కల్రాజ్ మిశ్రా
కల్రాజ్ మిశ్రా(జననం: 1941 జులై 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర గవర్నరుగా 2019 సెప్టెంబరు 9 నుండి 2024 జులై 26 వరకు పనిచేసాడు.[1][2] అతను హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నరుగా,[3] ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల క్యాబినెట్ మంత్రిగా పనిచేసాడు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధంగా ఉన్న అతను 2014 నుండి 2019 వరకు ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియా నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు.
కల్రాజ్ మిశ్రా | |||
2023 లో కల్రాజ్ మిశ్రా | |||
21వ రాజస్థాన్ గవర్నర్
| |||
పదవీ కాలం 2019 సెప్టెంబరు 9 – 2024 జులై 30 | |||
ముందు | కళ్యాణ్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | హరిభౌ బగాడే | ||
హిమాచల్ ప్రదేశ్ 19వ గవర్నరు
| |||
పదవీ కాలం 2019 జులై 22 – 2019 సెప్టెంబరు 8 | |||
ముందు | ఆచార్య దేవవ్రత్ | ||
తరువాత | బండారు దత్తాత్రేయ | ||
సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2014 మే 26 – 2017 ఆగస్టు 31 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | కె.హెచ్.మునియప్ప | ||
తరువాత | గిరిరాజ్ సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | Malikpur, United Provinces, British India (present-day Uttar Pradesh, India) | 1941 జూలై 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
సంతానం | 3 |
అతను రాజ్యసభ సభ్యుడుగా పనిచేసాడు. 2012 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో లక్నో తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.[4] బీజేపీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
వ్యక్తిగత జీవితం
మార్చుమిశ్రా 1941 జులై 1న ఘాజిపూర్ లోని మాలిక్ పూర్ గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి రామగ్య మిశ్రా, ఒక ఉపాద్యాయుడు. వారణాసిలోని మహాత్మా గాంధీ కాసి విద్యాపీఠం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను అభ్యసించాడు. 1963 మే 7న సత్యవతి మిష్రాని వివాహం చేసుకున్నాడు, వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె.[5]
రాజకీయ జీవితం
మార్చు1955 లో, మిశ్రా ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకుడిగా చేరాడు, 1963 లో ఆర్‌ఎస్‌ఎస్ పూర్తికాలీక్ ప్రచారక్ అయ్యాడు. ఇతను భారతీయ జనతా యువమోర్చాకు ఎన్నికైన మొదటి జాతీయ అధ్యక్షుడు.[6]
గవర్నరుగా
మార్చు2019 జూలైలో హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 2019 సెప్టెంబరులో రాజస్థాన్ గవర్నరుగా నియమించబడ్డాడు.[7]
మూలాలు
మార్చు- ↑ "Kalraj Mishra". Kalraj Mishra. Archived from the original on 2014-10-13. Retrieved 2021-10-07.
- ↑ "Members : Lok Sabha". 164.100.47.194. Retrieved 23 February 2020.
- ↑ https://www.oneindia.com/himachal-pradesh-governors-list/
- ↑ The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Singh, Akhilesh (4 September 2017). "Cabinet rejig: Uma, Rudy skip swearing-in ceremony". The Times of India. Retrieved 12 January 2021.
- ↑ PTI (15 July 2019). "Kalraj Mishra appointed Himachal Pradesh Governor, Acharya Devvrat shifted to Gujarat". The Hindu. Retrieved 16 July 2019.
- ↑ "Kalraj Mishra Appointed Himachal Pradesh Governor, Acharya Devvrat Shifted to Gujarat". News18. 16 July 2019. Retrieved 25 December 2019.