ప్రోపేన్ అనునది ఆల్కేన్ సమూహానికి చెందిన ఇక హైడ్రోకార్బను సమ్మేళనం.ఇది స్వాభావికంగా వాయు రూపంలో లభ్యమైనప్పటికి, దీనిని సంకోచింపచేసిన ద్రవరూపంలోనికి మారును.అందుచే దీనిని LPG (liquified petrolum gas) అనికూడా కొన్నిదేశాలలో వ్యవహరిస్తుంటారు. దీని అణుఫార్ములా C3H8.ప్రోపేన్ అణువులో ద్విబంధాలు లేవు.ఇది ఒక సంతృప్త హైడ్రోకార్బను. ప్రోపేన్ ను సహజవాయునుండి, ఇతర పెట్రోలియం ఉత్పతులనుండికూడా తయారు చేయుదురు[3]

ప్రొపేన్
Skeletal formula of propane
Skeletal formula of propane
Skeletal formula of propane with all implicit carbons shown, and all explicit hydrogens added
Skeletal formula of propane with all implicit carbons shown, and all explicit hydrogens added
Ball and stick model of propane
Ball and stick model of propane
Spacefill model of propane
Spacefill model of propane
పేర్లు
IUPAC నామము
Propane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [74-98-6]
పబ్ కెమ్ 6334
యూరోపియన్ కమిషన్ సంఖ్య 200-827-9
కెగ్ D05625
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:32879
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య TX2275000
SMILES CCC
బైల్ స్టెయిన్ సూచిక 1730718
జి.మెలిన్ సూచిక 25044
ధర్మములు
C3H8
మోలార్ ద్రవ్యరాశి 44.10 g·mol−1
స్వరూపం Colorless gas
వాసన Odorless
సాంద్రత 2.0098 mg mL−1 (at 0 °C, 101.3 kPa)
ద్రవీభవన స్థానం −187.7 °C; −305.8 °F; 85.5 K
40 mg L−1 (at 0 °C)
log P 2.236
బాష్ప పీడనం 853.16 kPa (at 21.1 °C)
kH 15 nmol Pa−1 kg−1
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−105.2–−104.2 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−2.2197–−2.2187 MJ mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 73.60 J K−1 mol−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS02: Flammable
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H220
GHS precautionary statements P210
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R12
S-పదబంధాలు (S2), S16
జ్వలన స్థానం {{{value}}}
విస్ఫోటక పరిమితులు 2.37–9.5%
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

ప్రోపేన్ ఇతిహాసం

మార్చు

ప్రోపేన్ వాయువును సా.శ.1910 లో మొదటగా డా, వాల్టరు స్నెల్లింగ్ (Dr. Walter Snelling, వాహనంలలో ఇంధనంగా వాడు గాసొలిన్ (gasoline) లో గుర్తించాడు.వాహనంలో నింపిన గాసొలిన్ త్వరగా ఆవిరై పోవడంపై పరిశోధించినప్పుడు గాసొలిన్ లోని ఒక వాయువు అందుకు కారణంగా గుర్తించారు.వాయు అణువులో మూడు కార్బనులు వుండటం వలన దానికి ప్రోపేన్ అని పేరు రూడి అయ్యింది.[4] తరువాత క్రమంలో ఫ్రాంకు పి.పిటరుసన్, చెస్టరుకెర్ర్, అర్థర్ కెర్ర్ లతోకలిసి స్నెల్లింగు, గాసొలిన్ ను శుద్ధీచెయునప్పుడు వెలువడు ప్రోపేన్ను ద్రవీకరించి, సిలెండరులలో నింపడం కనుగొన్నాడు.దీనిని ద్రవీకరించిన పెట్రొలియం వాయువుగా (Liquified Petrolium Gas:LPG) మొదటి సారిగా అమ్మకం ప్రారంభించారు.సా.శ.1911 నాటికి శుద్ధమైన ప్రోపేన్ వాయువును ఉత్పత్తి చెయ్యడం మొదలుపెట్టాడు.సా.శ.1913, మార్చి 25 న తన అవిష్కరణకు పెటెంటు (#1,05,845) పొందాడు[5]

ఉత్పత్తి

మార్చు

ప్రోపేన్ వాయువును సహజవాయువునుండి, పెట్రొలియం ఉత్పత్తులనుండి పొందటం జరుగుతుంది.[6] ముడి పెట్రొలియం నూనెను వివిధ పొట్రొలియం ఉత్పత్తులకై (బ్యూటేన్, పెంటేన్, పెట్రోలు, గ్యాసోలిన్, డీసెస్ ) ఆంశిక స్వేదనం చెయునప్పుడు ప్రోపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లు మొదటగా వేరుచెయ్యడం జరుగుతుంది.

