ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్

ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ అనేది రోగి విదేశీ యాస లేదా భాష మాట్లాడి అర్థంచేసుకోగల స్థితి సాధించే అరుదైన వైద్య స్థితి.[1]

సాధారణంగా బ్రెయిన్ యాక్సెంట్ సిండ్రోమ్ బ్రెయిన్ స్ట్రోక్ ఫలితంగా వస్తూంటుంది,[1] అయితే తలకు తగిలే బలమైన గాయం వల్ల,[1] మైగ్రేన్ వల్ల[2] లేదా డెవలప్మెంటల్ సమస్యల వల్ల కూడా రావచ్చు.[3] ఈ స్థితి మొట్టమొదట 1907లో నమోదచేయబడింది,[4] 1941 నుంచి 2009 వరకూ 69 నమోదైన కేసులున్నాయి.[3]

వక్రీకరించిన ఆర్టిక్యులేటరీ ప్లానింగ్ కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. పలు పత్రికలు ఈ సమస్య వల్ల దగ్గరలోని యాస, భాష వచ్చినట్టు రాస్తున్నా, ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ ఉన్నవారికి ప్రత్యేకించిన విదేశ యాస గానీ, మరే విదేశీభాషల్లో ధారాళంగా మాట్లాడే శక్తికానీ రాదు. 2010లో వెలుగుచూసిన ఓ నిర్ధారితం కాని వార్తాకథనం ప్రకారం క్రోటియన్ భాషా వ్యవహర్త కోమా నుంచి బయటకు రాగానే జర్మన్ భాష ధారాళంగా మాట్లాడేశక్తి కలిగింది,[5] కానీ మెదడుకు కలిగిన గాయం తర్వాత రోగి విదేశీభాష మాట్లాడే శక్తి పెరిగినట్టు నిర్ధారితమైన కేసు లేదు. పిల్లల్లో ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్ ఉన్నవారి నుంచి వారి తోబుట్టువులో, స్నేహితులో వారి కొత్త యాసను అందిపుచ్చుంకుంటున్నారన్న కేసులు నమోదయ్యాయి.[6]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Kurowski KM, Blumstein SE, Alexander M. (1996).
  2. "Severe migraines give Devon woman a bizarre Chinese accent at". Asylum.co.uk. Archived from the original on 24 జూలై 2011. Retrieved 16 June 2011.
  3. 3.0 3.1 మూస:Cite PMID
  4. Marie P. (1907).
  5. "Croatian teenager wakes from coma speaking fluent German". The Daily Telegraph. London: Telegraph Media Group. 12 April 2010. Retrieved 17 April 2010.
  6. "Foreign Accent Syndrome: What Is It? And Most Notable Cases". Healthmango. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 24 October 2013.

ఇతర లింకులు మార్చు