రఘుపతి సహాయ్ ఫిరాఖ్

భారతీయ కవి మరియు రచయిత
(ఫిరాఖ్ గోరఖ్‌పురి నుండి దారిమార్పు చెందింది)

రఘుపతి సహాయ్ 'ఫిరాఖ్' గోరఖ్‌పూరీ (ఉర్దూ: فراق گورکھپوری, హిందీ: फ़िराक़ गोरखपुरी) (1896 - 1982), ప్రముఖ ఉర్దూ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ప్రామాణిక ఉర్దూ సాహిత్య జగత్తులో ప్రముఖంగా ప్రస్తావించవలసిన కవి. సాహిర్, ఇక్బాల్, భూపేంద్రనాథ్ కౌషిక్ ఫిక్ర్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, కైఫీ అజ్మీల వంటి ప్రముఖ ఉర్దూ కవుల సమకాలీకుడు. ఈయన కవితాసంకలనాలలో రూహ్-ఓ-ఖయామత్, గుల్-ఏ-రనా, నగ్మానుమా, ఈయన సర్వోత్కృష్ట రచన గుల్-ఏ-నగ్మా ప్రముఖమైనవి.

రఘుపతి సహాయ్ ఫిరాఖ్
150px
పుట్టిన తేదీ, స్థలంRaghupati Sahay
(1896-08-28) 1896 ఆగస్టు 28
Gorakhpur, Uttar Pradesh, భారత దేశము
మరణం1982 మార్చి 3 (1982-03-03)(వయసు 85)
New Delhi, భారత దేశము
కలం పేరుFiraq Gorakhpuri
వృత్తిPoet, writer, critic, scholar, lecturer, orator
భాషUrdu, English, Hindi
జాతీయతభారత దేశముn
విద్యM.A. in English literature
రచనా రంగంPoetry, Literary criticism
గుర్తింపునిచ్చిన రచనలుGul-e-Naghma
పురస్కారాలుPadma Bhushan (1968)
Jnanpith Award (1969)
Sahitya Akademi Fellowship (1970)

సంతకం

'''''

రఘుపతి సహాయ్ 1896లో గోరఖ్‌పూర్‌లోని కాయస్థ కుటుంబంలో జన్మించాడు. ప్రాంతీయ సివిల్ సర్వీసులో పదవి పొంది ప్రభుత్వోద్యోగిగా పనిచేశాడు. ఆ తరువాత్ రాజీనామా చేసి అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా ఉపన్యాసకునిగా పనిచేశాడు. ఉర్దూ భాషా మణిబాల 'గుల్-ఎ-నగ్మా' రచించాడు. ఈ రచన ఆయనకు జ్ఞానపీఠ అవార్డుతో పాటు 1960 సంవత్సరానికి ఉర్దూలో సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని కూడా తెచ్చిపెట్టింది.[1]

ఫిరాఖ్ ఉర్దూ భాషలో ప్రప్రథమంగా జ్ఞానపీఠ అవార్డును పొందిన ఘనుడు.

రచనలుసవరించు

  • గుల్-ఎ-నగ్మా
  • గుల్-ఎ-రానా
  • మషాల్
  • రూహ్-ఎ-కాయినాత్
  • రూప్ (రుబాయి)
  • షబిస్తాన్
  • సర్గం
  • బజ్మ్-ఎ-జిందగి రంగ్-ఎ-షాయరి

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

  1. Awards - 1955-2007 Sahitya Akademi Official listing.
  2. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. మూలం నుండి 2007-10-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-02-24. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు

An example of his work (on YouTube): [1]

మూలాలుసవరించు