భౌతిక గుణగణాలు

మార్చు
  • ప్రోపేన్ యొక్క అణుఫార్ములా C3H8.అణుభారం:44.10గ్రా.మోల్−1.
  • ప్రోపేన్ 38.80Cవద్ద ద్రవంగా వున్నప్పుడు సాంద్రత (నీటి సాంద్రత) :0.504.అదే వాయుస్థితిలో వున్నప్పుడు (గాలి=1) :1.50.అనగా వాయు స్థితిలో ప్రోపేన్ భారం కలిగివున్నది.ప్రోపేన్ యొక్క ఆవిరి సాంద్రత (vapour density)38.80C వద్ద 1.52 ఉంది.కావున ప్రోపేన్ ఆవిరి (vapour) gAlikanna 1.52 రెట్లు భారం.సరిగా దహనం చెందుటకు/మండుటకు ప్రోపేన్, గాలి మిశ్రం నిష్పత్తిలో 1:24.అనగా ఇకవంతు ప్రోపేన్కు (4%) కు 24 వంతుల (96%) గాలిని కలుపవలెను.ఒక ఘన అడుగు ప్రిపెనును దహించిన వెలువడు ఉశ్హ్ణరాశి:2,448BTU (బ్రిటిసు థర్మల్ యూనిట్లు) [7].ప్రోపేన్ గాలిలో మండుటకు కనీసం 511.00c ఉష్ణోగ్రత ప్రారంభదశలో వుండాలి.

ప్రోపేన్ యొక్క కొన్ని భౌతిక గుణాల పట్టిక[8]

గుణము విలువల మితి
విశిష్టగురుత్వం వాయురూపంలో (గాలి=1) 1.52
ద్రవరూపంలో సాంద్రత, వాతావరణ పీడనం వద్ద (1atm) 580కిలోలు/మీటరు3
ఆవిరి వత్తిడి,250C వద్ద 0.936 MN/m2
పరమ స్నిగ్థత 0.080.centipoises)
విశిష్ట ఉష్ణం-Cp 0.39 కెలరిలు/గ్రాం-0C
విశిష్ట ఉష్ణ నిష్పత్తి, Cp/Cv 1.2
వాయు స్థిరాంకము.R (జౌల్/కిలో0C 188
ఉష్ణ వాహక తత్వం, (W/m0C 0.017
విడుదల అగు దహన ఉష్ణశక్తి, కిలో జౌల్/కిలో 50340

రసాయనిక చర్యలు

మార్చు
  • అక్సిజనుతో ప్రోపేన్ వాయువును మండించిన బొగ్గుపులుసు వాయువు, నీరు ఏర్పడి, అధిక మొత్తంలో ఉష్ణం వెలువడును.అందుచే ప్రోపేన్ ను ఇంధనంగా వాడుతారు.
C3H8+5O2 → 3CO2 + 4H2O+Heat
ప్రోపేన్+ఆక్సిజను → బొగ్గుపులుసు వాయువు+నీరు+ఉష్ణం
Propane + oxygen → Carbon dioxide + water + Heat
 
ప్రొపేన్ దహన చర్య

ప్రోపేన్ వాయువు వినియోగం

మార్చు
  • ద్రవీకరింపబడిన ప్రోపేన్ వాయువును ద్రవీకరించిన పెట్రొలియం గ్యాస్ (Liquified petrolium gas=LPG) ఆంటారు. ద్రవీకరించిన ప్రోపేన్ ను అమెరికా వంటి దేశాలలో వాహనాల ఇంధనంగా వాడుదురు.[9].
  • అమెరికాలో ఏడాదికి 57 బిలియన్ లీటర్ల ప్రోపేన్ వాయును ఇంధనంగా వినియోగిస్తున్నారు[10]
  • అమెరికా వంటిదేశాలలో HD-5గా అమ్మబడుచున్న వాహన ఇంధనంలో ప్రోపేన్ 90%, ప్రొపిలిన్5%, మిగిలినవి5% వుండును[11] .
  • వేడి గాలి బెలూన్ (Hot Air Ballons) ఏగురుటకు మండిచు ప్రాథమిక ఇందనవాయువు ప్రోపేన్.
  • ఇళ్ళలో వాడు ఎయిర్ ప్రెషనర్సులో ప్రోపేన్ను వాడెదరు.

మూలాలు

మార్చు
  1. "Propane – Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 27 March 2005. Identification and Related Records. Retrieved 8 December 2011.
  2. Record of Propane in the GESTIS Substance Database of the Institute for Occupational Safety and Health
  3. http://www.propanecouncil.org/council/what-is-propane/
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-02. Retrieved 2013-11-06.
  5. National Propane Gas Association. "The History of Propane". Archived from the original on 2011-01-11. Retrieved 2007-12-22.
  6. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-12-13. Retrieved 2013-11-06.
  7. http://www.propanesafety.com/uploadedFiles/Safety/Workforce_Training_programs/Propane_Emergencies_(PE)_Program/MTK_02-Properties.pdf
  8. http://www.engineeringtoolbox.com/propane-d_1423.html
  9. http://www.fueleconomy.gov/feg/lpg.shtml
  10. http://www.madehow.com/Volume-3/Propane.html
  11. http://www.afdc.energy.gov/fuels/propane_basics.html

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రొపేన్&oldid=4196998" నుండి వెలికితీశారు