ఫాతిమా సనా

పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారిణి

ఫాతిమా సనా (జననం 8 నవంబరు 2001) ఒక పాకిస్తానీ క్రికెటర్, కుడిచేతి మీడియం - ఫాస్ట్ బౌలర్ [1]. ఆమె ప్రధానంగా పాకిస్తాన్ తరపున ఆడుతుంది. కరాచీ జరాయ్ తారాకియాటి బ్యాంక్ లిమిటెడ్ ఇంకా బార్బడోస్ రాయల్స్ [2] తరపున దేశీయ క్రికెట్ ఆడింది. 2019 దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టులో ఆమె ఎంపికైంది.[3] 6 మే 2019న దక్షిణాఫ్రికా జరిగిన మహిళా ఒక రోజు అంతర్జాతీయ (డబ్ల్యూఓడిఐ) మ్యాచ్ లో పాకిస్తాన్ తరఫున మొదటిసారిగా ఆడింది.[4] మహిళా ట్వంటీ 20 అంతర్జాతీయ (టి20ఐ) మ్యాచ్ లో పాకిస్తాన్ తరఫున 15 మే 2019న దక్షిణాఫ్రికాతో తలపడింది.[5] జనవరి 2020లో ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఆమె ఎంపికైంది[6]. అదే సంవత్సరం 2డిసెంబరు లో పిసిబి అవార్డులకు 'ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' గా ఎంపికయ్యారు.[7]

ఫాతిమా సనా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫాతిమా సనా
పుట్టిన తేదీ (2001-11-08) 2001 నవంబరు 8 (వయసు 23)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలింగ్ ఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 79)2019 6 మే - దక్షిణ ఆఫ్రికా తో
చివరి వన్‌డే2023 11 సెప్టెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 43)2019 15 మే - దక్షిణ ఆఫ్రికా తో
చివరి T20I2023 3 సెప్టెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015–2017కరాచీ మహిళల క్రికెట్ జట్టు
2018/19జరై తారకియాతి బ్యాంక్ లి.మహిళా క్రికెట్ జట్టు
2022బార్బడోస్ రాయల్స్ (WCPL)
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WT20I WLA WT20
మ్యాచ్‌లు 21 7 42 25
చేసిన పరుగులు 177 33 414 151
బ్యాటింగు సగటు 11.80 33.00 16.56 37.75
100లు/50లు 0/0 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 28* 24* 56 41*
వేసిన బంతులు 798 144 1,619 517
వికెట్లు 27 7 51 26
బౌలింగు సగటు 27.81 23.42 25.15 21.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/39 3/27 5/39 3/23
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 4/– 9/– 10/–
మూలం: CricketArchive, 21 ఫిబ్రవరి 2023

జూన్ 2021లో వెస్టిండీస్ లో పర్యటించిన పాకిస్తాన్ జట్టులో సనా కూడా ఉంది.[8] పర్యటన ఆఖరి మ్యాచ్ లో ఫాతిమా[9] 5/39 తో WODI లో తన మొదటి ఐదు వికెట్లను తీసింది.[10] అక్టోబరు 2021లో జింబాబ్వేలో జరిగిన 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం ఆమె పాకిస్తాన్ జట్టులో ఎంపికైంది.[11] జనవరి 2022లో న్యూజిలాండ్లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆమె పాకిస్తాన్ జట్టులో ఎంపికైంది.[12] అదే సంవత్సరం మే లో ఇంగ్లాండ్, బర్మింగ్హామ్ లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆమె పాకిస్తాన్ జట్టులో ఎంపికైంది. టోర్నమెంట్లో ఆమె పాకిస్తాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.[13] ఆగస్ట్ లో మహిళా కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం ఆమె బార్బడోస్ రాయల్స్ విదేశీ క్రీడాకారిణిగా సంతకం చేసింది.[14]

సూచనలు

మార్చు
  1. "Player Profile: Fatima Sana". ESPNcricinfo. Retrieved 6 May 2019.
  2. "Player Profile: Fatima Sana". CricketArchive. Retrieved 6 January 2022.
  3. "Diana Baig ruled out of South Africa tour due to thumb injury". Pakistan Cricket Board. Retrieved 16 April 2019.
  4. "1st ODI, ICC Women's Championship at Potchefstroom, May 6 2019". ESPN Cricinfo. Retrieved 6 May 2019.
  5. "1st T20I, Pakistan Women tour of South Africa at Pretoria, May 15 2019". ESPN Cricinfo. Retrieved 15 May 2019.
  6. "Pakistan squad for ICC Women's T20 World Cup announced". Pakistan Cricket Board. Retrieved 20 January 2020.
  7. "Short-lists for PCB Awards 2020 announced". Pakistan Cricket Board. Retrieved 1 January 2021.
  8. "26-player women squad announced for West Indies tour". Pakistan Cricket Board. Retrieved 21 June 2021.
  9. "Fatima Sana's all-round display helps Pakistan Women clinch rain-affected final ODI". ESPN Cricinfo. Retrieved 19 July 2021.
  10. "Fatima Sana Leads Pakistan Women's Bowling Attack in ICC T20 World Cup Match Against India". Lahore Herald (in అమెరికన్ ఇంగ్లీష్). 12 Feb 2023. Archived from the original on 21 ఫిబ్రవరి 2024. Retrieved 16 నవంబరు 2023.
  11. "West Indies to tour Pakistan for three ODIs from November 8; Javeria Khan to lead the hosts". Women's CricZone. Retrieved 21 October 2021.
  12. "Bismah Maroof returns to lead Pakistan in World Cup 2022". Women's CricZone. Retrieved 24 January 2022.
  13. "Women squad for Commonwealth Games announced". Pakistan Cricket Board. Retrieved 31 May 2022.
  14. "Athapaththu, Khaka and Luus brought in for Women's CPL and 6ixty". ESPN Cricinfo. Retrieved 16 August 2022.