ప్రేమ్ చంద్ బైర్వా

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి

ప్రేమ్‌ చంద్‌ బైర్వా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను డూడు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరు 12 నుండి రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నాడు.[1][2][3]

ప్రేమ్ చంద్ బైర్వా
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి
Assumed office
15 December 2023
గవర్నర్కల్రాజ్ మిశ్రా
హరిభౌ బగాడే
ముఖ్యమంత్రిభజన్ లాల్ శర్మ
అంతకు ముందు వారుసచిన్ పైలట్
ఉన్నత & సాంకేతిక విద్య మంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం
Assumed office
2023 డిసెంబరు 15
అంతకు ముందు వారురాజేందర్ సింగ్ యాదవ్
రోడ్డు & రవాణా & రహదారుల మంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం
Assumed office
2023 డిసెంబరు 15
అంతకు ముందు వారుబ్రిజేంద్ర సింగ్ ఓలా
ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం మంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం
Assumed office
2023 డిసెంబరు 15
అంతకు ముందు వారుసుభాష్ గార్గ్
రాజస్థాన్ శాసనసభ సభ్యుడు
Assumed office
2023 డిసెంబరు 3
అంతకు ముందు వారుబాబులాల్ నగర్
నియోజకవర్గండూడు
In office
2013–2018
అంతకు ముందు వారుబాబులాల్ నగర్
తరువాత వారుబాబులాల్ నగర్
నియోజకవర్గండూడు
వ్యక్తిగత వివరాలు
జననం (1969-08-31) 1969 ఆగస్టు 31 (వయసు 55)
శ్రీనివాసపుర, మౌజ్మాబాద్, రాజస్థాన్, భారతదేశం
జాతీయతభారతీయ
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
నారాయణీ దేవి
(m. invalid year)
సంతానం1 కొడుకు, 3 కుమార్తెలు
తల్లిదండ్రులురామ్ చంద్ర బైర్వా (తండ్రి)
సహృ దేవి (తల్లి)
చదువుM.A.
L.L.B
M.ఫిల్
Ph.D.
కళాశాలరాజస్థాన్ విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయ నాయకుడు
నైపుణ్యంవ్యవసాయం

జననం, విద్యాభాస్యం

మార్చు

ప్రేమ్‌ చంద్‌ బైర్వా 1969 ఆగస్టు 31న జన్మించాడు. బైర్వా రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

ప్రేమ్‌ చంద్‌ బైర్వా ఏబీవీపీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత జైపూర్‌ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ప్రేమ్ చంద్ బైర్వా 2013లో జరిగిన శాసనసభ ఎన్నికలలో డూడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హజారీ లాల్ నగర్ పై 33,720 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బాబు లాల్ నగర్‌ చేతిలో 14,779 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.  ప్రేమ్ చంద్ బైర్వా 2023లో డూడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బాబు లాల్ నగర్‌పై 35743 ఓట్ల తేడాతో  రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి డిసెంబరు 12న జరిగిన బీజేపీ పార్టీ సమావేశం తర్వాత అతనిని 12న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు.[4]

మూలాలు

మార్చు
  1. The Indian Express (12 December 2023). "Rajasthan's other Deputy CM: Who is Prem Chand Bairwa?" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. Hindustan Times (12 December 2023). "Diya Kumari, Prem Chand Bairwa elected as new Dy CMs of Rajasthan. Who are they?" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. The Times of India (12 December 2023). "Diya Kumari and Prem Chand Bairwa: All you need to know about the new deputy CMs of Rajasthan". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  4. Republic World (12 December 2023). "Meet Rajasthan's new Deputy CM Prem Chand Bairwa" (in US). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.{{cite news}}: CS1 maint: unrecognized language (link)