ఫిల్మ్‌న్యూస్ ఆనందన్

భారతీయ సినిమా చరిత్రకారుడు

ఫిల్మ్‌ న్యూస్ ఆనందన్ (బాల్యనామం "మణి") [2] భారతీయ సినిమా చరిత్రకారుడు.[5] ఆయన తమిళ సినిమా రంగంలో "వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా"  గా  సుపరిచితుడు.[6][7]

ఫిల్మ్‌న్యూస్ ఆనందన్
జననం1 జనవరి 1926 or 1928[a]
మరణం21 మార్చి 2016[1]
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిసినిమా చరిత్రకారుడు, ఫోటోగ్రాఫర్

ప్రారంభ జీవితం మార్చు

ఆయన బాల్యనామం మణి. ఆయన తండ్రి పి.కె.జ్ఞానసాగరం ప్రభుత్వోద్యోగి. పాఠశాలలో చేరే సమయంలో పాఠశాల ప్రధానాధ్యాపకులకు తన పేరు "ఆనందకృష్ణన్"  గా  చెప్పడం  జరిగింది.  తరువాత  ఆ పేరు నిలిచిపోయింది.  తరువాత  తన పేరు సంగ్రహంగా "ఆనందన్" గా స్థిరపడింది.[8] పాఠశాల  విద్య  తరువాత ఆయన  క్వాడి మిలాత్ ఆర్ట్స్ కళాశాలలో చేరారు. ఆ కళాశాల  ప్రభుత్వ  ఆర్ట్స్  కళాశాలగా  సుపరిచితం. ఆయన కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు  వై.జి.పార్థసారథి ,   ఎం.జి.రామచంద్రన్ వంటివారి  యొక్క  నాటక  కంపెనీలలో  చేరే  అవకాశం  వచ్చింది. ఆయన  నాటకాలకు  సంభాషణలు  వ్రాసేవారు. ఆయన  నాటకానికి  సహాయ సహకారాలనందించేవారు.[9]

వృత్తి మార్చు

ఆనందన్ కెమేరామన్ గా కావాలని ఆసక్తి ప్రదర్శించేవారు. ఆయన సి.జె.మోహన్ కు సహాయకునిగా వృత్తి జీవితం ప్రారంభించారు. జి.జె. మోహన్ కలైవనార్ సినిమా యొక్క కెమేరామన్. ఆనందన్ ఆయన వద్ద ఫోటోగ్రఫీ పై శిక్షణ పొందారు. ఆనందన్ యొక్క చిత్రాలను చూసి మోహన్ అభినందించి ఒక రోలిప్లెక్స్ కెమేరాను కొనుక్కోవలసినదిగా సూచించారు. కెమెరా కొన్న తరువాత ఆయన ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ యొక్క చిత్రాలను తీసారు. ఆనందన్ ఫిలిం ఛాంబర్ కు న్యూస్ రిపోర్టరుగా పనిచేసారు. ఆయన సినిమా నతులు, దర్శకులు, నిర్మాతల యొక్క వివరాలను సేకరించే పని చేసేవారు. ఒకసారి ఫిలిం న్యూస్ మ్యాగజైనలో చిత్రాలను సేకరించమని దేవరాజన్ కోరారు. ఆయన మ్యాగజైన్లో "ఫిల్మ్‌ న్యూస్ ఆనందన్" అని శీర్షిక ఉంచి ఆయనను గుర్తించారు. తరువాత ఆయన పేరు "ఫిల్మ్‌ న్యూస్ ఆనందన్" అనే కలం పేరుతో స్థిరపడింది.[8][9][10]

నటునిగా ఆనందన్ యొక్క మొదటి చిత్రం "పోలీస్‌కరణ్ మంగల్" (1962). ఆ చిత్రంలో ఆయన పోలీసు ఫోటోగ్రాఫర్ గా నటించారు. ఆయన ఆ సినిమా తెలుగు రీమేక్ అయిన "కానిస్టేబుల్ కూతురు" కో కూడా నటించారు. "బొమ్మై" (1964) లో ఆయన డాక్టరుగా నటించారు. "నట్చరిత్రం" (1980) లో ఆయన ప్రెస్ ఫోటోగ్రాఫరుగానూ, 1986 లో "ఓమై విఝిగల్"లో ప్రెస్ ఫోటోగ్రాఫర్ గానూ నటించారు. 1992 లో విడుదలైన "సుగమన సుమైగల్" చిత్రంలో కథానాయిక తండ్రిగా నటించారు.[11] ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు మార్చి 2016 న ఆయన సినిమాకు శాశ్వత ఎగ్జిబిషన్ ను యేర్పాటుచేయాలనే కోరికను వెల్లడించారు.[12]

