గ్రామ్‌ఫోను కనిపెట్టి, ఆ పరికరం మీద పాటలు వినడం మొదలు పెట్టిన దగ్గరనుండి లలిత సంగీత ప్రాభవం ప్రారంభమయింది. సినిమా పాట కాకుండా వచ్చిన రికార్డులన్నీ కూడ లలిత సంగీతంగా పిలవబడ్డాయి. తెలుగులో ఈ పాటలు చాలా ప్రాచుర్యం చెందాయి. ఎస్. రాజెశ్వరరావు పాడిన పాటలు, రావు బాలసరస్వతి పాడిన పాటలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. అలాగే, సాలూరు రాజేశ్వరరావు, రావు బాలసరస్వతి పాడిన పాటలు 1940-50లలో అప్పటి యువతీ యువకులను ఎంతగానో అలరించాయి.

ఘంటసాల పాడిన పాటలు ఎంతగానో ప్రసిద్ధి కెక్కాయి. ఆయన పాడిన పోలీసు వెంకటస్వామి, అత్తలేని కోడలు ఉత్తమురాలు వంటి పాటలు చాలా పేరు తెచ్చుకున్నాయి. అలాగే ఆయన పాడిన కుంతీ విలాపము, పుష్ప విలాపము పద్యాలు శ్రోతలను కట్టిపడేశాయి.