ఫఖర్ జమాన్ (క్రికెటర్)
ఫఖర్ జమాన్ (జననం 1990, ఏప్రిల్ 10) పాకిస్తానీ క్రికెటర్.[2] పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు,[3] పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్ కొరకు ఆడాడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీతో విజయం సాధించిన తర్వాత గుర్తింపు పొందాడు. ఫైనల్‌లో 106 బంతుల్లో 114 పరుగుల ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | మర్దాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ | 1990 ఏప్రిల్ 10|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10 అం. (178 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 234) | 2018 16 అక్టోబర్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2019 జనవరి 3 - సౌత్ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 212) | 2017 జూన్ 7 - సౌత్ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 14 సెప్టెంబర్ - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 39 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 74) | 2017 30 మార్చ్ - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఏప్రిల్ 14 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 39 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–2015 | Karachi | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | Peshawar | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–present | లాహోర్ కలందర్స్ (స్క్వాడ్ నం. 39) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Balochistan | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | కొమిల్లా విక్టోరియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | గ్లామోర్గాన్ (స్క్వాడ్ నం. 39) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20–2023 | ఖైబర్ పఖ్తూన్వా (స్క్వాడ్ నం. 39) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021/20 | Brisbane Heat (స్క్వాడ్ నం. 39) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 07 మే 2023 |
2018, జూలై 20న, పాకిస్తాన్ తరపున వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్ అయ్యాడు.[4] రెండు రోజుల తర్వాత, వన్డేల్లో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.[5] 2018 ఆగస్టులో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ద్వారా 2018–19 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఇతను ఒకడు.[6][7]
2021, ఏప్రిల్ 4న, రెండవ వన్డేలో దక్షిణాఫ్రికాతో ఛేజింగ్ చేస్తున్నప్పుడు, క్వింటన్ డి కాక్ చేతిలో రనౌట్ కావడానికిముందు 193 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై షేన్ వాట్సన్ చేసిన 185 పరుగులను అధిగమించి వన్డేలో ఛేజింగ్‌లో ఫఖర్ చేసిన 193 అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.[8]
తొలి జీవితం
మార్చుజమాన్ 1990 ఏప్రిల్ 10న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మర్దాన్ జిల్లాలోని కట్లాంగ్‌లో జన్మించాడు. మెట్రిక్యులేషన్ తరువాత 16 సంవత్సరాల వయస్సులో కరాచీకి వెళ్ళాడు. 2007లో, పాకిస్తాన్ నేవీ స్కూల్, బహదూర్ నుండి తన పాఠశాల విద్య, సముద్రంలో శిక్షణ పొందిన తర్వాత పాకిస్తాన్ నేవీలో సెయిలర్‌గా చేరాడు.[9][10][11]
దేశీయ క్రికెట్
మార్చుకరాచీలో, పాకిస్తాన్ నేవీ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యంతో సహా ఇంటర్-డిపార్ట్‌మెంట్ మ్యాచ్‌లలో అప్పుడప్పుడు క్రికెట్ ఆడటం కొనసాగించాడు. 2016 పాకిస్తాన్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. 2016-17 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో సెలెక్టర్లను కూడా ఆకట్టుకున్నాడు.
2017 ఆగస్టులో, టీ20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం డర్బన్ క్వాలండర్స్ జట్టులో ఎంపికయ్యాడు.[12] అయితే, 2017 అక్టోబరులో, క్రికెట్ దక్షిణాఫ్రికా మొదట్లో టోర్నమెంట్‌ను 2018 నవంబరుకు వాయిదా వేసింది, ఆ తర్వాత వెంటనే రద్దు చేయబడింది.[13]
2019 జూలైలో, యూరో టీ20 స్లామ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో రోటర్‌డ్యామ్ రైనోస్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.[14][15] అయితే, మరుసటి నెలలో టోర్నీ రద్దు చేయబడింది.[16]
2021 జనవరిలో, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[17][18]
2022 డిసెంబరులో, 2022–23 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కోసం ఖుల్నా టైగర్స్ చేత సంతకం చేయబడ్డాడు.[19]
అంతర్జాతీయ క్రికెట్
మార్చు2017 మార్చిలో, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్టులో అతను పేరు పొందాడు.[20] 2017 మార్చి 30 న వెస్టిండీస్‌పై పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసాడు.[21]
2017 ఏప్రిల్ లో, 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[22] 2017 జూన్ 7న ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులతో పాకిస్తాన్ తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[23][24]
మూలాలు
మార్చు- ↑ Fakhar Zaman’s profile on Sportskeeda
- ↑ "Fakhar Zaman". ESPN Cricinfo. Retrieved 1 November 2015.
- ↑ "Meet the new faces in the Pakistan Test squad". International Cricket Council. Retrieved 22 May 2018.
- ↑ "Fakhar Zaman - from king of Katlang to pride of Pakistan". ESPNcricinfo. Retrieved 21 July 2018.
- ↑ "Zaman breaks 38-year-old record". The Express Tribune. Retrieved 22 July 2018.
- ↑ "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 6 August 2018.
- ↑ "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 6 August 2018.
- ↑ "Stats - Fakhar Zaman records the highest ever individual score in an ODI chase". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-04-05.
- ↑ Sheikh, Arslan (16 October 2016). "The Navy jawaan who would be Adam Gilchrist".
- ↑ "India vs Pakistan, ICC Champions Trophy Final: Fakhar Zaman, the fauji who is now the pride of Pakistan". 20 June 2017.
- ↑ "My number will come – Fakhar Zaman". Cricinfo. 14 December 2016. Retrieved 19 June 2017.
- ↑ "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 September 2017. Retrieved 28 August 2017.
- ↑ "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. Retrieved 10 October 2017.
- ↑ "Eoin Morgan to represent Dublin franchise in inaugural Euro T20 Slam". ESPN Cricinfo. Retrieved 19 July 2019.
- ↑ "Euro T20 Slam Player Draft completed". Cricket Europe. Archived from the original on 19 జూలై 2019. Retrieved 19 July 2019.
- ↑ "Inaugural Euro T20 Slam cancelled at two weeks' notice". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
- ↑ "Pakistan Cup One-Day Tournament promises action-packed cricket". Pakistan Cricket Board. Retrieved 7 January 2021.
- ↑ "Pakistan Cup One-Day Tournament: Fixtures Schedule, Teams, Player Squads – All you need to Know". Cricket World. Retrieved 7 January 2021.
- ↑ "Khulna Tigers rope in Pakistan's Fakhar-Sharjeel". Cricfrenzy. Retrieved 29 December 2022.
- ↑ "Kamran Akmal returns to Pakistan ODI and T20I squads". ESPN Cricinfo. Retrieved 15 March 2017.
- ↑ "Pakistan tour of West Indies, 2nd T20I: West Indies v Pakistan at Port of Spain, Mar 30, 2017". ESPN Cricinfo. Retrieved 30 March 2017.
- ↑ "Pakistan recall Azhar, Umar Akmal". ESPNcricinfo. 25 April 2017. Retrieved 25 April 2017.
- ↑ "Fakhar Zaman Debut and last played matches in Tests, ODIs, T20Is and other formats". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-31.
- ↑ "Full Scorecard of South Africa vs Pakistan 7th Match Group B 2017 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-03-31.