ప్రపంచ సినీ చరిత్రలోనే తొలి పీఆర్‌వో ఫిలిం న్యూస్ ఆనందనేనట. సినిమానే జీవితంగా, శ్వాసగా పీల్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఫిలిం న్యూస్ ఆనందన్. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి ప్రఖ్యాత తెలుగు నటుల చిత్రాలకు పీఆర్‌వోగా పనిచేశారు. అలా పలు భాషలలో 1500 పైగా చిత్రాలకు ప్రచార కర్తగా విశేష సేవలందించిన ఫిలిం న్యూస్ ఆనందన్ సినీ విక్కీపీడియా అనవచ్చు. నాటి టాకీ చిత్రాల నుంచి ఇటీవల విడుదలై డిజిటల్, 3డీ చిత్రాల వరకూ ఏ అంశం గురించి అయినా ఆనందన్ వద్ద కచ్చితమైన సమాచారం ఉంటుంది.

సినిమాకు సంబంధించి మూడు పుస్తకాలను రచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రోత్సాహంతో సాధనై పడిత్త తమిళ్ తిరైపడ వరలారు పేరుతో పెద్ద గ్రంథాన్ని రాశారు. 1991లో రాష్ట్ర ప్రభుత్వం అందించే కలైమామణి అవార్డుతో పాటు అనేక అవార్డులు, రివార్డులను అందుకున్న ఫిలిం న్యూస్ ఆనందన్ భీష్మ అవార్డుతోనూ సత్కరింపబడ్డారు.[13]

మరణం మార్చు

ఆయన 2016 మార్చి 21 న మరణించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][14]

నోట్స్ మార్చు

  1. Both Udhav Naig of The Hindu and the Press Trust of India state Anandan's year of birth to be 1926,[1][2] while Sudhish Kamath of The Hindu, and Jyothsna of Behindwoods state the year of birth to be 1928.[3][4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "'Film News' Anandan, cinema historian, passes away". Business Line. Press Trust of India. 21 March 2016. Retrieved 21 March 2016.
  2. 2.0 2.1 Naig, Udhav (21 March 2016). "South Indian cinema historian Anandan passes away". The Hindu. Retrieved 21 March 2016.
  3. Kamath, Sudhish. "Behind the scenes of Tamil cinema". The Hindu. Retrieved 28 October 2015.
  4. Jyothsna (21 March 2016). "Film News Anandan Is No More". Behindwoods. Retrieved 22 March 2016.
  5. Kannan, Ramya. "Film news personified: He made stars glitter". The Hindu. Retrieved 10 March 2015.
  6. "Film directors Who Made a Difference in Tamil Cinema World". Indolink.com. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 10 March 2015.
  7. "Our thanks to 'Film News' Anandan". Lakshmansruthi.com. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 10 March 2015.
  8. 8.0 8.1 Rangarajan, Malathi. "Tryst with the past". The Hindu. Retrieved 10 March 2015.
  9. 9.0 9.1 "The mobile library of Tamil Cinema". Chennai Online. Archived from the original on 16 ఫిబ్రవరి 2005. Retrieved 19 జూన్ 2016.
  10. "Sunday Celebrity: 'Film News' Anandan, the mobile encyclopedia on films". Asian Tribune. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 10 March 2015.
  11. Srinivas Chari, T. K. (June 2011). "The film photographer" (PDF). Madras Musings. p. 8. Archived from the original (PDF) on 10 మార్చి 2015. Retrieved 19 జూన్ 2016.
  12. "'Keen on Permanent Exhibition on Cinema'". The New Indian Express. 22 March 2016. Archived from the original on 24 ఏప్రిల్ 2016. Retrieved 15 April 2016.
  13. ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ ఇకలేరు
  14. "Tamil film historian "Film News Anandan" passes away". The News Minute. 21 March 2016. Retrieved 21 March 2016.