ఫజల్‌హక్ ఫారూఖీ

ఫజల్హాక్ ఫరూఖీ (జననం 2000 సెప్టెంబరు 22) ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం అన్ని ఫార్మాట్లలో ఆడే ఆఫ్ఘన్ అంతర్జాతీయ క్రికెటరు. ఫజల్‌హక్ 2021 మార్చిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగుపెట్టాడు. ఫ్రాంచైజీ లీగ్‌లలో, అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో ఢాకా డామినేటర్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ఆడతాడు. [1]

ఫజల్‌హక్ ఫారూఖీ
2021 లో ఫారూఖీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫజల్‌హక్ ఫారూఖీ
పుట్టిన తేదీ (2000-09-22) 2000 సెప్టెంబరు 22 (వయసు 24)
బగ్లాన్, ఆఫ్ఘనిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 52)2022 జనవరి 25 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 43)2021 మార్చి 20 - జింబాబ్వే తో
చివరి T20I2023 మార్చి 27 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2022Minister Dhaka
2022–presentసన్ రైజర్స్ హైదరాబాద్
2022/23Sydney Thunder
2023-presentIslamabad United
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు T20I లిఎ T20
మ్యాచ్‌లు 19 24 25 56
చేసిన పరుగులు 9 1 12 5
బ్యాటింగు సగటు 4.33 1.00 4.20 1.25
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 6* 1* 7 2*
వేసిన బంతులు 870 544 1166 1268
వికెట్లు 22 27 38 62
బౌలింగు సగటు 24.21 21.85 28.23 22.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/49 3/11 4/49 3/11
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/– 1/– 10/–
మూలం: ESPNCricinfo, 2023 మార్చి 11

కెరీర్

మార్చు

ఫజల్‌హక్ 2017 నవంబరు 13న, 2017–18 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో అమో రీజియన్‌కు తన తొలి ఫస్ట్-క్లాస్ ఆడాడు.[2] అతను 2018 జూలై 10 న, 2018 ఘాజీ అమానుల్లా ఖాన్ రీజినల్ వన్ డే టోర్నమెంట్‌లో అమో రీజియన్ తరఫున లిస్టు A లోకి ప్రవేశించాడు.[3]

2018 సెప్టెంబరులో అతను, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో నంగర్హర్ జట్టుకు ఎంపికయ్యాడు. [4] 2018 డిసెంబరులో, అతను 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. [5] అతను 2019 ష్పజీజా క్రికెట్ లీగ్‌లో బూస్టు డిఫెండర్స్ కోసం 2019 అక్టోబరు 14న ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు. [6]\2019 డిసెంబరులో, అతను 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [7] 2021 ఫిబ్రవరిలో, అతను జింబాబ్వేతో సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. [8] తరువాతి నెలలో, అతను ఆఫ్ఘనిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో, జింబాబ్వేతో జరిగిన వారి సిరీస్‌కి కూడా ఎంపికయ్యాడు. [9] 2021 మార్చి 20న జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి T20I ఆడాడు.[10] అదే నెల తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్ 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం తమ జట్టులో నెట్ బౌలర్‌గా ఫజల్‌హాక్‌ను చేర్చుకుంది. [11] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఎడిషన్‌లో కింగ్స్ XI పంజాబ్ నెట్ బౌలర్‌గా కూడా ఫరూఖీ పనిచేశాడు. [12]


2021 జూలైలో, ఫజల్‌హక్‌ను పాకిస్తాన్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులోకి తీసుకున్నారు.[13] 2022 జనవరిలో, అతను ఖతార్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వన్‌డే జట్టుకు ఎంపికయ్యాడు. [14] అతను 2022 జనవరి 25న ఆఫ్ఘనిస్తాన్ తరపున నెదర్లాండ్స్‌పై తన వన్‌డే రంగప్రవేశం చేసాడు. [15]

2022 ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేసింది. [16] 2022 జూలైలో, అతను లంక ప్రీమియర్ లీగ్ యొక్క మూడవ ఎడిషన్ కోసం కొలంబో స్టార్స్‌కు సంతకం చేశాడు. [17] 2022 డిసెంబరు 15న ఫజల్‌హాక్‌కి సంబంధించి, మహిళా క్రికెట్ సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డాడనే ప్రవర్తనా సంఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా జరిపిన విచారణ తర్వాత 2022 డిసెంబరు 23న, సిడ్నీ థండర్, అతనితో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసింది. [18] [19]

మూలాలు

మార్చు
  1. "Fazalhaq Farooqi". ESPN Cricinfo. Retrieved 15 November 2017.
  2. "9th Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Khost, Nov 13-16 2017". ESPN Cricinfo. Retrieved 15 November 2017.
  3. "Group A, Ghazi Amanullah Khan Regional One Day Tournament at Kabul, Jul 10 2018". ESPN Cricinfo. Retrieved 10 July 2018.
  4. "Gayle, Afridi, Russell: icons in Afghanistan Premier League". ESPN Cricinfo. Retrieved 11 September 2018.
  5. "Afghanistan Under-23s Squad". ESPN Cricinfo. Retrieved 3 December 2018.
  6. "15th Match, Shpageeza Cricket League at Kabul, Oct 14 2019". ESPN Cricinfo. Retrieved 14 October 2019.
  7. "Afghanistan U19 squad announced for ICC U19 World Cup". Afghanistan Cricket Board. Retrieved 8 December 2019.
  8. "Rashid Khan in squad for Zimbabwe Tests, to miss large part of PSL season". ESPN Cricinfo. Retrieved 18 February 2021.
  9. "Afghanistan T20I squad announced albeit visa issues for Some Players". Afghanistan Cricket Board. Retrieved 14 March 2021.
  10. "3rd T20I, Abu Dhabi, Mar 20 2021, Zimbabwe tour of United Arab Emirates". ESPN Cricinfo. Retrieved 20 March 2021.
  11. Gaur, Akshat. "Chennai Super Kings include a young Afghan pacer as a net bowler in their squad". CricketTimes.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 25 March 2021.
  12. Shukla, Shivani (March 25, 2021). "IPL 2021: Chennai Super Kings Rope in Afghanistan Pacer Ahead Of The Tournament". ProBatsman.Com.
  13. "Fazalhaq Farooqi, Noor Ahmad in Afghanistan squad for their first bilateral ODI series against Pakistan". ESPN Cricinfo. Retrieved 23 July 2021.
  14. "Nabi rules himself out of Netherlands ODIs". CricBuzz. Retrieved 15 January 2022.
  15. "3rd ODI, Doha, Jan 25 2022, ICC Men's Cricket World Cup Super League". ESPN Cricinfo. Retrieved 25 January 2022.
  16. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 13 February 2022.
  17. "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPN Cricinfo. Retrieved 6 July 2022.
  18. Middleton, Dave. "Thunder terminate Farooqi's deal after investigation". cricket.com.au. Cricket Australia. Retrieved 23 December 2022.
  19. "Fresh details emerge after BBL star sacked over harassment accusations". Fox Sports (in ఇంగ్లీష్). 2022-12-24. Retrieved 2022-12-24.