ఫలరసం

(ఫలరసాలు నుండి దారిమార్పు చెందింది)

ఫలరసం (Fruit juice) పండ్ల నుండి తయారుచేసే పానీయం. రసాలు పండ్లు, కూరగాయల నుండి తీసే ద్రవ పదార్ధాలు. తాజా పండ్ల నుండి పిండి చేసి లేదా కొన్ని చేతి యంత్రాల సాయంతో ఫలరసాలు తయారుచేస్తారు. వీటిని వేడి చేయకుండా లేదా ఇతర రకాల పదార్ధాలు కలుపకుండా తాజాగా ఉపయోగిస్తారు. ఉదాహరణ. బత్తాయి చెట్టు నుండి వచ్చిన బత్తాయి పండ్ల నుండి తీసిన రసాన్ని బత్తాయి రసం అంటారు. ఈ విధంగా రసాలు తీయడానికి కొన్ని యంత్రాలు ఉపయోగిస్తారు. కొన్నింటిలో రసం తీసిన తర్వాత వడపోసి పోగుల్ని లేదా పిప్పిని వేరుచేస్తారు. కొన్ని రసాలు అతి చిక్కగా ఉంటే, తగినన్ని నీరు కలుపుకొని తాగవచ్చును. కొన్ని రసాలలో అవసరమైతే ఎక్కువ తీపి కోసం పంచదార లేదా చక్కెర కలుపుతారు. కొన్ని రకాల రసాలు నిలువ ఉంచడం కోసం ఇతర పదార్ధాలను కలుపుతారు. వీటి రుచి తాజా ఫలరసం కంటే వేరుగా ఉంటుంది.

బత్తాయి రసం
"https://te.wikipedia.org/w/index.php?title=ఫలరసం&oldid=4322510" నుండి వెలికితీశారు