వెస్ట్ ఇండీస్ అనేది ఉత్తర అమెరికా లోని ఉపప్రాంతం. దాని చుట్టూ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం ఉన్నాయి. ఇందులో 13 స్వతంత్ర ద్వీప దేశాలు, 18 డిపెండెన్సీలు, ఇతర భూభాగాలు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ ఆంటిల్లీస్, లెస్సర్ ఆంటిల్లెస్, లుకాయన్ ద్వీపసమూహం అనే మూడు ప్రధాన ద్వీపసమూహాలు ఉన్నాయి. [1]

ఉపప్రాంతంలో యాంటిలిస్‌లోని అన్ని ద్వీపాలు, అలాగే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బహామాస్, టర్క్స్, కైకోస్ దీవులు ఉన్నాయి. వెస్ట్ ఇండీస్ అనే పదాన్ని కరేబియన్ అనే పదానికి సమానార్థకంగా వాడుతున్నారు. అయితే కరిబియన్‌లో బెలిజ్, గయానా, సూరినామ్, ఫ్రెంచ్ గయానా, అట్లాంటిక్ ద్వీప దేశాలైన ట్రినిడాడ్ టొబాగో, బెర్ముడాలు కూడా భాగమే. ఈ చివరి రెండూ భౌగోళికంగా మూడు ప్రధాన ద్వీప సమూహాల నుండి విడిగా ఉన్నప్పటికీ, సాంస్కృతికంగా సంబంధం కలిగి ఉంటాయి.

పదం వ్యుత్పత్తి, మూలం, ఉపయోగం

మార్చు

1492లో, క్రిస్టోఫర్ కొలంబస్ ఈ ద్వీపాలకు తన రాకను రికార్డ్ చేసిన మొదటి యూరోపియన్ యాత్రికుడు. ఇక్కడ అతను బహామాస్‌ భూమిపై మొదటిసారి అడుగు పెట్టాడని చరిత్రకారులు భావిస్తారు. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాకు చేసిన మొదటి ప్రయాణాల తర్వాత, యూరోపియన్లు ఈ ప్రాంతాన్ని, అసలు "ఇండీస్ " (అంటే ఇండియా అని అర్థం) నుండీ దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా లోని ఈస్ట్ ఇండీస్ నుండీ వేరుగా చూపడానికి వెస్టిండీస్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. [2] [3] [4]

క్రికెట్ క్రీడ చాలా బ్రిటీష్ వలస రాజ్యాలలో ప్రసిద్ధి చెందింది. 1890లలో, ఉమ్మడి వెస్టిండీస్ క్రికెట్ జట్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించాయి. 1920లలో, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఏర్పడి, టెస్ట్ హోదాను పొందింది .

చరిత్ర

మార్చు

ఈ ద్వీపాలకు చెందిన అనేక స్థానిక సంస్కృతుల్లో కొన్ని సా.పూ. 6వ సహస్రాబ్ది మధ్య కాలానికి చెందినవి.

పదహారవ శతాబ్దం చివరలో, ఫ్రెంచ్, ఇంగ్లీష్, డచ్ వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తులూ కరేబియన్ సముద్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించారు. వీరు స్పానిష్, పోర్చుగీస్ షిప్పింగ్ తీర ప్రాంతాలపై దాడి చేశారు. వారు లెస్సర్ యాంటిల్లెస్ దీవులు, ఒరినోకో ముఖద్వారంతో సహా దక్షిణ అమెరికా ఉత్తర తీరంలోను, మధ్య అమెరికా అట్లాంటిక్ తీరంతో సహా స్పానిష్ జయించలేని ప్రాంతాలలో ఆశ్రయం పొంది, తమ నౌకల మరమ్మత్తులు చేసుకునేవారు. 1624లో సెయింట్ కిట్స్, 1626లో బార్బడోస్ వలసరాజ్యం తర్వాత లెస్సర్ ఆంటిల్లెస్‌లో వారు స్థిరపడ్డారు. పదిహేడవ శతాబ్దం మధ్యలో చక్కెర విప్లవం ప్రారంభమైనప్పుడు, పొలాలు, మిల్లుల్లో పని చేయడానికి వేలాది మంది ఆఫ్రికన్‌లను బానిస కార్మికులుగా తీసుకువచ్చారు. ఈ ఆఫ్రికన్లు ఒక జనాభా విప్లవాన్ని సృష్టించి, స్థానిక కారిబ్‌లు లేదా ఒప్పంద సేవకులుగా వచ్చినయూరోపియన్ సెటిలర్‌ల స్థానాన్ని ఆక్రమించడమో వాళ్ళతో కలిసిపోవడమో చేసారు.

