

మార్చు
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు

ఇవీ చూడండి

మార్చు

డా.బాబాసహెబ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అనే పేరుతో గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలోనూ ఒక విశ్వవిద్యాలయం గలదు. లింకు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, అహ్మదాబాద్, గుజరాత్.

ఐఎస్ఓ గుర్తింపు

మార్చు

ఈ విశ్వవిద్యాలయానికి మూడు విభాగాల్లో ఐఎస్‌వో సర్టిఫికెట్లు (నాణ్యమైన ఉన్నత విద్య సేవలను అందిస్తున్నందుకు మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్వాలిటీ స్టాండర్డ్స్‌ విభాగంలో ఐఎస్‌వో 9001-2015 సర్టిఫికెట్‌ను, ఎనర్జీ స్టాండర్డ్స్‌ విభాగంలో ఎస్‌వో 50001-2028 సర్టిఫికెట్‌ను, పర్యావరణ అండ్‌ గ్రీన్‌ అడిట్‌లో ఐఎస్‌వో 14001-2015 సర్టిఫికెట్‌) లభించాయి. దీనికి సంబంధించిన సర్టిఫికెట్లను 2022 అక్టోబరు 18న హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్స్‌ సంస్థ అధినేత ఆలపాటి శివయ్య చేతులమీదుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి వీసీ కే సీతారామారావు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో అకడమిక్‌ డైరెక్టర్‌ ప్రొ.సుధారాణి, సీఎస్టీడీ డైరెక్టర్‌ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్‌ ఏవీఎన్‌ రెడ్డి పాల్గొన్నారు.[2]

బయటి లింకులు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (23 May 2021). "ఉప'కుల'పతులు". www.andhrajyothy.com. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
  2. telugu, NT News (2022-10-19). "అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి ఐఎస్‌వో గుర్తింపు". Namasthe Telangana. Archived from the original on 2022-10-18. Retrieved 2022-10-18.