ఫాదర్ రవి శేఖర్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
ఫాదర్: దూసి రవిశేఖర్ . ఎస్. జె. (ఆగష్టు 28, 1967 - జూన్ 10, 1986)
- పేరు : ఫాదర్: దూసి రవిశేఖర్ . ఎస్. జె.
- జననం : 28-8-1967
- దైవపిలుపు : 10-6-1986
- తల్లిదండ్రులు : నక్షత్రమ్మ, మానియేలు.
- విద్యాభ్యాసం : వీరఘట్టం, పార్వతీపురం.
- జన్మ స్థలం : వీరఘట్టం, పార్వతీపురంలో.
- సంగీతంలో : ఎం. ఎ. పట్టం పొందారు. మరికొన్ని పాటలను రచన చేశారు.
- ప్రస్తుతం : ఆంధ్ర లొయోల కళాశాలలో రెక్టర్ గా ఉన్నారు.
- అవార్డ్స్ : రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘నంది’ అవార్డును పొందారు.
జననం : శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం అనే ఊరిలో దూసి మానియేలు, నక్షత్రమ్మ అనే పుణ్య దంపతులకు 1967, ఆగష్టు 28 న ఐదవ సంతానంగా జన్మించారు. ఫా. దూసి రవిశేఖర్. ఎస్. జె. ఆయన జన్మించిన ఆ శుభ గడియలు తనకు దీవెనలై కళామతల్లి కలాదర్శిని ఒడికి చేర్చాయి.
విద్యాభ్యాసం : తాను పుట్టి పెరిగిన వీరఘట్టంలోనే ప్రాథమిక విద్యనూ, పార్వతీపురంలో ఉన్నత విద్యను అభ్యసించారు. చిన్న వయస్సు నుండి చదువు పట్ల ఆసక్తి ఉన్న ఫా.రవిశేఖర్, ఎస్. జె. పాఠశాల విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించి, తదనంతరం కళాశాల విద్యకై శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చేరి అత్యుత్తమ ఫలితాలు సాధించారు.
దైవపిలుపు : కళాశాల విద్యానంతరం దేవుని పిలుపుకు ఆకర్షితులై తనను ఎంతగానో ప్రేమించే తన కుటుంబాన్ని వదలి 10-6-1986 సం.లో జేసు సభ మఠములో చేరారు. 1996 వ సం.లో కళలకు నిలయమైన కళాదర్శినిలో అడుగు పెట్టారు. అప్పటి కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసారు. తండ్రి ఉపదేశి అయినందున చిన్నప్పటినుండి దేవునిపట్ల భయభక్తులతో పెరిగారు. ఆ స్ఫూర్తితో ప్రభుని సేవలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్నిటినీ అధిగమిస్తూ, ఆ ప్రభుని సువార్తను చాటడానికి దృఢ నిశ్చయంతో 13-11-1999 ఆంధ్ర లొయోల కళాశాలలో మహా. ఘన. శ్రీ శ్రీ మారంపూడి జోజి తండ్రిగారి చేతుల మీద గురువుగా అభిషిక్తులైనారు.
కళాసేవ : చిన్నప్పటి నుండి మన రవిశేఖర్ ఫాదర్ గారికి సంగీతం అంటే ఏంతో ప్రీతి. ఆ ఆసక్తిలోని ప్రముఖ సంగీత విద్వాంసులైన శ్రీ మల్లాది సూరిబాబు గారి దగ్గర సంగీతంలో మెళకువలు నేర్చుకుని చివరికి తన సంగీత విద్యనూ కూడా ఆ దేవునికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. అంతలో దైవ సేవకై ఖమ్మం జిల్లాలోని మిట్టపల్లి అనే కుగ్రామానికి పంపబడ్డారు. అక్కడ ఉన్న దళిత క్రైస్తవులను ఆదరించి తన ప్రేమానురాగాలను పంచారు. అక్కడ పేదలను వారు పడుతున్న కష్టాలను చూసి చలించి, వారికి చదువుతో పాటూ కళను నేర్పించాలనే ఉద్దేశంతో కొంతమంది విద్యార్థినీ, విద్యార్థులను చేరదీసి విజయవాడలోని కలాదర్శినికి తీసుకువచ్చారు. ఆనాడు తీసుకున్న నిర్ణయం ఎంతో మంది విద్యార్థుల పట్ల వరంగా మారింది. దాని ఫలితమే ఇప్పుడు సమాజానికి దోహదపడి, ఎంతో మంది కళాకారులు, విద్యావంతులు కళాదర్శినికి వచ్చిన తొలి నాళ్ళలోనే “ప్రేమ సామ్రాజ్యం” అనే నాటికకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అత్యుత్తమ ‘నంది’ అవార్డులను సాధించిన ఘనత మన ప్రియతమ ఫా. రవిశేఖర్. ఎస్.జె. గారిది. 2009 వ సం.లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో ఎం.ఎ. పట్టం పొంది, సంగీతం పై తనకున్న ఆసక్తిని ప్రేమను చాటిచెప్పారు. అతి చిన్న వయస్సులోనే ఆంధ్ర లొయోల కళాశాల రెక్టర్గా ఎన్నికైన ఘనత ఫా. రవిశేఖర్. ఎస్. జె. గారిది. విజయవాడలో కలాదర్శిని అంటే ఫా. రవిశేఖర్. ఎస్. జె., ఫా. రవిశేఖర్. ఎస్. జె. అంటే కలాదర్శిని అనే స్థాయికి వెళ్ళారని చెప్పాలంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం విజయవాడలోని ఆంధ్ర లొయోల కళాశాలలో వివిధ శాఖల విధులను నిర్వహిస్తూ అటు సమాజానికి ఇటు దేవునికి సేవ చేస్తున్న గొప్ప వారు మన దూసి రవిశేఖర్. ఎస్. జె. గారు.
మూలాలు
మార్చుhttp://ww.andhraloyolacollegew.ac.in/staff.php?id=48[permanent dead link].