ఉత్తర యూరోపియన్లు, స్పానిష్ వారికీ మధ్య పోరాటం పదిహేడవ శతాబ్దపు మధ్యకాలం నుండి పదిహేడవ శతాబ్దం చివరి నాటికి దక్షిణాదికి వ్యాపించింది. ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్, స్పానిష్ వలసవాదులు ఆఫ్రికా నుండి తీసుకువచ్చిన బానిసలు మొదట ప్రవేశించి, తరువాత ది గయానాస్ తీరాన్ని (ఇది ఫ్రెంచ్, ఇంగ్లీష్, డచ్ వారి ఆక్రేమణకు లోనైంది) ఒరినోకో లోయను (ఇది స్పానిష్‌లు ఆక్రమించారు) ఆక్రమించారు. డచ్ వారు ఒరినోకో లోని కరిబ్స్‌తో పొత్తు పెట్టుకుని, ఒరినోకో వెంట, ఆ తరువాత అమెజాన్ యొక్క ఉత్తర ప్రాంతాల వెంట దక్షిణ అమెరికాలో పోరాటాలను బాగా లోపలికి తీసుకువెళ్లారు.

 
ఖండాంతర అమెరికాలకు సంబంధించి వెస్టిండీస్

ఏ ఒక్క ఐరోపా దేశం కూడా సెంట్రల్ అమెరికాలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించనందున, క్రమంగా జమైకాకు చెందిన ఆంగ్లేయులు మిస్కిటో రాజ్యమైన ఆధునిక నికరాగ్వా, హోండురాస్‌లతో పొత్తులను ఏర్పరచుకున్నారు. ఆపై ఆధునిక బెలిజ్ తీరంలో కలప కొట్టడం ప్రారంభించారు. ఇలా పరస్పరం అనుసంధానించబడిన వాణిజ్య, దౌత్య సంబంధాలతో పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో పశ్చిమ కరేబియన్ జోన్‌ ఏర్పడింది. మిస్కిటో రాజ్యంలో, 1640 లలో బానిస ఓడలో తిరుగుబాటు నుండి బయటపడినవారితో మిస్కిటో-జాంబోస్ అధికారంలోకి వచ్చారు. మిస్కిటో ప్రాంతంలో, బెలిజ్‌లో బ్రిటిష్ స్థిరనివాసులు ఆఫ్రికన్ బానిసలను ప్రవేశపెట్టడంతో ఇది, కరేబియన్‌లోని మిగిలిన ప్రాంతాలు ఆఫ్రికన్ సంతతి మెజారిటీగా ఉన్న ప్రాంతంగా మారాయి.

17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు, వెస్టిండీస్‌లో ఉన్న యూరోపియన్ కలోనియల్ భూభాగాలు - ఫ్రెంచ్ వెస్టిండీస్, బ్రిటిష్ వెస్టిండీస్, డానిష్ వెస్టిండీస్, నెదర్లాండ్స్ ఆంటిల్లీస్ (డచ్ వెస్ట్ ఇండీస్), స్పానిష్ వెస్టిండీస్.

1916లో, డేనిష్ వెస్టిండీస్ ఒప్పందం ప్రకారం, డెన్మార్క్ డానిష్ వెస్టిండీస్‌ను అమెరికాకు [5] US$25 మిలియన్ల బంగారానికి విక్రయించింది. డెన్మార్క్ వెస్టిండీస్ యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్ అనే పేరుతో అమెరికా యొక్క ఇన్సులర్ ప్రాంతంగా మారింది.

1958, 1962 ల మధ్య యునైటెడ్ కింగ్‌డమ్, తమ వెస్టిండీస్ ద్వీప ప్రాంతాలన్నింటినీ (బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, బహామాస్ మినహా) వెస్టిండీస్ ఫెడరేషన్‌గా తిరిగి నిర్వచించింది. ఫెడరేషన్ అంతా ఒకే స్వతంత్ర దేశంగా కలిసిపోతుందని వారు ఆశించారు. అయితే, ఫెడరేషను అధికారాలు పరిమితంగానే ఉన్నాయి. అనేక ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయి. ప్రజాదరణ లేదు. తత్ఫలితంగా, 1963లో దీన్ని బ్రిటిష్ వారు రద్దు చేసారు. చివరికి తొమ్మిది ప్రావిన్సులు స్వతంత్ర సార్వభౌమ రాజ్యాలుగా మారగా, నాలుగు ప్రస్తుత బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీలుగా మారాయి.

