రక్షణ పోలీసు నేపథ్యం ఆధారంగా 1993 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో అక్కినేని వెంకట్ నిర్మించి, ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇందులో అక్కినేని నాగార్జున, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతం ఎం. ఎం. కీరవాణి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సగటు చిత్రంగా నిలిచింది.

రక్షణ
దర్శకత్వంఉప్పలపాటి నారాయణరావు
రచనపోసాని కృష్ణ మురళి (మాటలు), ఉప్పలపాటి నారాయణరావు(కథ, స్క్రీన్ ప్లే), అక్కినేని వెంకట్ (స్క్రీన్ ప్లే)
నిర్మాతఅక్కినేని వెంకట్
తారాగణంఅక్కినేని నాగార్జున ,
శోభన
ఛాయాగ్రహణంతేజ
కూర్పుశంకర్
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

విశాఖపట్నంలో ఎసిపిగా పనిచేస్తున్న బోస్ హైదరాబాద్ వస్తాడు. అతను తన స్నేహితుడు ( నాసర్ ) తో కలిసి ఉంటాడు. తన ధర్మబద్ధమైన కానీ ఆవేశపూరిత చర్యలకు ప్రసిద్ధి. అతని స్నేహితుడు దాని గురించి ఆందోళన చెందుతాడు. అండర్వరల్డ్ డాన్ సోదరులైన చిన్నా, నల్ల శ్రీనులను అడ్డుకోడానికి బోస్ ప్రయత్నిస్తాడు. చిన్నాను బోస్ అరెస్టు చేస్తాడు. అందుకతడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఇంతలో, పద్మ బోస్‌తో ప్రేమలో పడతుంది. వారు పెళ్ళి చేసుకుంటారు. ఒక కుమార్తె కలుగుతుంది. నల్ల శ్రీను పార్టీ అధ్యక్షుడవుతాడు. బోసు, అతని స్నేహితుడూ చిన్న, నల్ల శ్రీనుల పథకాలను అంతం చేయడానికీ వారి నేరాలను ఆపడానికీ ప్రయత్నిస్తారు. బోస్ ను కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఉండగా చిన్నా బోస్ స్నేహితుడిని చంపేస్తాడు. చివరికి, చిన్నా బోస్ కుమార్తెను కిడ్నాప్ చేస్తాడు. బోస్ తన కుమార్తెను ఎలా కాపాడుకుంటాడు, విలన్లను ఎలా అంతం చేస్తాడు అనేది మిగిలిన కథ.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్ర పాటలకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు. ఆకాష్ ఆడియో కంపెనీ సంగీతాన్ని విడుదల చేసింది.

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."గుప్పు గుప్పు"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర4:30
2."కన్నెపాపా అందుకో"ఎం. ఎం. కీరవాణిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:21
3."ఘల్లుమంది"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:54
4."ఏ జన్మదో"వేటూరి సుందరరామమూర్తికీరవాణి, కె.ఎస్.చిత్ర6:10
5."నీకు నాకు"సిరివెన్నెల సీతారామశాస్త్రిమాల్గాడి శుభ4:18
మొత్తం నిడివి:25:13
"https://te.wikipedia.org/w/index.php?title=రక్షణ&oldid=4131280" నుండి వెలికితీశారు