ప్లాన్ బి
ప్లాన్ బి 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఏవీఆర్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ రాజమహి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదలైంది.[1]
ప్లాన్ బి | |
---|---|
దర్శకత్వం | కేవీ రాజమహి |
స్క్రీన్ ప్లే | కేవీ రాజమహి |
కథ | కేవీ రాజమహి |
నిర్మాత | ఏవీఆర్ |
తారాగణం | శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళి శర్మ |
ఛాయాగ్రహణం | వెంకట్ గంగాధర |
సంగీతం | శక్తికాంత్ కార్తీక్ |
నిర్మాణ సంస్థ | ఏవీఆర్ మూవీ వండర్స్ |
విడుదల తేదీ | 17 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) రిటైర్డ్ పోలీసు అధికారి హత్యకు గురవుతాడు. తాను చనిపోయే ముందు తన కూతురు అవంతిక (డింపుల్) కు రూ. 10 కోట్లు ఇచ్చి, అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొమ్మని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించ బడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి), ప్రైవేట్ టీచర్ అవంతిక భర్త రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. లాయర్ హత్య కేసు దర్యాప్తును ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాష్) చేపడతారు. లాయర్ విశ్వనాథ్‌ను, రిషి (అభినవ్ సర్దార్), రాజేంద్రలను ఎవరు, ఎందుకు హత్య చేసారు ? ఈ హత్యలకు కారణమేమిటి అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
మార్చు- శ్రీనివాస్ రెడ్డి
- సూర్య వశిష్ట
- డింపుల్
- మురళి శర్మ
- రవిప్రకాష్
- అభినవ్ సర్దార్
- రాజేంద్ర
- శాని నవీనారెడ్డి
- చిత్రం శ్రీను
- మీనా
- దయానంద్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఏవీఆర్ మూవీ వండర్స్
- నిర్మాత: ఏవీఆర్
- సహా నిర్మాతలు: శ్రవణ్ కుమార్, రంజిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి & అనిల్ కుమార్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కేవీ రాజమహి
- సంగీతం: స్వర
- నేపథ్య సంగీతం: శక్తికాంత్ కార్తీక్
- సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధర
- ఫైట్స్: శంకర్ ఉయ్యాల
- ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ చిత్తనూర్
- డిజైన్స్ : ఓంకార్ కడియం
మూలాలు
మార్చు- ↑ Sakshi (12 September 2021). "సెప్టెంబర్ 17న శ్రీనివాస్ రెడ్డి ' ప్లాన్ బి'". Archived from the original on 12 September 2021. Retrieved 12 September 2021.
- ↑ Sakshi (16 September 2021). "'ప్లాన్ బి' ఎలా ఉందంటే..?". Archived from the original on 2021-09-18. Retrieved 21 November 2021.
- ↑ Andhrajyothy (17 September 2021). "'ప్లాన్-బి' మూవీ రివ్యూ". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.