"వెస్ట్ ఇండీస్" లేదా "వెస్ట్ ఇండియా" అనే పదాలు డానిష్ వెస్ట్ ఇండియా కంపెనీ, డచ్ వెస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ వెస్ట్ ఇండియా కంపెనీ, స్వీడిష్ వెస్ట్ ఇండియా కంపెనీతో సహా 17వ 18వ శతాబ్దాలకు చెందిన అనేక కంపెనీల పేర్లలో భాగం. [6]

వెస్టిండీస్ ప్రజలను సూచించడానికి వెస్ట్ ఇండియన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. [7]

ఉపప్రాంతం, ద్వీపసమూహం వారీగా దేశాలు, భూభాగాలు

మార్చు
 
వెస్ట్ ఇండీస్ రాజకీయ పటం

కరేబియన్

మార్చు

యాంటిల్లెస్

మార్చు
గ్రేటర్ యాంటిలిస్
మార్చు
లెస్సర్ యాంటిల్లెస్
మార్చు
లీవార్డ్ యాంటిల్లెస్
మార్చు
లీవార్డ్ దీవులు
మార్చు
విండ్‌వార్డ్ దీవులు
మార్చు
లెస్సర్ యాంటిలిస్‌లోని వివిక్త ద్వీపాలు
మార్చు

కరేబియన్‌లో చెల్లాచెదురుగా ఉన్న ద్వీపాలు

మార్చు

లూకాయన్ ద్వీపసమూహం

మార్చు

మధ్య అమెరికా

మార్చు

ఉత్తర అమెరికా

మార్చు

దక్షిణ అమెరికా

మార్చు

NB: ఇటాలిక్స్‌లోని భూభాగాలు ప్రాంతీయ సార్వభౌమ రాజ్యాలు లేదా సార్వభౌమత్వం లేని పరాధీన భూభాగాలు.

* ఈ మూడు డచ్ కరేబియన్ భూభాగాలు BES దీవులను ఏర్పరుస్తాయి.

భౌతికంగా, ఇవి ఖండంలో భాగమైన ద్వీపాలు. అగ్నిపర్వత విండ్‌వార్డ్ ఐలాండ్స్ ఆర్క్‌లో భాగం కాదు. అయితే, సామీప్యత ఆధారంగా, ఈ ద్వీపాలను కొన్నిసార్లు విండ్‌వర్డ్ దీవులతో సాంస్కృతికంగా, రాజకీయంగా వర్గీకరిస్తారు.

~ కొలంబియా నియంత్రణలో ఉన్న వివాదాస్పద భూభాగాలు .

UN మెక్సికోను సెంట్రల్ అమెరికాలో చేరుస్తుంది. [8]

# భౌతికంగా, బెర్ముడా అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక వివిక్త సముద్ర ద్వీపం. కరేబియన్, వెస్ట్ ఇండీస్, ఉత్తర అమెరికా ఖండం లేదా దక్షిణ అమెరికా ఖండంలో భాగం కాదు. సామీప్యత ఆధారంగా సాధారణంగా ఉత్తర అమెరికా దేశాలతో భాగంగా చూస్తారు; కొన్నిసార్లు సాంస్కృతికంగా వెస్టిండీస్‌తో కలిసి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Caldecott, Alfred (1898). The Church in the West Indies. London: Frank Cass and Co. p. 11. Retrieved 12 December 2013.
  2. "HISTORY OF THE CARIBBEAN (WEST INDIES)". www.historyworld.net.
  3. "west+indies | Origin and meaning of phrase west+indies". Online Etymology Dictionary.
  4. "East Indies". Encyclopedia.com.
  5. "Two telegrams about the sale – The Danish West-Indies". The Danish West-Indies (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 13 October 2017.
  6. Garrison, William L.; Levinson, David M. (2014). The Transportation Experience: Policy, Planning, and Deployment (in ఇంగ్లీష్). OUP USA. ISBN 9780199862719.
  7. "Info Please U.S. Social Statistics". Retrieved 1 October 2015.
  8. "UNSD Methodology – Standard country or area codes for statistical use (M49)". Archived from the original on 2017-08-30. Retrieved 2020-05-04.