ఫరీద్ అహ్మద్
ఫరీద్ అహ్మద్ (జననం 1994 ఆగస్టు 10) ఆఫ్ఘన్ క్రికెట్ ఆటగాడు. [1] అతను 2014 డిసెంబరు 2 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) లలోకి ప్రవేశించాడు.[2] అతను 2014 ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. [3] అతను 2016 డిసెంబరు 14 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) ఆడాడు.[4]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | ఫరీద్ అహ్మద్ మాలిక్ |
పుట్టిన తేదీ | నంగర్‌హర్, ఆఫ్ఘనిస్తాన్ | 1994 ఆగస్టు 10
బ్యాటింగు | ఎడమచేతి వాటం |
బౌలింగు | Left arm ఫాస్ట్ మీడియం |
పాత్ర | బౌలరు |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు |
|
తొలి వన్‌డే (క్యాప్ 35) | 2014 డిసెంబరు 2 - United Arab Emirates తో |
చివరి వన్‌డే | 2022 ఆగస్టు 26 - పాకిస్తాన్ తో |
తొలి T20I (క్యాప్ 33) | 2016 డిసెంబరు 14 - UAE తో |
చివరి T20I | 2023 మార్చి 27 - పాకిస్తాన్ తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2017 | Amo Region |
మూలం: Cricinfo, 18 February 2023 |
2018 సెప్టెంబరులో అతను, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు మొదటి ఎడిషన్‌లో కాబూల్ జట్టుకు ఎంపికయ్యాడు. [5] 2021 సెప్టెంబరులో 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఇద్దరు రిజర్వులలో ఒకడిగా ఎంపికయ్యాడు. [6]
వివాదాలు
మార్చు2022 ఆసియా కప్‌లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫరీద్, ఆసిఫ్‌ను అవుట్ చేసిన తర్వాత మైదానంలో గొడవకు దిగినందుకు ఆసిఫ్ అలీ, ఫరీద్‌లకు వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఆటగాళ్ళిద్దరూ తమ నేరాన్ని అంగీకరించి, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన ఆంక్షలను అంగీకరించారు.[7][8]
మూలాలు
మార్చు- ↑ "Fareed Ahmad Malik". ESPN Cricinfo. Retrieved 26 June 2015.
- ↑ "Afghanistan tour of United Arab Emirates, 3rd ODI: United Arab Emirates v Afghanistan at Dubai (CA), Dec 2, 2014". ESPN Cricinfo. Retrieved 2 December 2014.
- ↑ "Profile". Incheon 2014 official website. Archived from the original on 9 October 2014. Retrieved 10 July 2015.
- ↑ "Afghanistan tour of United Arab Emirates, 1st T20I: United Arab Emirates v Afghanistan at ICCA Dubai, Dec 14, 2016". ESPN Cricinfo. Retrieved 14 December 2016.
- ↑ "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. Retrieved 10 September 2018.
- ↑ "Rashid Khan steps down as Afghanistan captain over team selection". Cricbuzz. Retrieved 9 September 2021.
- ↑ "Asif Ali, Fareed Ahmad fined for on-field altercation". 8 September 2022.
- ↑ "Asif Ali and Fareed Ahmad punished for breaching ICC Code of Conduct".