ఫల్గుణి నాయర్ (ఆంగ్లం: Falguni Nayar) (జననం 1963 ఫిబ్రవరి 19) ఒక భారతీయ వ్యాపారవేత్త, బిలియనీర్.[2] బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ రిటైల్ కంపెనీ నైకా స్థాపకురాలు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి. నాయర్ స్వయంకృషి కలిగిన మహిళా, భారతీయ బిలియనీర్లలో ఒకరు.[3] నైకా స్టాక్ మార్కెట్ జాబితా తర్వాత, పబ్లిక్ ఇష్యూకు వెళ్ళిన వెంటనే, నాయర్ అత్యంత సంపన్నమైన మహిళా భారతీయ బిలియనీర్ గా ఒకరు అయ్యారు. భారతదేశంలోని మొదటి 20 సంపన్నుల జాబితాలో చేరింది.

ఫల్గుణి నాయర్
జననం (1963-02-19) 1963 ఫిబ్రవరి 19 (వయసు 61)[1]
జాతీయతIndian
విద్యMBA Finance
విద్యాసంస్థ
వృత్తిFounder & CEO of Nykaa
క్రియాశీల సంవత్సరాలు1963–present
జీవిత భాగస్వామి
Sanjay Nayar
(m. 1987)
పిల్లలు2

జీవితం

మార్చు

నాయర్ మహారాష్ట్రలోని ముంబైలోని గుజరాతీ కుటుంబంలో పుట్టి పెరిగారు. ఆమె వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది, ఆమె తండ్రి బేరింగ్ కంపెనీ వ్యాపారంలో ఉన్నాడు.[4] ఆమె సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాను పొందారు.[5]

కేరీర్

మార్చు

ఫల్గుణి నాయర్ తన ఉద్యోగ జీవితాన్ని 1985 లో ఏ.ఎఫ్ ఫెర్గూసన్ & కంపెనీతో గ్రాఫిక్ మేనేజర్ గా ప్రారంభం అయినది. ఆక్కడ సుమారు 9 సంవత్సరాలు పనిచేసి, తర్వాత లండన్, న్యూయార్క్ లలో 1994 సంవత్సరం నుంచి 2001 వ సంవత్సరం పనిచేసింది. నాయర్ తదుపరి డైరెక్టర్, ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ బిజినెస్ హెడ్ (2001-2007), కోటక్ సెక్యూరిటీస్ లో 13 సంవత్సరాలు, అదే సంస్థలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ గ్రాఫిక్ బాక్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ లో 2007 -2014 లో పనిచేసి, 2012 సంవత్సరంలో నైకా (Nykaa.com) ముంబై, మహారాష్ట్రలో స్థాపించింది.[6]

నైకా విలువ

మార్చు

2021 నవంబరు 10న నైకా స్థాపకురాలు ఫల్గుణి నాయర్ భారతదేశపు అత్యంత సంపన్న బిలియనీర్, 7వ మహిళా బిలియనీర్ అయ్యారు. నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఇ-కామర్స్ వెంచర్స్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో రూ.2,018కు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో రూ.2,001కు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సందర్భంగా రూ.2,001కు లిస్ట్ కావడంతో ఆమె నికర విలువ 6.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. నైకా మార్కెట్ లో ఐపిఒ జాబితా చేసిన ఐదు నిమిషాల్లోనే 13. 5  బిలియన్ డాలర్లకు చేరింది.  భారతదేశంలో స్టాక్ ఎక్స్ఛేంజీలో జాబితా చేయబడిన మొదటి మహిళా- ఆధ్వర్యంలో యూనికార్న్ స్టార్టప్ గా కూడా నైకా నిలిచింది.[7]

మూలాలు

మార్చు
  1. "Bio". Leaderbiography.com. 26 July 2018. Retrieved 30 April 2021.
  2. "Nykaa clocks Rs 214 cr revenue in 2016-17". Financialexpress (in ఇంగ్లీష్). Retrieved 2022-04-01.
  3. Bhandari, Shashwat (2020-03-08). "International Women's Day: Top 5 women ruling world of business". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-01.
  4. "A 'Beauty'ful Success Story- Falguni Nayar, CEO, Nykaa". Glow & lovely Careers (in ఇంగ్లీష్). Retrieved 2022-04-01.
  5. SinghBiography, Vineeta; Wiki; Age; Height; says, Family-Twestar (2021-11-10). "Falguni Nayar Biography, Wiki, Age, Height, Family & More" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-01.
  6. Aditya (2021-12-04). "Who is Falguni Nayar | Biography,Net worth". aadityacademy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-01.
  7. "Indian Personalities in News 2021: Neeraj Chopra, Virat Kohli, Harnaaz Sandhu, Mukesh Ambani, Anil Menon & 20 Other Person in News". Jagranjosh.com. 2021-12-29. Retrieved 2022-04-01.